Guppedantha Manasu Serial: వసుధారకు రంగా సవాల్ - డీఎన్ఏ టెస్ట్‌కు సిద్ధం - అనుపమను బ్లాక్‌మెయిల్ చేసిన దేవయాని
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూలై 4 ఎపిసోడ్‌లో తాను రిషి కాదని వసుధారతో వాదిస్తాడు రంగా. డీఎస్ఏ టెస్ట్‌కు సిద్ధమని వసుధారతో ఛాలెంజ్ చేస్తాడు రంగా. మను తండ్రి గురించి వసుధార రాసిన లెటర్ ఆధారంగా అనుపమను బ్లాక్‌మెయిల్ చేయాలని దేవయాని, శైలేంద్ర ఫిక్సవుతారు.

Guppedantha Manasu Serial: వసుధారకు తమ ఊరిలోని స్కూల్‌లోజాబ్ ఇప్పించామని ప్రిన్సిపాల్‌ను రంగా రిక్వెస్ట్ చేస్తాడు. రంగా మాటకు కట్టుబడి వసుధారకు జాబ్ ఇవ్వడానికి స్కూల్ ప్రిన్సిపాల్ ఒప్పుకుంటాడు. వసుధార దగ్గర సర్టిఫికేట్స్ లేకపోవడంతో టీచర్ డౌట్ పడతాడు. కావాలంటే మా మేడమ్ నాలెడ్జ్‌ను టెస్ట్ చేయమని ప్రిన్సిపాల్‌తో రంగా చెబుతాడు.
వసుధార టెస్ట్...
రంగా చెప్పినట్లుగానే వసుధారను మ్యాథ్స్ ఫార్ములాలు బోర్డ్‌పై రాయమని ప్రిన్సిపాల్ అంటాడు. కావాలనే ఫార్ములాను బోర్డ్‌పై తప్పుగా రాస్తుంది వసుధార. అది చూసి మీకు మైండ్ ఉందా లేదా...ఒక్క ఫార్ములా కూడా కరెక్ట్‌గా రాయడం రాదా అంటూ వసుధారపై కోప్పడతాడు రంగా.
వసుధార చేతిలో నుంచి చాక్‌పీస్ తీసుకొని తానే అన్ని ఫార్ములాలను బోర్డ్‌పై కరెక్ట్‌గా రాసి చూపిస్తాడు రంగా. చిన్న చిన్న ఫార్ములాలను గుర్తుపెట్టుకోకపోతే ఎలా అని వసుధారకు క్లాస్ ఇస్తాడు. వసుధార బోర్డ్‌పై ఫార్ములాలను తప్పుగా రాయడం చూసి స్కూల్ స్టూడెంట్స్ నవ్వుకుంటారు. వసుధార జాబ్ గురించి తర్వాత మాట్లాడుతానని ఇద్దరిని స్కూల్ నుంచి పంపిస్తాడు ప్రిన్సిపాల్.
ఫణీంద్రకు డౌట్...
మను విషయంలో శైలేంద్ర ఏవో కుట్రలు పన్నుతున్నాడని ఫణీంద్ర డౌట్ పడతాడు. మను తన ఇంటికి రావడం వెనుక ఏదో మతలబు ఉండి ఉంటుందని అనుకుంటాడు. శైలేంద్రను పిలిచి మను నీతో ఏదో సీరియస్‌గా మాట్లాడాడని, ఏదో ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పాలని వస్తే నువ్వే అడ్డుకున్నావని అనుమానంగా ఉందని ఫణీంద్ర అంటాడు. తండ్రి మాటలకు శైలేంద్ర తడబడిపోతాడు.
నా కొడుకును ప్రతి విషయంలో మీరు అనుమానించడం బాగాలేదని, కన్న కొడుకును పరాయివాడిలా చూస్తున్నారని దేవయాని భర్తతో అంటుంది. కొడుకును సపోర్ట్‌చేస్తుంది. ఎండీ పదవి కోసం నువ్వు తప్పుగా ప్రవర్తించావని తెలిస్తే ఊరుకునేది లేదని కొడుకుకు వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర.
నీ అదృష్టం బాగుండి శైలేంద్ర ఎండీ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని శైలేంద్రతో అంటాడు ఫణీంద్ర. ఒకవేళ శైలేంద్ర కాకుండా మను ఎండీ అయితే అందుకు నేను బాధ్యుడిని కాదు. మను మంచితనం నడవడిక అతడికి ఆ పదవిని తెచ్చిపెట్టిందని తెలుసుకొండి అని ఇద్దరిని చెబుతాడు.
శైలేంద్ర అసహనం...
మను వల్ల తాను ఎండీ సీట్‌కు ఓ ఆప్షన్‌గా మిగిలిపోయానని, వాడిని లేపేస్తే తప్ప తనకు పదవి దక్కదని శైలేంద్ర అనుకుంటాడు. మనును లేపేయడం అసాధ్యమని కొడుకుకు బదులిస్తుంది దేవయాని. మేధావి అయిన రిషినే లేకుండా చేశానని, మను లేపేయడం నాకు ఎంత అని శైలేంద్ర బిల్డప్‌లు ఇస్తాడు.
రిషికి మన గురించి తెలియదు కాబట్టి లేపేయడం ఈజీ అయ్యిందని, కానీ మనుకు నీ గురించి పూర్తిగా తెలుసు, నిన్ను పూర్తిగా చదివేశాడు కాబట్టి అతడి ముందు నీ ఆటలు సాగవని, మను జోలికి వెళ్లొద్దని కొడుకును హెచ్చరిస్తుంది. వసుధార రాసిన లెటర్ ఆధారంగా ఎండీ సీట్‌కు మను అడ్డురాకుండా తాను చూసుకుంటానని కొడుకుకు అభయమిస్తుంది దేవయాని.
