Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌-guppedantha manasu may 16th episode vasudhara taking dangerous risk for menu guppedantha manasu today serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

Nelki Naresh Kumar HT Telugu
May 16, 2024 08:09 AM IST

Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌నుకు కాపాడేందుకు వ‌సుధార‌, మ‌హేంద్ర చేస్తోన్న రిస్క్ చూసి అనుప‌మ ఎమోష‌న‌ల్ అవుతుంది. మ‌ను కోసం కాలేజీని వ‌దిలిపెట్టుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని తెలిసి త‌ట్టుకోలేక‌పోతుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial:తాము వేసిన ఉచ్చులో శైలేంద్ర పూర్తిగా ప‌డ్డాడ‌ని న‌మ్ముతారు వ‌సుధార, మ‌హేంద్ర‌. ఎండీ సీట్ త‌న‌కు ఇస్తున్న‌ట్లు అగ్రిమెంట్ పేప‌ర్స్‌పై సంత‌కం చేస్తే రాజీవ్ ఎక్క‌డున్న‌ది తాను చెబుతాన‌ని శైలేంద్ర డిమాండ్ చేశాడ‌ని, అందుకు తాము ఒప్పుకున్న‌ట్లు అనుప‌మ‌తో చెబుతుంది వ‌సుధార‌. మ‌ను కోసం కాలేజీని వ‌దులుకోవ‌డానికి వ‌సుధార‌, మ‌హేంద్ర సిద్ధ‌ప‌డ‌టం చూసి అనుప‌మ ఎమోష‌న‌ల్ అవుతుంది.

కాలేజీ రిషి ప్రాణం...

డీబీఎస్‌టీ కాలేజీ రిషి ప్రాణం..ఆ కాలేజీ కోస‌మే జ‌గ‌తి ప్రాణాలు పోయాయి...రిషి మ‌న‌కు దూర‌మ‌య్యాడ‌ని అనుప‌మ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా నాట‌కం అని మ‌హేంద్ర అంటాడు. మ‌నును రిలీజ్ చేసిన త‌ర్వాత డీల్ ప్ర‌కారం శైలేంద్ర‌కు కాలేజీఅప్ప‌గించ‌కుంటే వాడు మీకు ఎలాంటి ఆప‌ద‌ త‌ల‌పెడ‌తాడో అని అనుప‌మ భ‌య‌ప‌డుతుంది.

శైలేంద్ర‌కు భ‌య‌ప‌డి ఊరుకుంటే మ‌నును ఎలా కాపాడుతామ‌ని అనుప‌మ‌తో అంటాడు హేంద్ర‌. మా వ‌ల్ల మీరు ఇబ్బందులు ప‌డితే త‌ట్టుకోలేన‌ని అనుప‌మ బ‌దులిస్తుంది. మీరు..మేము అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావు. మ‌ను నా క‌న్న కొడుకు లాంటివాడు, కొడుకును కాపాడుకోవ‌డం కోసం ఓ తండ్రి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తాడో నేను అన్ని చేస్తున్నా. ఈ విష‌యంతో త‌గ్గేదేలే అని అంటాడు.

శైలేంద్ర ఎంట్రీ...

నేను చెప్పిన‌ట్లు వ‌సుధార చేస్తేనే రాజీవ్ అడ్రెస్ చెబుతాన‌ని శైలేంద్ర అన్న మాట‌ల గురించి మ‌హేంద్ర, వ‌సుధార ఆలోచిస్తుంటారు. శైలేంద్ర ఎలాంటి కండీష‌న్స్ పెడ‌తాడోన‌ని టెన్ష‌న్ ప‌డ‌తారు. ఎలాంటి ఇన్ఫ‌ర్మేష‌న్ లేకుండా స‌డెన్‌గా శైలేంద్ర తాను ఉన్న చోటుకు రావ‌డంతో రాజీవ్ షాక‌వుతాడు. వ‌సుధార త‌న‌ను చాలా ఇరిటేట్ చేస్తుంద‌ని, ఆమెను చంపేయాల‌న్నంత కోపం వ‌చ్చినా నీ మొహం చూసి ఊరుకుంటాన‌ని రాజీవ్‌తో కోపంగా అంటాడు శైలేంద్ర‌.

రాజీవ్ అనుమానం...

వ‌సుధార‌ను తీసుకొని ఎక్క‌డికైనా వెళ్ల‌మ‌ని రాజీవ్‌తో అంటాడు శైలేంద్ర‌. వ‌సుధార‌ను నేనే నీ ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తాన‌ని చెబుతాడు. ఇన్నాళ్లు వ‌సుధార‌ను క‌ల‌వొద్ద‌ని చెప్పిన శైలేంద్ర ఒక్క‌సారిగా మాట మార్చ‌డంతో రాజీవ్‌లో అనుమాన‌ప‌డ‌తాడు. న‌న్నుపోలీసుల‌కు ప‌ట్టించేందుకు ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతాడు. త‌న మాట‌ల‌తో రాజీవ్‌ను న‌మ్మిస్తాడు శైలేంద్ర‌.

