తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanu-man In Ayodhya: అయోధ్యలో హనుమాన్‌.. ప్రమోషన్లలో మూవీ టీమ్‌ బిజీ

Hanu-man in Ayodhya: అయోధ్యలో హనుమాన్‌.. ప్రమోషన్లలో మూవీ టీమ్‌ బిజీ

HT Telugu Desk HT Telugu

30 November 2022, 17:41 IST

    • Hanu-man in Ayodhya: అయోధ్యలో హనుమాన్‌ టీమ్‌ సందడి చేసింది. మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న టీమ్‌.. ముందు అయోధ్య వెళ్లి రాముడి దర్శనం చేసుకుంది. ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.
అయోధ్యలో హను-మాన్ టీమ్
అయోధ్యలో హను-మాన్ టీమ్

అయోధ్యలో హను-మాన్ టీమ్

Hanu-man in Ayodhya: క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తొలిసారి ఓ ఇండియన్‌ సూపర్‌ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ పేరు హను-మాన్‌. ఈ మధ్యే రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ టీజర్‌ సంచలనాలు సృష్టించింది. యూట్యూబ్‌లో తెలుగు టీజర్‌ వారం రోజుల్లో మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

ఇక ఇప్పుడీ మూవీ టీమ్‌ ప్రమోషన్లలో బిజీ అయింది. హను-మాన్‌ టీమ్‌ మంగళవారం (నవంబర్‌ 29) అయోధ్య వెళ్లింది. అక్కడ శ్రీరాముడి దర్శనం చేసుకుంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్‌ సక్సెస్‌తో ఊపు మీదున్న టీమ్‌.. ప్రమోషన్లు మొదలుపెట్టే ముందు ఆధ్యాత్మిక టూర్‌కు వెళ్లింది.

ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ ఫిమేల్‌ లీడ్‌గా కనిపించనుంది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌లో నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా చాలా భారీ బడ్జెట్‌తో హను-మాన్‌ రూపొందింది. గౌరాహరి, అనుదీప్‌ దేవ్, కృష్ణ సౌరభ్‌ల త్రయం ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది. ప్రస్తుతం హను-మాన్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే మేకర్స్‌ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.