తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu Power Glance: పవన్‌ బర్త్‌డే గిఫ్ట్‌.. పవర్‌ గ్లాన్స్‌ అనౌన్స్‌ చేసిన మేకర్స్‌

Hari Hara Veera Mallu Power Glance: పవన్‌ బర్త్‌డే గిఫ్ట్‌.. పవర్‌ గ్లాన్స్‌ అనౌన్స్‌ చేసిన మేకర్స్‌

HT Telugu Desk HT Telugu

31 August 2022, 14:37 IST

    • Hari Hara Veera Mallu Power Glance: పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ గిఫ్ట్‌ ఇవ్వనున్నారు హరి హర వీర మల్లు మేకర్స్‌. బుధవారం (ఆగస్ట్‌ 31) ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్‌ చేశారు.
హరి హర వీర మల్లు మూవీలో పవన్ కల్యాణ్
హరి హర వీర మల్లు మూవీలో పవన్ కల్యాణ్ (Twitter)

హరి హర వీర మల్లు మూవీలో పవన్ కల్యాణ్

Hari Hara Veera Mallu Power Glance: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌ డే సందడి అప్పుడే మొదలైంది. శుక్రవారం (సెప్టెంబర్‌ 2) పవన్‌ పుట్టిన రోజు జరుపుకోనుండగా.. అభిమానుల హడావిడి ఓ రేంజ్‌లో ఉంది. ఈ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు హరి హర వీర మల్లు మేకర్స్‌ ఓ గిఫ్ట్‌ ఇవ్వనున్నట్లు అనౌన్స్‌ చేశారు. బుధవారం (ఆగస్ట్‌ 31) వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

అంతేకాదు ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. "స్పెషల్‌ డే అయిన సెప్టెంబర్‌ 2 సాయంత్రం 5.45 గంటలకు ఓ గ్రాండ్‌, అగ్గి పుట్టించే హరి హర వీర మల్లు పవర్‌ గ్లాన్స్‌ వస్తోంది. ఈ మాసివ్‌ బ్లిట్జ్‌ కోసం సిద్ధంగా ఉండండి" అని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ అనౌన్స్‌ చేసింది. పవన్‌కు సంబంధించిన ఓ ఇంటెన్స్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే నాడు హరి హర వీర మల్లు టీమ్‌ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ రాబోతోందని ముందు నుంచే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మూవీ మేకర్స్‌ అధికారికంగా ఈ విషయాన్ని చెప్పారు. భీమ్లా నాయక్‌ తర్వాత పవన్‌ నటిస్తున్న మూవీ ఇది. క్రిష్‌ జాగర్లమూడి డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీకి షూటింగ్‌లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రొడ్యూసర్‌ ఏఎం రత్నం ఆర్థిక సమస్యల కారణంగా చాలా కాలం పాటు షూటింగ్‌ ఆగిపోయింది.

అసలు ఈ సినిమా ముందడుగు వేస్తుందా అన్న సందేహాలు కూడా తలెత్తినా.. చివరికి ఎలాగోలా గాడిన పడింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 30న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ మూవీలో పవన్‌ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తున్నాడు. కోహినూర్‌ డైమండ్‌ చోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగా ఈ మూవీలో పవన్‌ కల్యాణ్‌ ఓ దొంగ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ మూవీకి మ్యూజిక్‌ ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు. పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ నటించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.