తాను చెప్పిన లొకేష‌న్‌కు వ‌సుధార‌ను తీసుకొస్తాన‌ని అంటాడు. ఆ లొకేష‌న్‌లో వ‌సుధార కోసం వేచిచూడాల‌ని రాజీవ్ అనుకుంటాడు. ఇన్నేళ్ల నా నిరీక్ష‌ణ ఫ‌లించ‌బోతున్న‌ద‌ని, వ‌సుధార‌ మెడ‌లో తాళి క‌ట్టి నిన్ను ఆమెను త‌న‌ సొంతం చేసుకునే టైమ్ వ‌చ్చింద‌ని రాజీవ్ ఆనంద‌ప‌డిపోతాడు.

అనుప‌మ ఎమోష‌న‌ల్‌...

పోలీస్‌స్టేష‌న్ నుంచి మ‌హేంద్ర‌కు మ‌ను ఫోన్ చేస్తాడు. అనుప‌మ మేడ‌మ్ ఉందా..ఆమె ఎలా ఉన్నారు అని అడుగుతాడు. మ‌ను వాయిస్ విన‌గానే అనుప‌మ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు చాలా కంగారు ప‌డుతుంటార‌ని నేను అర్థం చేసుకోగ‌ల‌ను. కానీ మీరు అధైర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. నాకు వ‌సుధార‌, మ‌హేంద్ర తోడు ఉన్నార‌ని, న‌న్ను వారు బ‌య‌ట‌కు తీసుకొస్తార‌నే న‌మ్మ‌కం నాకు ఉంద‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌ను.

మ‌హేంద్ర రిస్క్‌...

న‌న్ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి మీరు చాలా రిస్క్ చేస్తున్నార‌ని, ఈ ప్ర‌య‌త్నంలో మీకు ఏమ‌న్నా అయితే తాను త‌ట్టుకోలేన‌ని మ‌హేంద్ర‌తో అంటాడు మ‌ను. మ‌నం ఒక్క రాంగ్ స్టెప్ వేసిన శైలేంద్రకు మ‌న ప్లాన్ మొత్తం తెలిసిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, అదే జ‌రిగితే శైలేంద్ర ఎంత‌కైనా తెగిస్తాడ‌ని మ‌ను కంగారు ప‌డ‌తాడు. అలాంటి భ‌యాలేవి పెట్టుకోవ‌ద్ద‌ని మ‌నుకు హామీ ఇస్తాడు మ‌హేంద్ర‌. నిన్ను కాపాడుకునే బాధ్య‌త మాది అని మాటిస్తాడు.

కొడుకులా ఫీల‌వుతున్నా...

నాకు కోసం ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నార‌ని మ‌హేంద్ర‌ను అడుగుతాడు మ‌ను. నేను నిన్ను కొడుకులా ఫీల‌వుతున్నాన‌ని మ‌హేంద్ర బ‌దులిస్తాడు. నువ్వు న‌న్ను తండ్రిగా అంగీక‌రించిన అంగీక‌రించ‌క‌పోయినా నిన్ను నా కొడుకులానే భావిస్తున్నాను. నీ కోసం ఎంత దూర‌మైన వెళ‌తాన‌ని మ‌నుతో అంటాడు మ‌హేంద్ర‌.

వ‌సుధార ఇంటికి శైలేంద్ర‌...

వ‌సుధార ఇంటికి వ‌స్తాడు శైలేంద్ర‌. మ‌న ప్లాన్‌లో భాగంగా రాజీవ్‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాలంటే వ‌సుధార నాతో రావాల‌ని అంటాడు. ఎక్క‌డికి తీసుకెళుతున్న‌ది మాత్రం న‌న్ను అడ‌గొద్ద‌ని చెబుతాడు. శైలేంద్ర వెంట వ‌సుధార వెళ్ల‌డానికి మ‌హేంద్ర ఒప్పుకోడు. కానీ వ‌సుధార మాత్రం వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతుంది.

నువ్వు వ‌సుధార‌ను రాజీవ్‌కు అప్ప‌గించ‌డానికే తీసుకెళుతున్నావా అంటూ శైలేంద్ర‌పై మ‌హేంద్ర ఫైర్ అవుతాడు. త‌న ప్లాన్ వేరేలా ఉంద‌ని...వ‌సుధార‌ను రాజీవ్‌ను క‌ల‌వ‌డానికే ముందే పోలీసుల‌కు అత‌డికి దొరికిపోయేలా అంతా సెట్ చేశాన‌ని, రాజీవ్ గురించి ఇప్ప‌టికే పోలీసుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాన‌ని అంటాడు.

రాజీవ్ కంత్రిగాడ‌ని, చివ‌రి నిమిషంలో మ‌న ప్లాన్ తెలిసినా వాడు జంప్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని, అందుకే వ‌సుధార‌ను మాత్ర‌మే త‌న‌తో పాటు తీసుకెళుతున్నాన‌ని, మీరు మ‌మ్మ‌ల్ని ఫాలో కావొద్ద‌ని మ‌హేంద్ర‌తో అంటాడు శైలేంద్ర‌.

నోరుజారిన వ‌సు

శైలేంద్ర వెంట వెళ్ల‌బోతూ మీ కొడుకును కాపాడే బాధ్య‌త నాది వ‌సుధార నోరు జారుతుంది. కొడుకు ఏంటి అని వ‌సుధార‌ను అనుమానంగా అడుగుతాడు శైలేంద్ర‌. త‌మ ప్లాన్ బ‌య‌ట‌ప‌డింద‌ని వ‌సుధార‌, మ‌హేంద్ర కంగారు ప‌డ‌తారు.