తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Today Episode: సెక్యూరిటీ గార్డ్‌గా శైలేంద్ర - రిషి రీఎంట్రీ? - వ‌సు మెడ‌లో తాళిక‌ట్ట‌బోయిన రాజీవ్‌

Guppedantha Manasu Today Episode: సెక్యూరిటీ గార్డ్‌గా శైలేంద్ర - రిషి రీఎంట్రీ? - వ‌సు మెడ‌లో తాళిక‌ట్ట‌బోయిన రాజీవ్‌

10 April 2024, 8:36 IST

google News
  • Guppedantha Manasu April 10th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి త‌న‌కు క‌నిపించాడ‌ని ఓ అజ్ఞాత వ్య‌క్తి వ‌సుధార‌కు ఫోన్ చేస్తాడు. అత‌డు చెప్పిన చోటుకు వ‌సుధార వ‌స్తుంది. కానీ అక్క‌డ రిషి బ‌దులుగా రాజీవ్ ఉంటాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu April 10th Episode: కాలేజీ బోర్డ్ మీటింగ్‌కు మ‌ను అటెండ్ కాదు. కాలేజీ బోర్డ్ మెంబ‌ర్స్‌లో వ‌న్ ఆఫ్ ది డైరెక్ట‌ర్ అయ్యిండి మ‌ను మీటింగ్‌కు రాక‌పోవ‌డం ఏంట‌ని శైలేంద్ర నిల‌దీస్తాడు. మ‌నును అంద‌రి ముందు ఇరికించాల‌ని ప్లాన్ చేస్తాడు. కానీ అత‌డి ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. మ‌ను కాలేజీకి ఎందుకు రావ‌డం లేదో తెలుసుకొని అత‌డిని నువ్వే మీటింగ్‌కు తీసుకురావాల‌ని శైలేంద్ర‌తో అంటాడు ఫ‌ణీంద్ర‌.

సెక్యూరిటీగా శైలేంద్ర‌...

లాస్ట్ మీటింగ్‌లో గాజు గ్లాస్ ప‌గిలి అత‌డి చేతికి గాయ‌మైంది క‌దా. ఆ గాయం వ‌ల్లే రాలేక‌పోతున్నాడా? డైరెక్ట‌ర్ ప‌ద‌విని ఇబ్బందిగా ఫీల‌వుతున్నాడా అన్న‌ది క‌నుక్కొని మ‌నును కాలేజీకి తీసుకువ‌చ్చే బాధ్య‌త నీదేన‌ని శైలేంద్ర‌తో అంటాడు ఫ‌ణీంద్ర‌. నేను వెళ్లి మ‌నును కాలేజీకి తీసుకురావ‌డం ఏంటి అని శైలేంద్ర అంటాడు.

మ‌ను మీటింగ్‌కు రాలేద‌ని నువ్వే అన్నావు కాబ‌ట్టి అత‌డిని తీసుకురావాల్సింది నువ్వే. మ‌నును కాలేజీకి తీసుకురాక‌పోతే కాలేజీ గేటు బ‌య‌ట సెక్యూరిటీలా ప‌నిచేయాల్సివ‌స్తుంద‌ని శైలేంద్రను హెచ్చ‌రిస్తాడు ఫ‌ణీంద్ర‌. శైలేంద్ర తాను తీసుకున్న గోతిలో తానే ప‌డటంతో మ‌హేంద్ర‌, వ‌సుధార న‌వ్వుకుంటారు.

వ‌సుధార వార్నింగ్‌...

తండ్రి చెప్పిన‌ట్లుగా తాను సెక్యూరిటీ అయిపోయిన‌ట్లు శైలేంద్ర ఊహించుకుంటాడు. ఆ క‌ల అత‌డిని భ‌య‌పెడుతుంది. ఒక‌వేళ మ‌నును నువ్వు కాలేజీకి తీసుకురాక‌పోతే ఆ క‌ల నిజం అవుతుంద‌ని, సెక్యూరిటీ గార్డ్‌గానే ప‌ర్మినెంట్‌గా సెటిల్ కావాల్సివ‌స్తుంద‌ని శైలేంద్ర‌పై పంచ్ వేస్తుంది వ‌సుధార‌. ఇప్పుడు కూడా నువ్వు సెక్యూరిటీ ప‌నిచేస్తున్నావు. మేము ఏం చేస్తున్నాం, ఎక్క‌డికి వెళుతున్నాం అన్న‌ది తెలుసుకోవ‌డ‌మే నీ ప‌ని. ఈ సెక్యూరిటీ ప‌ని ఏదో గేట్ ద‌గ్గ‌ర చేస్తే బాగుంటుంద‌ని శైలేంద్ర గాలి తీసేస్తుంది వ‌సుధార‌.

క‌నిపించిన రిషి...

వ‌సుధార త‌న క్యాబిన్‌లో ఉండ‌గా ఓ వ్య‌క్తి ఫోన్ చేసి త‌న‌కు రిషి క‌నిపించాడ‌ని చెబుతాడు. ఆ మాట విన‌గానే వ‌సుధార సంతోష‌ప‌ట్ట‌లేక‌పోతుంది. తాను ఇప్పుడే వ‌స్తున్నాన‌ని, అప్ప‌టివ‌ర‌కు రిషిని క‌నిపెట్టుకొని ఉండ‌మ‌ని ఫోన్ చేసిన వ్య‌క్తికి చెబుతుంది. రిషిని క‌ల‌వ‌డానికి హ‌డావిడిగా బ‌య‌లుదేరుతుంది.

