తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 15th Episode: గుప్పెడంత మ‌న‌సు- మ‌ను తండ్రి ఎవ‌రో చెప్పిన శైలేంద్ర -ఎండీ ప‌ద‌వి వ‌ద్ద‌న్న రిషి

Guppedantha Manasu August 15th Episode: గుప్పెడంత మ‌న‌సు- మ‌ను తండ్రి ఎవ‌రో చెప్పిన శైలేంద్ర -ఎండీ ప‌ద‌వి వ‌ద్ద‌న్న రిషి

15 August 2024, 9:20 IST

google News
  • Guppedantha Manasu August 15th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌లో మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే అనే నిజాన్ని శైలేంద్ర బ‌య‌ట‌పెడ‌తాడు. కానీ శైలేంద్ర మాట‌ల‌ను మ‌ను న‌మ్మ‌డు. మ‌రోవైపు కొత్త ఎండీగా రిషిని ప్ర‌క‌టిస్తుంది వ‌సుధార‌.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌

Guppedantha Manasu August 15th Episode: బోర్డ్ మీటింగ్‌కు వెళ్ల‌కుండా శైలేంద్రను అడ్డుకుంటాడు మ‌ను. అత‌డిని పాండు చేత కిడ్నాప్ చేయిస్తాడు. మ‌ను త‌న‌ను కిడ్నాప్ చేయించాడ‌ని తెలిసి శైలేంద్ర షాక‌వుతాడు. ఎన్నో ఎళ్ల నుంచి తాను కంటున్న క‌ల ఈ రోజు నెర‌వేర‌బోతుంద‌ని, ఎండీ ప‌ద‌వి త‌న‌కు ద‌క్క‌బోతుంద‌ని, ఈ టైమ్‌లో ప‌గ తీర్చుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని మ‌నును బ‌తిమిలాడుతాడు శైలేంద్ర‌. గ‌తంలో నిన్ను అన్న మాట‌ల‌ను మ‌ర్చిపోయి న‌న్ను వ‌దిలిపెట్ట‌మ‌ని రిక్వెస్ట్ చేస్తాడు. నీకు దండ‌పెడ‌తాన‌ని కాళ్ల‌బేరానికి వ‌స్తాడు శైలేంద్ర‌.

ప్ర‌శ్న‌కు స‌మాధానం...

అస‌లు న‌న్ను ఎందుకు కిడ్నాప్ చేశావు? నీకు ఏం కావాల‌ని మ‌నును అడుగుతాడు శైలేంద్ర‌. నా ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాల‌ని శైలేంద్ర‌తో అంటాడు మ‌ను. నా క‌న్న తండ్రి ఎవ‌రు? అత‌డి పేరేంటి అని అడుగుతాడు. నిజం చెబితే ప్ర‌మాద‌మ‌ని భావించిన శైలేంద్ర త‌న‌కు తెలియ‌ద‌ని బుకాయిస్తాడు. మ‌ను ప్ర‌స్టేష‌న్ చూసి అత‌డికి రివ‌ర్స్ అవుతాడు శైలేంద్ర‌.

నీ తండ్రి గురించి, అత‌డి బ‌యోడేటా గురించి పూర్తిగా తెలుసున‌ని, కానీ చెప్ప‌న‌ని అంటాడు. ఏం చేసుకుంటావో చేసుకో...న‌న్ను వ‌దిలిపెట్ట‌క‌పోయినా ప్రాబ్ల‌మేం లేద‌ని అంటాడు.

శైలేంద్ర విల‌నిజం...

నువ్వు బోర్డ్ మీటింగ్‌లో ఉంటేనే క‌దా నిన్ను ఎండీగా ప్ర‌క‌టించేది అని శైలేంద్ర‌తో అంటాడు మ‌ను. ఈ శైలేంద్ర విల‌నిజాన్ని అంద‌రూ త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారు. నేను అక్క‌డ ఉన్నా లేక‌పోయినా ఎండీగా ప్ర‌క‌టించేది నా పేరే అని మ‌నుకు బ‌దులిస్తాడు శైలేంద్ర‌. అవునా...అదే విష‌యం ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేసి క‌నుక్కుందామ‌ని ఫ‌ణీంద్ర‌కు శైలేంద్ర ఫోన్‌ కాల్ చేస్తాడు మ‌ను.

శైలేంద్ర కంగారు ప‌డుతూనే తండ్రితో మాట్లాడుతాడు. రిషి త‌న పేరును ఎండీగా ప్ర‌క‌టించాడా లేదా అని తండ్రిని అడుగుతాడు శైలేంద్ర‌. రిషి నీ పేరు చెప్ప‌లేద‌ని, ఎండీని తానే ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వ‌సుధార స్వ‌యంగా చెప్పింద‌ని ఫ‌ణీంద్ర అంటాడు. వ‌సుధార ఎవ‌రి పేరు ప్ర‌క‌టిస్తుందోన‌ని టెన్ష‌న్‌గా తాను ఎదురుచూస్తున్న‌ట్లు ఫ‌ణీంద్ర స‌మాధానం చెప్పి కాల్ క‌ట్ చేస్తాడు.

శైలేంద్ర టెన్ష‌న్‌...

వ‌సుధార కార‌ణంగా ఎండీ కావాల‌నే త‌న క‌ల చెదిరిపోతుంద‌ని శైలేంద్ర కంగారుప‌డ‌తాడు. మ‌ను తండ్రి ఎవ‌ర‌నే నిజాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు. మ‌హేంద్ర‌నే నీ క‌న్న‌తండ్రి అని మ‌నుతో అంటాడు.కానీ మ‌ను మాత్రం శైలేంద్ర మాట‌ల‌ను న‌మ్మ‌డు. త‌ప్పించుకోవ‌డానికి శైలేంద్ర అబ‌ద్ధం ఆడుతున్నాడ‌ని చెంప‌లు వాయిస్తాడు.

