Guppedantha Manasu Serial: వసు ప్రశ్నలకు శైలేంద్ర ఉక్కిరిబిక్కిరి - మను కష్టాలకు పుల్‌స్టాప్ - దేవయాని అనుమానం
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఎండీ సీట్ కోసం మనును జైలు నుంచి విడిపించడానికి శైలేంద్ర అంగీకరిస్తాడు. తాను డీబీఎస్‌టీ ఎండీని కాబోతున్నట్లు ఆనందంలో తేలిపోతూ...ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయిస్తాడు శైలేంద్ర.
Guppedantha Manasu Serial: శైలేంద్రను ట్రాప్‌లో వేసి రాజీవ్ అడ్రస్ కనిపెట్టడానికి మహేంద్ర, వసుధార, మను ఒకరికి మించి మరొకరు పోటీపడి యాక్టింగ్ చేస్తుంటారు. వసుధార, మహేంద్రలను తీసుకొని మను దగ్గరకు వస్తాడు శైలేంద్ర. మనును చూడగానే మహేంద్ర ఫైర్ అవుతాడు.
మను మోసగాడు అంటూ అతడితో మాట్లాడేది లేదంటూ వెళ్లిపోబోతాడు. శైలేంద్ర అతడిని ఆపుతాడు. తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసి చూపిస్తాడు. తనను కాలేజీకి ఎండీగా ప్రకటిస్తూ వసుధార, మను సంతకం చేయాలని శైలేంద్ర అంటాడు.
సంతకం పెట్టని వసుధార...
అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకం చేయడానికి వసుధార ఒప్పుకోదు. దాంతో శైలేంద్ర ప్లేట్ ఫిరాయిస్తాడు. నాకు కాలేజీ ఇవ్వనని అన్నప్పుడు నేను నిన్ను ఎందుకు బయటకు తీసుకురావాలి...నాకు అవసరం లేదని మనుతో చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లబోతాడు. అతడిని మను ఆపుతాడు. నన్ను బయటకు తీసుకొస్తానని అన్నావంటే...రాజీవ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు అన్నమాట అని శైలేంద్రను అడుగుతాడు మను.
అవన్నీ నాకు అవసరం అంటూ శైలేంద్ర మాట దాటేస్తాడు. నన్ను ఎండీగా నియమించడానికి అంగీకరిస్తూ నువ్వు, వసుధార సంతకం పెడితేనే ...నిన్ను జైలు నుంచి విడిపిస్తాను.లేదంటే నీ బతుకు ఇంతే...సాక్ష్యాలు అన్ని నువ్వే హత్య చేసినట్లు బలంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు జీవితాంతం జైలులో ఉండాల్సిందే అని మనును భయపెడతాడు శైలేంద్ర.
భయపడ్డ మను...
శైలేంద్ర బెదిరింపులకు భయపడిపోయిన మను... అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకం పెడతాడు. కానీ వసుధార మాత్రం అగ్రిమెంట్స్ పేపర్స్‌పై సంతకం పెట్టడానికి అంగీకరించడు. శైలేంద్రకు ఎండీ కావడానికి ఏ అర్హత ఉందని ఫైర్ అవుతుంది. కాలేజీ గురించి శైలేంద్రకు ఏం తెలియదని వసుధార అంటుంది. మన కాలేజీలో ఎంత మంది స్టాఫ్, స్టూడెంట్స్ ఉన్నారని శైలేంద్రను మహేంద్ర అడుగుతాడు. ఆ ప్రశ్నకు అతడు తడబడిపోతాడు. సమాధానం తెలియక కంగారుపడతాడు.
ఎన్ని కోర్సులు ఉన్నాయి...
కనీసం మన కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో తెలుసా అని శైలేంద్రను ప్రశ్నిస్తుంది వసుధార. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నములుతాడు శైలేంద్ర. ఇది కూడా తెలియకుండా సూటు, బూటు వేసుకొని రోజు కాలేజీకి ఎందుకు వస్తావని శైలేంద్రపై మహేంద్ర ఫైర్ అవుతాడు.
వసుధారకు కనిపించకుండా దొంగచాటుగా పది కోర్సులు కాలేజీలో ఉన్నాయని శైలేంద్రకు హింట్ ఇస్తాడు మహేంద్ర. పది కోర్సులు ఉన్నాయని వసుధారకు సమాధానం చెబుతాడు శైలేంద్ర. ఆ కోర్సుల పేర్లు చెప్పమని శైలేంద్రతో అంటుంది వసుధార. తమ కాలేజీలోని లేని కొత్త కోర్సు పేరు చెబుతాడు.
