Guppedantha Manasu August 13th Episode: శైలేంద్ర ప్రస్టేషన్ పీక్స్ - బావ కోసం సరోజ ఆరాటం - వసును ఆటపట్టించిన రిషి
Guppedantha Manasu August 13th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 13 ఎపిసోడ్‌లో ఎండీ సీట్ చేపట్టబోతున్న ఆనందంలో ఉంటాడు శైలేంద్ర. కానీ అతడికి సరోజ, పాండు ఒకరి తర్వాత మరొకరు ట్విస్ట్‌లు ఇస్తారు. సరోజ విషయంలో రిషిపై వసుధార అలుగుతుంది.
Guppedantha Manasu August 13th Episode: ఎండీ సీట్ చేపట్టనున్న ఆనందంలో ఉంటాడు శైలేంద్ర. తాను ఏం చేసినా లక్ష్యం కోసమే చేశానని, తన పాపాలను మంచి మనసుతో క్షమించమని దేవుడిని వేడుకుంటాడు శైలేంద్ర. తనకు ఎలాంటి అపశకునాలు, ఆటంకాలు ఎదురుకాకుండా చూడమని ప్రార్ధిస్తాడు. కానీ అతడు కళ్లు తెరవగానే ఎదురుగా సరోజతో పాటు ధన్‌రాజ్ ఉంటారు.
వారిని చూసి శైలేంద్ర షాకవుతాడు. వాళ్లను వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. తన బావ కోసం వచ్చానని, అతడిని తిరిగి తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళతానని గొడవ చేస్తుంది సరోజ. బావ అంటూ రంగాను గట్టిగా పిలుస్తుంది. ఆ అరుపులకు ఫణీంద్ర , ధరణి, దేవయాని కిందికివస్తారు.
నిజం ఒప్పుకున్న శైలేంద్ర…
సరోజ గొడవకు నిజాలు ఎక్కడ బయటపడతాయో అని దేవయాని, శైలేంద్ర కంగారు పడతాడు. అసలు ఎవరు నువ్వు...ఎక్కడికి ఎందుకొచ్చావని సరోజను అడుగుతాడు ఫణీంద్ర. మా బావను ఇతనే తీసుకొచ్చాడని శైలేంద్రను చూపిస్తుంది సరోజ. మా బావ ఇతడే అంటూ రిషి ఫొటోను ఫణీంద్ర, ధరణిలకు చూపించబోతుంది సరోజ.
కానీ తెలివిగా రిషి ఫొటోను వారు చూడకుండా అడ్డుకుంటాడు శైలేంద్ర. మీ బావను నేనే తీసుకొచ్చానని, ఈ రోజే తిరిగి ఊరు వెళ్లిపోయాడని అబద్ధం ఆడుతాడు. ధన్‌రాజ్ కూడా సరోజను కన్వీన్స్ చేసి గొడవను అడ్డుకుంటాడు. బావ నిజంగానే ఊరిలో కనిపించకపోతే మరోసారి వచ్చి రచ్చ రచ్చ చేయాలని సరోజ అనుకుంటుంది.
కొడుకును ఛీ కొట్టిన తండ్రి...
సరోజ వెళ్లిపోగానే ఆమె బావ ఎవరు? అతడిని నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావని కొడుకుపై ఫణీంద్ర ఫైర్ అవుతాడు. నాకు తెలిసిన వ్యక్తి అంటూ శైలేంద్ర బుకాయిస్తాడు. నువ్వు ఏం చేస్తావో ఎవరికి అర్థం కాదు అంటూ కొడుకును ఛీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఫణీంద్ర.
రిషి ఆలోచనలు...
రిషి దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. ఎవరికి ఎండీ బాధ్యతలు అప్పగించబోతున్నారని భర్తను అడుగుతుంది వసుధార. అన్ని అర్హతలు ఉన్న నువ్వేమో పదవిని చేపట్టడానికి ఒప్పుకోవడం లేదు... ఏం నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నానని రిషి అంటాడు.
నువ్వు ఎవరి పేరు చెబితే వారినే ఎండీగా ప్రకటిస్తానని వసుధారతో చెబుతాడు రిషి. కానీ వసుధార మౌనంగా ఉండిపోతుంది. బోర్డ్ మీటింగ్‌లో ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది, ఏం చేయాలన్నది నాకే క్లారిటీ లేదని వసుధారతో అంటాడు రిషి. ఏం చేయాలో నాకు తెలుసు అని వసుధార మనసులో అనుకుంటుంది.
ధన్‌రాజ్‌కు హ్యాండిచ్చిన సరోజ
రిషి, వసుధార కలిసి కారులో వెళుతుండటం సరోజ చూస్తుంది. ధన్‌రాజ్‌కు హ్యాండిచ్చి వారిని బైక్‌పై ఫాలో అవుతుంది. మరోవైపు శైలేంద్రకు పాండు ఫోన్ చేస్తాడు. ఇప్పటివరకు మన మధ్య జరిగిన డీలింగ్ మొత్తాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోవాలని అనుకుంటున్నట్లు శైలేంద్రను బ్లాక్‌మెయిల్ చేస్తాడు పాండు.
తాను పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నానని అంటాడు. దోపీడి, దుర్మార్గాలు చేస్తూ ఎంతో మంది కన్నీళ్లకు కారణమయ్యానని, ఇప్పుడు నా ఆలోచన విధానం మార్చుకొని మంచివాడిగా మారిపోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. పాండు మాటలతో శైలేంద్ర టెన్షన్ పడిపోతాడు. నువ్వు ఎక్కడున్నావో చెబితే నేను అక్కడికి వస్తానని పాండును రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర.
శైలేంద్ర టెన్షన్...
శైలేంద్ర టెన్షన్ భరించలేక రిషికి ఫోన్ చేస్తాడు. నువ్వైనా కాలేజీకి వస్తున్నావా? లేదంటే ఆలోచనను మార్చుకున్నావా అని రిషిని అడుగుతాడు శైలేంద్ర. బోర్డ్ మీటింగ్‌లో వసుధార చెప్పినట్లు కాకుండా నేను చెప్పిందే చేయాలని డిమాండ్ చేస్తాడు. సరేనని రిషి బదులిస్తాడు.
రిషి, వసుధారలను పట్టుకోవాలని సరోజ అనుకుంటుంది. నాలుగు రోడ్ల జంక్షన్ రావడంతో వారి కారు ఎటు వెళ్లిందో తేల్చుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు నా కోసం వచ్చావా...మీ బావ కోసం వచ్చావా అంటూ సరోజను నిలదీస్తాడు ధన్‌రాజ్. నీ కోసమే అంటూ ధన్‌రాజ్‌ను బురిడీ కొట్టిస్తుంది సరోజ.
రిషిపై వసు అలక…
అప్పుడే రిషికి ఫోన్ చేసిన బుజ్జి...సరోజ నిన్ను వెతకడానికి హైదరాబాద్ వచ్చిందని చెబుతాడు. ధన్‌రాజ్ ద్వారా నువ్వు హైదరాబాద్‌లో ఉన్న సంగతి కనిపెట్టిందని అంటాడు. మా సరోజ హైదరాబాద్ వచ్చిందట అని బుజ్జి ఫోన్‌లో తనకు చెప్పిన విషయాలను వసుధారకు వివరిస్తాడు రిషి. మా సరోజ అనడంతో వసుధార అలుగుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.