Uunchai World Digital Premiere Date: మైనే ప్యార్ కియా, హమ్ ఆప్‌కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, ప్రేమ్ రతన్ ధన్ పాయోలాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సంపాదించుకున్న డైరెక్టర్ సూరజ్ ఆర్.బార్జాత్యా. 2015లో ప్రేమ్ రతన్ ధన్ పాయో తీసిన ఏడేళ్ల తర్వాత అతడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.,ఆ సినిమా పేరు ఊంచాయీ. తనదైన రీతిలో మరో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథతో ఈ సినిమా తీశాడు సూరజ్. రాజశ్రీ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్, బౌండ్‌లెస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జీ5 (ZEE5) ఓటీటీలో జనవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ శుక్రవారం (డిసెంబర్ 30) వెల్లడించింది.,అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, సారికలాంటి సీనియర్ బాలీవుడ్ నటులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధించింది. ఐఎండీబీలోనూ 7.7 రేటింగ్‌తో మంచి టాక్ సొంతం చేసుకుంది. నటీనటుల అద్భుతమైన నటన, అన్ని వయసుల వారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీ కావడంతో ఊంచాయీ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.,నలుగురు ఫ్రెండ్స్ కథ ఇది. ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్‌కు వెళ్లాలన్న తన చివరి కోరిక నెరవేరకుండానే కన్ను మూసిన తమ స్నేహితుడి కోసం మిగతా ముగ్గురు స్నేహితులు చేసిన సాహసమే ఈ ఊంచాయీ. ఈ మూవీలో అమిత్, జావెద్, ఓం, భూపెన్ పాత్రల్లో వరుసగా అమితాబ్, బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, డానీ డెంగ్‌జోంగ్పా నటించారు.,తన జీవితంలో ఎప్పటికైనా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోవాలన్నది భూపెన్ కల. అయితే అది నెరవేరకుండానే అతడు కన్నుమూస్తాడు. అతని కలను నెరవేర్చడానికి మిగతా ముగ్గురు స్నేహితులు అమిత్, జావెద్, ఓం ఆ కఠినమైన యాత్ర మొదలుపెడతారు. ఇందులో జావెద్ భార్య (నీనా గుప్తా), భూపెన్ ప్రేయసి (సారిక) కూడా వాళ్లతో చేరతారు. ఆ తర్వాత వీళ్ల జర్నీ ఎలాంటి మలుపులు తిరిగింది? అందులో వీళ్లు ఎదుర్కొన్న సవాళ్లేంటి అన్నదే ఈ సినిమా స్టోరీ.,ఏడేళ్ల పాటు ఎంతో శ్రమించి ఈ సినిమా తీసినట్లు ఊంచాయీ డైరెక్టర్-ప్రొడ్యూసర్ సూరజ్ బార్జాత్యా చెప్పాడు. కొత్త ఏడాదిలో తమ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరాడు.