Kajal Ghosty Streaming On Zee5: ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ ఫస్ట్ హారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే
Kajal Ghosty Streaming On Zee5: కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఘోస్టీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Kajal Ghosty Streaming On Zee5: పదహారేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలోఇప్పటివరకు హారర్ సినిమాలు చేయలేదు కాజల్ అగర్వాల్. ఫస్ట్ టైమ్ ఘోస్టీ సినిమాతో ఈ జోనర్‌ను టచ్ చేసింది. కానీ ఈ హారర్ సినిమా ఆమెకు చేదు ఫలితాన్ని మిగిల్చింది. ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేటి) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు భాషలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఘోస్టీ సినిమాలో కాజల్ అగర్వాల్ డ్యూయల్ రోల్ చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా, సినిమా హీరోయిన్‌గా నటించింది.
ఈ హారర్ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించాడు. ఘోస్టీ సినిమాలో యోగిబాబుతో పాటు రాధిక శరత్‌కుమార్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలను పోషించారు.
ఘోస్టీ కథేమిటంటే...
దాస్ (కేఎస్ రవికుమార్) అనే గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్ ఆర్తి (కాజల్) ప్రయత్నాలు చేస్తోంటుంది. ఈ క్రమంలో అమాయకుడైన ఓ యువకుడి మరణానికి కారణమవుతుంది.ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె పనిచేస్తోన్న పోలీస్ స్టేషన్‌లోకి ఆత్మలు ఎలా వచ్చాయనే పాయింట్‌తో దర్శకుడు కళ్యాణ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కథ, కామెడీతో పాటు కాజల్ యాక్టింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి
టాపిక్