Prema Vimanam Teaser: జీ5 ఓటీటీలో ప్రేమ విమానం.. ఫన్నీగా టీజర్-prema vimanam teaser released as the movie to stream in zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prema Vimanam Teaser: జీ5 ఓటీటీలో ప్రేమ విమానం.. ఫన్నీగా టీజర్

Prema Vimanam Teaser: జీ5 ఓటీటీలో ప్రేమ విమానం.. ఫన్నీగా టీజర్

Hari Prasad S HT Telugu

Prema Vimanam Teaser: జీ5 ఓటీటీలో ప్రేమ విమానం మూవీ రాబోతోంది. ఈ మూవీ టీజర్ ను గురువారం (ఏప్రిల్ 27) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఫన్నీగా సాగిపోయింది.

జీ5 ఓటీటీలో రానున్న ప్రేమ విమానం

Prema Vimanam Teaser: జీ5 ఓటీటీ (ZEE5 OTT)లో మరో లవ్ స్టోరీ రాబోతోంది. ఈ సినిమా పేరు ప్రేమ విమానం. ఈ మూవీ టీజర్ ను గురువారం (ఏప్రిల్ 27) మేకర్స్ రిలీజ్ చేశారు. సంతోష్ కాటా డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగా, సరదాగా ఉంది. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్నారులు.. మరో ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరిగే కథ ఇది.

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ తో అభిమానులకు దగ్గరైన సంగీత్ శోభన్ మరోసారి అదే ఓటీటీ ఒరిజినల్ లో నటించాడు. ఈ మూవీలో శాన్వీ మేఘన ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. వెన్నెల కిశోర్, అనసూయ భరద్వాజ్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు గురువారం లాంచ్ చేశాడు.

తన ట్విటర్ అకౌంట్లో మహేష్ ఈ మూవీ టీజర్ ను పోస్ట్ చేస్తూ.. ప్రేమ విమానం టీజర్ ను మీ ముందుకు తీసుకొస్తున్నా.. టీమ్ కు ఆల్ ద బెస్ట్ అని అన్నాడు. ఈ ప్రేమ విమానం టీజర్ అయితే చాలా ఫన్నీగా ఉంది. ఇద్దరు చిన్నారులు తమ ఊరి కొండపై నిల్చొని పైన వెళ్తున్న విమానాన్ని చూస్తున్న సీన్ తో ఈ టీజర్ మొదలైంది. అసలు విమానం అంత పైకి ఎలా ఎగురుతుందన్న ప్రశ్నతోపాటు అందులో వెళ్లే వారికి ఉచ్చ వస్తే ఎక్కడ పోస్తారన్న సందేహం వరకూ ఎన్నో ప్రశ్నలు వాళ్లను వేధిస్తుంటాయి.

పక్కనే ఉండే వెన్నెల కిశోర్ ను అడిగి తమ సమాధానాలు రాబట్టుకుంటారు. వీళ్ల ప్రశ్నలు చూసి అతని దిమ్మదిరిగిపోతుంది. తర్వాత టీజర్ మెల్లగా ఇద్దరు ప్రేమ పక్షుల వైపు వెళ్తుంది. అన్ని ప్రేమ కథల్లోనూ ఉండే ట్విస్టులే వీళ్ల ప్రేమలోనూ ఉంటాయి. అప్పటి వరకూ సరదాగా సాగిపోయే టీజర్ సడెన్ గా సీరియస్ ట్రాక్ తీసుకుంటుంది. ఓ చిన్నారుల్లో ఒకరు చేతిలో గన్ను పట్టుకొని కనిపిస్తాడు.

అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. జీ5లో త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే అది ఎప్పుడు అన్నది ఈ ఓటీటీ ఇంకా వెల్లడించలేదు.