Guppedantha Manasu Serial: వసు, సరోజ మధ్య నలిగిపోతున్న రంగా - మహేంద్రకు షాకిచ్చిన అనుపమ- కాలేజీకి మను దూరం
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూలై 13 ఎపిసోడ్‌లో బావ రంగాను తనకు వసుధార ఎక్కడ దూరం చేస్తుందోనని సరోజ తెగ కంగారు పడుతుంది. వసుధారను ఎలాగైనా రంగా ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది. కానీ వసుధార ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది.
మీ ఊరికి బయటివాళ్లు రావొద్దని ఏమైనా రూల్ ఉందా అంటూ సరోజకు ధీటుగానే బదులిస్తుంది వసుధార. తాను ఊరికే రంగా ఇంట్లో ఉండటానికి మళ్లీ రాలేదని, ఇక నుంచి రెంట్ ఇచ్చి ఉండబోతున్నట్లు చెబుతుంది. రెంటల్ అగ్రిమెంట్ కూడా పూర్తయిందని అంటుంది.
సరోజ కోపం...
వసుధారకు పై పోర్షన్ ఎందుకు అద్దెకు ఇచ్చావని రంగాను నిలదీస్తుంది సరోజ. వసుధారకు ఊరిలో తెలిసిన వాళ్లు ఎవరూ లేరని, అందుకే మన ఇంట్లోనే ఖాళీగా ఉన్న టెర్రస్‌ను రెంట్‌కు ఇచ్చినట్లు రంగా సమాధానమిస్తాడు. మీ నాన్నకు వడ్డీ డబ్బులు ఇవ్వడానికి కూడా వసుధార ఇచ్చే రెంట్ డబ్బులు ఉపయోగపడతాయని రంగా అంటాడు.
అవసరం అయితే అప్పు మొత్తం మాఫీ చేస్తానని, కానీ వసుధార మాత్రం ఇంట్లో ఉండటానికి వీలు లేదని సరోజ పట్టుపడుతుంది. వసుధారకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని మాటిచ్చానని, ఇప్పుడు ఆ మాట తప్పనని రంగా చెప్పి వెళ్లిపోతాడు. రంగానే రిషి అని, అందుకే తనను అతడు మళ్లీ వెనక్కి తీసుకొచ్చాడని సరోజతో అంటుంది వసుధార.
దేవయాని బ్లాక్‌మెయిల్...
దేవయాని తనను బ్లాక్‌మెయిల్ చేస్తోన్న సంగతికి పెద్దమ్మకు చెబుతుంది అనుపమ. మను తండ్రి మహేంద్ర అని వసుధార రాసిన లెటర్ దేవయానికి దొరికిందని, ఆ లెటర్‌ను అడ్డంపెట్టుకొని ఎండీ సీట్ విషయంలో తన కొడుకు శైలేంద్రకు మను అడ్డు రాకూడదని దేవయాని డిమాండ్ చేస్తుందని పెద్దమ్మతో అంటుంది అనుపమ.
నిజం బయటపడితే మహేంద్ర ప్రాణాలకు ప్రమాదం కాబట్టి మను, తాను ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతున్నట్లు అనుపమ చెబుతుంది. నిజం బయటపెడితే ఏం జరగదని పెద్దమ్మ ఎంత చెప్పిన అనుపమ మాత్రం ఆమె మాటలను వినదు.
మహేంద్ర కంగారు...
అప్పుడే మహేంద్ర...అనుపమకు ఫోన్ చేస్తాడు. అతడిపై అనుపమ ఫైర్ అవుతుంది. నా కోసం ఎదురుచూడొద్దని,పదే పదే ఫోన్ చేయద్దని చిరాకు పడుతుంది. అనుపమ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియక మహేంద్ర కంగారు పడతాడు.
అనుపమ ఎక్కడుందో తనకు తెలుసునని పెద్దమ్మకు కాల్ చేస్తాడు మను. అనుపమ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తాను మహేంద్ర ఇంటికి రానని కొడుకుకు ఆన్సర్ ఇస్తుంది. మనును పెద్దమ్మ ఇంటికి రమ్మని, అర్జెంట్‌గా ఓ విషయం మాట్లాడాలని చెప్పికాల్ కట్ చేస్తుంది. కొన్నాళ్లుగా మహేంద్రకు, కాలేజీకి దూరంగా ఉంటామని, ఆ తర్వాత సిటీని వదిలిపెట్టి వెళ్లిపోతామని తన ప్లాన్ మొత్తం పెద్దమ్మకు చెబుతుంది. తండ్రి అనే నిజం తెలియకుండానే మహేంద్ర నుంచి తండ్రిప్రేమను మను పొందుతున్నాడని, వారిని దూరం చేయడం కరెక్ట్ కాదని అనుపమతో అంటుంది పెద్దమ్మ.
వసుధార కొత్త ప్లాన్...
ఎలాగైనా వసుధారను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని ఆవేశంగా టెర్రస్‌పైకి వస్తుంది సరోజ. అక్కడ ఊరి పిల్లలకు ట్యూషన్ చెబుతుంటుంది వసుధార. రంగాతో వసుధార బంధాన్ని తప్పుపట్టిన ఊరివాళ్లందరూ సరోజ కళ్లముందే వసుధారపై పొగడ్తలు కురిపిస్తుంటారు. ఆ సీన్ చూసి సరోజ సహించలేకపోతుంది. రంగా దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఈ ట్యూషన్ డ్రామా ఆడుతున్నావని వసుధారపై ఫైర్ అవుతుంది. ఆమె కోపాన్ని తేలిగ్గా తీసుకుంటుంది వసుధార. నువ్వు కూడా పెద్దగా చదువుకోలేదుగా...నీకు ఫ్రీగా చదువు నేర్పిస్తానని సెటైర్ వేస్తుంది.
మహేంద్రకు దూరంగా...
అనుపమను కలవడానికి పెద్దమ్మ ఇంటికి వస్తాడు మను. మహేంద్రకు దూరంగా మనం పెద్దమ్మ ఇంట్లోనే ఉందామని మనుతో చెబుతుంది అనుపమ. మను అందుకు ఒప్పకోడు. తాను కేసులో ఇరుక్కున్నప్పడు మహేంద్ర ఎంతో సాయం చేశారని, ఇప్పుడు కష్టాల్లో ఉన్న అతడిని ఒంటరిగా వదిలిపెట్టి రానని అంటాడు.
తన మాట వినకుంటే చచ్చినంత ఒట్టే అని మనును ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది అనుపమ. ఆమె కంగారును చూసిన మను...ఏదో జరిగిందని, అందుకే మహేంద్రకు దూరంగా ఉందామని అంటున్నారని, అదేమిటో చెప్పమని అడుగుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.