మ‌హేంద్ర‌నే నీ తండ్రి అన‌డానికి సాక్ష్యం కూడా మ‌నును బ‌తిమిలాడుతాడు శైలేంద్ర‌. అబ‌ద్ధాన్ని నిజం చేయ‌డానికి త‌ప్పుడు సాక్ష్యం సృష్టిస్తున్నావా అంటూ మ‌రోసారి శైలేంద్ర‌పై ఫైర్ అవుతాడు మ‌ను. మ‌హేంద్ర త‌న క‌న్న తండ్రి కాద‌నే నాకు తెలుసున‌ని అంటాడు. గ‌న్ తీసి నా తండ్రి ఎవ‌రో చెబుతావా లేదా అంటూ శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తాడు మ‌ను.

రిషినే ఎండీ...

బోర్డ్ మీటింగ్ కాలేజీ కోసం రిషి చేసిన ప‌నులు, అత‌డి గొప్ప‌త‌నం గురించి అంద‌రికి చెబుతుంది వ‌సుధార‌. రిషి త‌ప్ప ఎండీ సీట్‌లో మ‌రెవ‌రికి కూర్చునే అర్హ‌త లేద‌ని అంటుంది. కానీ రిషి మాత్రం వ‌సుధార నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తాడు.

బోర్డ్ మీటింగ్ మ‌ధ్య‌లో నుంచి వెళ్లిపోతాడు. ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర కంగారు ప‌డ‌తారు. తాను రిషిని క‌న్వీన్స్ చేస్తాన‌ని వ‌సుధార అంటుంది.

దేవ‌యాని ఆనందం...

నీ క‌న్న తండ్రి ఎవ‌ర‌నేదానికి సాక్ష్యం చూపిస్తాన‌ని దేవ‌యానికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర‌. ఫోన్ లిఫ్ట్ చేయ‌గానే ఎండీ అయిపోయినందుకు కొడుకుకు కంగ్రాట్స్ చెబుతుంది దేవ‌యాని. నువ్వు ఎండీ అయితే క‌ళ్లారా చూడాల‌ని అనుకున్నాన‌ని, బోర్డ్ మీటింగ్‌కు వ‌స్తానంటే మీ నాన్న ఒప్పుకోలేద‌ని అంటుంది.ఎండీగా ఫ‌స్ట్ కాల్ నాకే చేశావా లేదా అంటూ ప్ర‌శ్న‌లు అడుగుతుంది.

త‌న సిట్యూవేష‌న్ అర్థం చేసుకోకుండా దేవ‌యాని మాట్లాడుతూ పోవ‌డంతో శైలేంద్ర ప్ర‌స్టేట్ అవుతాడు. వ‌సుధార రాసిన లెట‌ర్‌ను త‌న‌కు పిక్ తీసి పంప‌మ‌ని అంటాడు. ఆ ప‌ని చేసే నాకు సాయం చేసిన దానివి అవుతావ‌ని చెబుతాడు. ఈ లెట‌ర్ ఇప్పుడు ఎందుకు అని దేవ‌యాని అడిగిన శైలేంద్ర స‌మాధానం చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉంటాడు.

రిషితో వ‌సు వాద‌న‌...

బోర్డ్ మీటింగ్ నుంచి మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చిన రిషి ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది వ‌సుధార‌. మీకు డీబీఎస్‌టీ కాలేజీ అంటే ఇష్టం క‌దా...మ‌రి ఎందుకు ఎండీ సీట్ వ‌ద్ద‌ని అంటున్నార‌ని నిల‌దీస్తుంది. కాలేజీ అంటే ఇష్టం...కానీ ఎండీగా మాత్రం తాను కొన‌సాగ‌లేన‌ని రిషి అంటాడు.

ఒక్కొసారి మ‌న‌కు ఇష్టం ఉన్న లేక‌పోయినా కొన్ని ఒప్పుకొని తీరాల్సివ‌స్తుంద‌ని, కొంద‌రు భ‌విష్య‌త్తు కోసం త‌ప్ప‌ద‌ని రిషితో చెబుతుంది వ‌సుధార‌. మీరే ఎండీ సీట్‌కు క‌రెక్ట్ అని అంటుంది. చాలా తెలివిగా మాట్లాడుతున్నావ‌ని, నా ఆలోచ‌న‌, మ‌న‌సుతో ప‌నిలేకుండా నువ్వు ఎలా నిర్ణ‌యాలు తీసుకుంటావ‌ని వ‌సుధార‌తో ఆర్గ్యూ చేస్తాడు రిషి. అయినా విన‌కుండా రిషిని క‌న్వీన్స్ చేస్తుంది వ‌సుధార‌.

దేవ‌యాని అనుమానం...

రిషిని బ‌తిమిలాడి బోర్డ్ మీటింగ్‌కు తీసుకొస్తుంది వ‌సుధార‌. మ‌రోవైపుశైలేంద్ర లెట‌ర్ పంప‌మ‌ని అడ‌గ‌టంతో దేవ‌యాని అనుమాన‌ప‌డుతుంది. శైలేంద్ర అస‌లు కాలేజీకి వెళ్లాడా లేదా తెలుసుకోవాల‌ని భ‌ర్త‌కు ఫోన్ చేస్తుంది. శైలేంద్ర ప్ర‌మాదంలో ప‌డ్డాడా అని భ‌య‌ప‌డుతుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

తదుపరి వ్యాసం