అనుపమను బ్లాక్‌మెయిల్...
వసుధార రాసిన లెటర్‌ను మనుకు కాకుండా అనుపమకు చూపించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేద్ధామని, ఎండీ సీట్‌కు మను అడ్డురాకుండా అనుపమ ద్వారా ప్రయత్నిద్దామని దేవయాని అంటుంది. తల్లి వేసిన ప్లాన్‌కు శైలేంద్ర ఫిదా అవుతాడు. దేవయాని, అప్పుడే ఆ రూమ్‌లోకి ధరణి ఎంట్రీ ఇస్తుంది.
పదవి కోసం మీ కొడుకును మీరే చెడు దారిలోకి నడిపిస్తున్నారని, తల్లిలా ప్రవర్తించడం లేదని దేవయానిపై ఎటాక్ మొదలుపెడుతుంది ధరణి. కుళ్లుకుతంత్రాలతో చెడ్డ పేరు తప్ప ఏం సాధించలేరని చెప్పి వెళ్లిపోతుంది. ధరణి మాటలను పట్టించుకోకుండా ఎండీ సీట్ కోసం ఏ కుట్రలు చేయాలో ఆలోచించడం మొదలుపెడతారు శైలేంద్ర, దేవయాని.
సరోజ కంగారు...
రంగాను రిషిగా వసుధార ఎక్కడ నిరూపిస్తుందోనని సరోజ కంగారు పడుతుంది. రంగా పూర్తిగా వసుధార మాయలో పడ్డాడని భయపడుతుంది. రంగా అసిస్టెంట్ బుజ్జి ఆమె భయాన్ని ఇంకా పెంచుతాడు. నేను రంగా కాదు రిషి, వసుధార నా భార్య అని అందరి ముందు రంగా చేత నిరూపిస్తానని వసుధార చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చి స్కూల్‌కు పరుగులు పెడుతుంది సరోజ.
రంగాతో వసు వాదన...
క్లాస్ రూమ్ నుంచి బయటకు రాగానే మీరు రిషి అయినా కూడా ఎందుకు రంగాగా బిహేవ్ చేస్తున్నారని రంగాను నిలదీస్తుంది వసుధార. ఎందుకు నిజం దాచిపెడుతున్నారో చెప్పమని గట్టిగా అడుగుతుంది. మీరే నా రిషి అని వసుధార అంటుంది. డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ అయిన మీరు సాధారణ ఆటోడ్రైవర్‌గా ఈ ఊళ్లో ఎందుకు ఉంటున్నారని రంగాపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది వసుధార.
కావాలనే నేను బోర్డ్‌పై రాసిన ఫార్ములాలను మీరు ఎలా సరిచేశారని రంగాను అడుగుతుంది. రిషి కూడా ఇలాగే ఫార్ములాను తప్పు రాస్తే కొప్పడేవాడని అంటుంది. వసుధార ఎన్ని ప్రశ్నలు వేసిన తాను రిషి కాదని అంటాడు రంగా. రంగాతో మాట్లాడుతూ వసుధార కిందపడబోతుంది. ఆమెను రంగా కిందపడకుండా కాపాడుతాడు. ఆ సీన్ చూసి సరోజ కోపం మరింత పెరుగుతుంది.
సరోజ కోపం...
కోపంతో గుండె రగిలిపోతుందని, ఇప్పుడే రంగాను నిలదీస్తానని సరోజ వెళ్లబోతుంది. ఆమెను బుజ్జి ఆపేస్తాడు. నీకు ఈ విషయం తెలిసిందని రంగాకు తెలిస్తే అతడు వసుధారతో మరింత సన్నిహితంగా ఉంటాడని సరోజను తన మాటలతో టెన్షన్ పెడతాడు బుజ్జి.
సమస్యల నుంచి బయటపడేసేది మీరే...
చూసుకుంటూ నడవండి లేదంటే కిందపడగలరని వసుధారతో అంటాడు రంగా. నేను పడిపోకుండా పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదా అని వసుధార బదులిస్తుంది. మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు నాకు అండగా ఉంటారు. నాకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి మీరే నన్ను బయటపడేస్తారని రంగాతో అంటుంది వసుధార. ఒకవేళ రిషి వచ్చి మీ ముందు ఉంటే...నన్ను రిషి అనుకున్నందుకు మీరు బాధపడతారని రంగా అంటుంది. రిషి మళ్లీ రావడం ఏంటి..అతడు నా ముందే ఉన్నాడని రంగాతో అంటుంది వసుధార.
డీఎన్ఏ టెస్ట్‌కు సిద్ధం...
రౌడీల ఎటాక్‌లో మీ మైండ్‌కు ఏదో అయ్యి ఉంటుందని, అందుకే నన్ను పట్టుకొని రిషి అంటున్నారని వసుధారపై సెటైర్ వేస్తాడు రంగా. కావాలంటే తనకు డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెబుతాడు. నేను పుట్టిన ప్లేస్‌కు, చదువుకున్న స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేసుకోమని వసుధారతో ఛాలెంజ్ చేస్తాడు రంగా.
రిషి ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను ఏమని సమాధానం చెప్పగలనని వసుధార అంటుంది. మీ నోటితోనే నేను రిషి అనుకునేలా చేస్తానని సవాల్ విసురుతుంది. వసుధారను చూసి పొగరు అని అంటాడు రంగా. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.