Today OTT Releases: ఒక్క రోజే ఓటీటీలో 11 సినిమాలు.. ఇవాళ మాత్రం 3 స్ట్రీమింగ్.. అందరి ఫోకస్ వాటిపైనే!
Friday OTT Streaming Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే వెబ్ సిరీసులు చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి. వాటితోపాటు కొన్ని చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు ఎంటర్టైన్ చేయనున్నాయి. ఇవి కాకుండా ఇవాళ 3 స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT Releases On This Friday: ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవి లేవు. ఆర్జీవీ వ్యూహం, సుందరం మాస్టర్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. గత రెండు వారాలు ఓటీటీల్లో దాదాపుగా సంక్రాంతి సినిమాలే సందడి చేశాయి. ఇప్పుడు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు వెబ్ సిరీసులు ఓటీటీల్లో అలరించేందుకు రెడీ అయ్యాయి. అవి ఏంటో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది వించెస్టర్స్- ఫిబ్రవరి 22
అపార్ట్‌మెంట్ 404 కొరియన్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
పోచర్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది గెలాక్సీ (కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
సౌత్ పా (ఇంగ్లీష్ చిత్రం)- ఫిబ్రవరి 22
త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు (స్పానిష్ చిత్రం)- ఫిబ్రవరి 23
మీ కుల్పా (నెట్ ఫ్లిక్స్ మూవీ)- ఫిబ్రవరి 23
ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్ 6 (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్- ఫిబ్రవరి 23
మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్- ఫిబ్రవరి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
విల్ ట్రెంట్ సీజన్ 2 (ఇంగ్లీష్ చిత్రం)- ఫిబ్రవరి 21
స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా)- ఫిబ్రవరి 21
మలైకోట్టై వాలిబన్ (మలయాళం మూవీ)- ఫిబ్రవరి 23
సమ్మర్ హౌజ్ సీజన్ 8 (వెబ్ సిరీస్)- జియో సినిమా- ఫిబ్రవరి 23
సా ఎక్స్ (Saw X-అమెరికన్ హారర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే- ఫిబ్రవరి 23
అందరి ఫోకస్
ఇలా ఈ వారం 21 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానుండగా.. వాటిలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మిగతావి ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే నేడు అంటే గురువారం (ఫిబ్రవరి 22) 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ వారం పోచర్ వెబ్ సిరీస్, ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్, మలైకోట్టై వాలిబన్ మూవీ, అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ నాలుగు ఆసక్తి కలిగించేవి అని చెప్పుకోవచ్చు. వీటిపైనే అందరి ఫోకస్ ఉండే అవకాశం ఉంది.