ఎండీ సీట్ అప్పగించేది లేదు...
కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయో తెలియని శైలేంద్రకు ఎండీ సీట్ అప్పగించేది లేదని వసుధార అంటుంది. శైలేంద్ర పక్కన మనం ఉంటాం కదా...అన్నింటిని ఈ వెధవకు నేర్పుదాం అంటూ శైలేంద్రను చూపిస్తూ మహేంద్ర అంటాడు.
మా అన్నయ్య కడుపున చెడబుట్టి ఉండొచ్చు...వెధవ అయ్యిండొచ్చు...కానీ శైలేంద్ర పరాయివాడు కాదని...అతడు మన ఫ్యామిలీ మెంబర్ అని, అతడిపై తనకు నమ్మకం ఉందని పొగిడినట్లు నటిస్తూనే శైలేంద్ర గాలి మొత్తం తీసేస్తాడు మహేంద్ర. రిషిపై ఏ మాత్రం గౌరవం ఉన్నా అగ్రిమెంట్స్ పేపర్స్‌పై సంతకం పెట్టమని వసుధారను రిక్వెస్ట్ చేస్తాడు మహేంద్ర.
అడ్డుకున్న మను...
వసుధార సంతకం పెట్టబోతుండగా మను ఆపుతాడు. వసుధార సంతకం పెట్టిన తర్వాత నువ్వు నన్ను బయటకు తీసుకొస్తావని గ్యారెంటీ ఎంటీ అని శైలేంద్రను అడుగుతాడు మను. నిన్ను నేను నమ్మనని అంటాడు. ముందు నువ్వు నన్ను బయటకు తీసుకురా...ఆ తర్వాత అందరి సమక్షంలో నేను నీకు కాలేజీ అప్పగిస్తానని శైలేంద్రతో అంటాడు మను.
కాలేజీ నీకు సొంతమయ్యే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఇది మిస్సయితే జన్మలో నీ కల నెరవేరదు. నువ్వు ఎప్పటికీ ఎండీ సీట్‌లో కూర్చలేవు అంటూ శైలేంద్రకు సీటుపై ఉన్న మోజును అడ్డం పెట్టుకొని అతడిని ట్రాప్‌లో పడేస్తారు.
ట్రాప్‌లో పడ్డ శైలేంద్ర...
చివరకు మనును జైలు నుంచి విడిపించడానికి శైలేంద్ర అంగీకరిస్తాడు. అయితే తాను చెప్పినట్లు వసుధార చేయాలని కండీషన్ పెడతాడు. ఏం చేయాలన్నది ఆలోచించుకొని చెబుతానని వెళ్లిపోతాడు. శైలేంద్ర వెళ్లిపోగానే మనుకు సారీ చెబుతాడు మహేంద్ర. జైలు నుంచి విడిపించడానికి నిన్ను తిడుతున్నట్లుగా నటించడం తప్పడం లేదని అంటాడు.
శైలేంద్ర భూషణ్ ఎండీ...
శైలేంద్ర ఆనందంగా ఇంట్లో అడుగుపెడతాడు. దేవయాని, ధరణిలను పిలిపించి స్వీట్స్ తినిపిస్తాడు. ఇక నుంచి తాను ఉట్టి శైలేంద్రను కాదని, శైలేంద్ర భూషణ్ ఎండీ అని అంటాడు. నువ్వు ఎండీ...ఏ కాలేజీకి అని అడుగుతుంది దేవయాని. డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ వసుధార కదా...
నాకు తెలియకుండా నిన్ను ఎండీని ఎవరు చేశారని దేవయాని డౌట్ పడుతుంది. శైలేంద్రవి పగటి కలలు అని...మెదడు చిట్లిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడని ధరణి కంగారుపడుతుంది. రోజురోజుకు శైలేంద్రలో పిచ్చితనం ముదిరిపోతుందని ధరణి అంటుంది. కోడలి మాటలను దేవయాని కూడా నమ్మేస్తుంది. శైలేంద్ర అబద్ధం ఆడుతున్నాడని అనుకుంటుంది.
ఎండీగా పట్టాభిషేకం...
డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగా త్వరలోనే తనకు పట్టాభిషేకం జరుగనుందని, ఈ కార్యక్రమానికి ఇద్దరు రావాలని, దేవయాని, ధరణిలకు ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తాడు. నాకు తెలియకుండా శైలేంద్ర ఏదో వెధవ పని చేస్తున్నాడని దేవయాని కంగారు పడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.