తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Teja Sajja Hanuman On Tv: ఓటీటీ కంటే ముందుగా టీవీలో హనుమాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Teja Sajja Hanuman On TV: ఓటీటీ కంటే ముందుగా టీవీలో హనుమాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Sanjiv Kumar HT Telugu

22 February 2024, 12:24 IST

  • Hanuman Nindu Noorella Saavasam: తెలుగులో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా హనుమాన్ మూవీ ఓటీటీలో కంటే ముందుగానే బుల్లితెరపై సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోపై నెటిజన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఓటీటీ కంటే ముందుగా టీవీలో హనుమాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ఓటీటీ కంటే ముందుగా టీవీలో హనుమాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

ఓటీటీ కంటే ముందుగా టీవీలో హనుమాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Teja Sajja Hanuman On TV Serial: తెలుగులో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. అ! అనే తొలి సినిమాతోనే దర్శకుడుగా టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. సస్పెన్స్, క్రైమ్, టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో అంథాలజీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌కు విమర్శకులు సైతం పొగడ్తలు కురిపించారు. అనంతరం రాజశేఖర్‌తో కల్కి, తేజా సజ్జాతో జాంబీ రెడ్డి చిత్రాలకు దర్శకత్వం వహించాడు ప్రశాంత్ వర్మ.

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 Second Song: పుష్ప 2 రెండో పాటపై అప్‍డేట్ వచ్చేస్తోంది.. మెలోడీకి రెడీ అవండి!

Yakshini OTT: బాహుబలి మేకర్స్ నుంచి యక్షిణి వెబ్ సిరీస్.. వేదిక ఫస్ట్ లుక్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్.. అత్యంత గ్రాండ్‍గా కార్యక్రమం.. ఆ విషయంపై క్లారిటీ వస్తుందా!

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మొదటి సినిమా తర్వాత వచ్చిన మూవీస్‌తో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇటీవల హనుమాన్‌ సినిమాతో తన అసలైన ప్రతిభ ఏంటో చూపించాడు ప్రశాంత్ వర్మ. అతి తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తెలుగులోనే మొదటిసారిగా సూపర్ హీరో సినిమాగా హనుమాన్‌ను తెరకెక్కించి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్డాడు. ఇండియన్ తెలుగు సూపర్ హీరో మూవీగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా చేసిన విషయం తెలిసిందే.

హనుమాన్ మూవీ దాదాపుగా రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. ఇప్పటికీ థియేటర్లలో హనుమాన్ మూవీని చూస్తున్నారు. అయినా కూడా హనుమాన్ ఓటీటీపై ఆసక్తి నెలకొంది. హనుమాన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధర చెల్లించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలో హనుమాన్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఓటీటీ కంటే ముందుగానే బుల్లితెరపై హనుమాన్ ప్రత్యక్షమయ్యాడు.

ఓటీటీ సంస్థ జీ5కి చెందిన తెలుగు బుల్లితెర ఛానెల్ జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రసారం అవుతోంది. భర్త, పిల్లలకు దూరమై వారిని కాపాడుకుంటూ వస్తుంటుంది అరుంధతి ఆత్మ. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను అరుంధతి ఎలా ఎదుర్కొంటుంది అనే కథాంశంతో ఈ సీరియల్ సాగుతుంది. అయితే, ఈ నేపథ్యంలో తన పిల్లలు దెబ్బలు తగిలి, గాయాలతో రక్తం కారిపోతుంటే తన తల్లి అరుంధతి విలవిల్లాడిపోతుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో హనుమంతుడి భక్తురాలు అయిన అరుంధతి.. "హే హనుమా.. ఇప్పుడు నా బిడ్డ బాధని తీర్చే శక్తి నాకు ఇవ్వు" అని వేడుకుంటుంది. ఈ సమయంలోనే బుల్లితెరపై మెరిశాడు హనుమాన్ (తేజ సజ్జా). మంచు పర్వతాన్ని చీల్చుకుంటూ వచ్చి ఆ తల్లికి అభయం ఇస్తాడు. తర్వాత పిల్లలకు గాయాలు మానేలా చేసి వారితో చిన్నపాటి ముచ్చట్లు కూడా చెబుతాడు హనుమాన్. అయితే, ఈ సీన్ అంతా హనుమాన్ విడుదలకు రెండు మూడు రోజుల ముందు వచ్చిన ఎపిసోడ్‌లో జరిగింది.

కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హనుమాన్ మూవీలో ప్రతి సీన్‌ను ఎంతో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు సీరియల్‌లో హనుమాన్ కనిపించేసరికి ట్రోలింగ్‌కు దిగారు. అది కామెడిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెప్పుడు జరిగింది. ఇది నేను చూడ్లా, ఈ అద్భుతమైన కళాఖండం ఏ సీరియల్‌లోనిది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. వారికి మిగతా వారు సీరియల్ పేరు చెబుతూ ఆన్సర్స్ ఇస్తూ ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం