Guppedantha Manasu July 9th Episode: రంగానే వసుధార భర్త - రహస్యం బయటపెట్టిన రాధమ్మ - బావ కోసం సరోజ పంతం
Guppedantha Manasu July 9th Episode: గుప్పెడంత మనసు జూలై 9 ఎపిసోడ్‌లో రంగాను రిషిగా నిరూపించడానికి కొత్త ప్లాన్ వేస్తుంది వసుధార. అతడిని మహేంద్ర దగ్గరకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. వసుధార వెంట వెళ్లడానికి రంగా కూడా ఒప్పుకుంటాడు.
Guppedantha Manasu July 9th Episode: అనుపమకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మను తండ్రి ఎవరో తనకు తెలుసునని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. నువ్వు, నీ కొడుకు మను ఈ సిటీని వదిలిపెట్టి వెళ్లకపోతే నిజం అందరికి చెబుతానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఫోన్‌లో మాట్లాడుతూ అనుపమ కంగారుపడటంతో మహేంద్ర, మను ఏమైందని అడుగుతారు. కానీ అనుపమ రాంగ్ నంబర్ అంటూ అబద్ధం ఆడుతుంది.
వసు కోసం రంగా ఎదురుచూపులు...
రంగా డిన్నర్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. అక్కడ వసుధార కనిపించకపోవడంతో ఆమెను భోజనానికి పిలుస్తాడు రంగా. తనకు ఆకలిగా లేదని వసు అబద్ధం ఆడుతుంది. రంగా, రాధమ్మ కలిసి వసుధారను భోజనం చేయమని బతిమిలాడుతారు. తన ఆకలి గురించి పట్టించుకోకుండా వసుధారను రంగా బతిమిలాడటం సరోజ తట్టుకోలేకపోతుంది.
సరోజ అవమానం...
వసుధార అన్నం తినే ప్లేట్‌లో నీళ్లుపోస్తుంది సరోజ. వసుధారకు సారీ చెప్పమని రంగా అంటాడు. తాను చెప్పనని సరోజ బెట్టు చేస్తుంది. వసుధారకు భోజనం వడ్డించడానికి సరోజ ఒప్పుకోదు. అడ్డమైన వాళ్లకు చాకిరి చేయాల్సిన అవసరం తనకు లేదని అవమానిస్తుంది.
వసుధార వల్ల అందరితో నువ్వు మాటలు పడటం నాకు నచ్చడం లేదని రంగాతో అంటుంది సరోజ. వసుధార వల్లే మా నాన్న కూడా నీ వ్యక్తిత్వాన్ని వేలేత్తి చూపడం బాధను కలిగించిందని వసుధారపై తనకున్న అసూయ, ద్వేషం మొత్తం బయటపెడుతుంది సరోజ.
వసుధార అలక...
సరోజ చేసిన అవమానం తట్టుకోలేక భోజనం ముందు నుంచి వసుధార లేచివెళ్లిపోతుంది. సరోజ మాటలతోనే తన కడుపు నిండిపోయిందని అంటుంది. వసుధారకు తానే స్వయంగా ప్లేట్‌లో అన్నం వడ్డించుకొని ఆమె రూమ్‌కు తీసుకెళతాడు రంగా. అన్నం తినమని వసుధారతో అంటాడు. సరోజ అన్న మాటలను పట్టించుకోవద్దని చెబుతాడు.
అయినా వసుధార తిననని బెట్టు చేస్తుంది. తనతో పాటు రిషిని డీబీఎస్‌టీ కాలేజీ తీసుకెళ్లి...మహేంద్ర ముందు నిలబెట్టాలని వసుధార అనుకుంటుంది. అదే మాట రంగాతో చెబుతుంది. అక్కడికి వెళితేనే మీరు రిషినో...రంగానో మీ నాన్న మహేంద్ర చెబుతారని వసుధార అంటుంది.
మనుషులు పోలిన మనుషులు ఉంటారని తాను రిషిని కాదని రంగా అంటాడు. మనుషులను పోలిన మనుషులు ఉండొచ్చు...కానీ రిషిని పోలిన రిషి మాత్రం ఉండనని వసుధార అంటుంది. మీ ప్రాణం లాంటి కాలేజీ కష్టాల్లో ఉన్న మీ మనసు ఎందుకు కరగడం లేదని రంగాను నిలదీస్తుంది. నన్ను ఒక్క మాట పడనీయకుండా ఎందుకు చూసుకుంటున్నారని ప్రశ్నిస్తుంది.
రిషి కోసం తగ్గదేలే…
వసుధార మాటలు విని పొగరు...అస్సలు తగ్గదు కదా అని రంగా అంటాడు. అవును నాకు పొగరే. రిషి విషయంలో నేను అస్సలు తగ్గనని వసుధార అంటుంది. వసుధార బెట్టు చూసి ఆమె వెంట వెళ్లాలని రంగా ఫిక్సవుతాడు. వసుధారను ఆమె ఇంట్లో దిగబెట్టి రావాలని అనుకుంటాడు.
తాను మాత్రం రంగాగానే మీ వెంట వస్తున్నట్లు చెబుతాడు రంగా. తాను రిషి కాదని మరోసారి గుర్తుచేస్తాడు. రేపు ఉదయమే మన ప్రయాణమని అంటాడు. నా రిషి ఏది అనుకున్నా అదే చేస్తాడని వసుధార సంబరపడుతుంది. మహేంద్ర ముందు రిషి అబద్ధం ఆడలేడని, అప్పుడైనా అతడు రంగా కాదని రిషి అని తేలిపోతుందని వసుధార అనుకుంటుంది.
సరోజ కంగారు...
వసుధారను ఆమె ఇంట్లో దిగబెట్టడానికి రంగా వెళుతున్నాడని తెలిసి సరోజ కంగారు పడుతుంది. రంగాను వెళ్లొద్దని అంటుంది. నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదని చెబుతుంది. వసుధారను తన ఇంట్లో దిగబెట్టి వెంటనే తిరిగొస్తానని సరోజకు మాటిస్తాడు రంగా. వసుధార అడ్డు తొలగిపోనుండటంతో సరోజ సంబరపడుతుంది.
రిషిగా నిరూపించడానికే...
వసుధార వెళ్లిపోతుందన్న ఆనందం పట్టలేక పోతుంది సరోజ. వసుధార వెళ్లిపోయే ముందు ఆమెతో గొడవ పెట్టుకోకుండా సంతోషంగా ఉన్నట్లుగా డ్రామా ఆడుతుంది. రంగాను రిషి అని నిరూపించడానికే తన వెంట తీసుకెళుతున్నట్లు వసుధార అసలు బాంబు పేలుస్తుంది. ఆమె మాటలు విని సరోజ కంగారు పడుతుంది. కానీ రంగాపై ఉన్న నమ్మకంతో వసుధార మాటలు నమ్మదు. నా గుర్తుగా నీకో మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి వసుధారతో గొడవ పెట్టుకోకుండా అక్కడి నుంచి వసుధార వెళ్లిపోతుంది.
రాధమ్మ దాచిన నిజం...
రాధమ్మ దగ్గరకు వస్తుంది వసుధార. రంగా నిజంగా మీ మనవడేనా అని అడుగుతుంది. అవునని, ఈ విషయంలో ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా అని వసుధారకు సమాధానమిస్తుంది రాధమ్మ. మీ మనవడి జీవితానికి సంబంధించి ఏదో ముఖ్యమైన విషయం మీరు దాస్తున్నట్లుగా ఉందని వసుధార అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ మాట వినగానే రాధమ్మ చేతిలో ఉన్న ప్లేట్ జారిపడిపోయి పగిలిపోతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.