మీరు క్షేమంగా ఉంటార‌ని నాకు తెలుసు. మ‌న రిషిధార‌ల బంధాన్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌ని వ‌సుధార అనుకుంటుంది. మిమ్మ‌ల్ని అంద‌రి ముందు నిల‌బెట్టి ఈ లోకానికి మ‌న ప్రేమ గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతాన‌ని ఆనందంగా అనుకుంటుంది.

రాజీవ్ ఎంట్రీ...

రిషి క‌నిపించాడ‌ని ఫోన్ చేసిన వ్య‌క్తి చెప్పిన చోటుకు వ‌స్తుంది వ‌సుధార‌. రిషి కోసం వెతుకుంటుంది. అప్పుడే అక్క‌డికి రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు. అత‌డిని చూసి వ‌సుధార షాక‌వుతుంది. నీ క‌ళ్లు వెతుకుతున్న‌ది. రిషికోస‌మేనా అని వ‌సుధార‌ను అడుగుతాడు రాజీవ్‌. రిషి క‌నిపించాడ‌ని నీకు ఫోన్ చేసిందే నేను అని చెప్పి వ‌సుధార‌కు ట్విస్ట్ ఇస్తాడు రాజీవ్‌.

రిషి క‌నిపిస్తాడ‌ని సంతోషంగా వ‌చ్చావు. కానీ రిషి ఇక్క‌డ లేడు. ఇక్క‌డే కాదు అస‌లు బ‌తికే లేడ‌ని అంటాడు. ఎమోష‌న‌ల్‌గా త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేసిన రాజీవ్‌పై వ‌సుధార ఫైర్ అవుతుంది. నీకోస‌మే, నిన్ను నా సొంతం చేసుకోవ‌డానికే రిషి క‌నిపించాడ‌ని నాట‌కం ఆడాన‌ని వ‌సుధార‌కు బ‌దులిస్తాడు రాజీవ్‌. అత‌డికి క్లాస్ ఇస్తుంది వ‌సుధార‌. కానీ ఆమె మాట‌ల‌ను తేలిగ్గా తీసుకుంటాడు రాజీవ్‌.

గ‌న్‌తో షూట్‌...

నీమీద ప్రేమ‌తో నాకు పిచ్చిప‌ట్టింద‌ని వ‌సుధార‌తో అంటాడు రాజీవ్‌. జేబులో నుంచి తాళి తీసి ఇది నీ మెడ‌లో క‌ట్టి నా పిచ్చి త‌గ్గించుకుంటాన‌ని అంటాడు. వసుధార మెడలో బలవంతంగా తాళి కట్టబోతాడు. అప్పుడే అక్క‌డికి ఎంట్రీ ఇచ్చిన మ‌ను...గ‌న్‌తో రాజీవ్‌ను షూట్ చేస్తాడు. బుల్లెట్ కొద్దిలో మిస్స‌వుతుంది. మ‌నును చూడ‌గానే రాజీవ్ భ‌య‌ప‌డిపోయి వ‌సుధార చేయి వ‌దిలేస్తాడు.

మిస్స‌యింది అనుకున్నావా...నేను మిస్ చేశాన‌ని రాజీవ్‌కు వార్నింగ్ ఇస్తాడు మ‌ను. నా ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నావ‌ని, ప్ర‌తిసారి వ‌సుధార‌ను కాపాడ‌టానికి నువ్వేమైనా అప‌ద్భాంద‌వుడిగా, అవ‌తార పురుషుడిగా అంటూ మ‌నుపై సెటైర్ వేస్తాడు. ఒక అమ్మాయి మ‌న‌సు తెలిసిన వాడిని అని మ‌ను బ‌దులిస్తాడు.

ఈ సారి బుర్ర‌లోకి దిగుతుంది...

ప్రేమ‌తో అమ్మాయి మ‌న‌సు గెల‌వాలి కానీ భ‌య‌పెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి ప్రేమ‌లో గెల‌వాల‌ని అనుకోవ‌డం మ‌గాడి ల‌క్ష‌ణం కాద‌ని రాజీవ్‌తో అంటాడు మ‌ను. లాస్ట్ టైమ్ కూడా నీకు వార్నింగ్ ఇచ్చాను. అయినా నువ్వు ఇంకా దారిలోకి రాలేద‌ని రాజీవ్‌ను హెచ్చ‌రిస్తాడు మ‌ను. నీలాంటివాళ్లు నాలాంటోడికి రోజు వార్నింగ్‌లు ఇస్తూనే ఉంటారు. ఇవ‌న్నీ కామ‌న్ అని మ‌ను వార్నింగ్‌ను లైట్ తీసుకుంటాడు రాజీవ్‌.

వ‌సుధార‌ను ఏడిపిస్తే ఈసారి బుల్లెట్ మిస్స‌వ్వ‌దు. డైరెక్ట్ నీ బుర్ర‌లోకి బుల్లెట్ దూసుకుపోతుంద‌ని అంటాడు. మ‌ను వార్నింగ్‌తో రాజీవ్ భ‌య‌ప‌డి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. రిషిని వెత‌క‌డానికి మీరు ఎంత ప్ర‌య‌త్నిస్తున్నారో నాకు తెలుసు. బాధ‌ప‌కుండా ధైర్యంగా ఉండ‌మ‌ని వ‌సుధార‌ను ఓదార్చుతాడు

టైటిల్ వ‌ల్లే ఓట‌మి...

డీఆర్ఎస్ ప్లాన్ మొత్తం ఫెయిల‌వ్వ‌డంతో దేవ‌యానిని ఎగ‌తాళి చేస్తాడు శైలేంద్ర‌. క‌లిసి క‌ట్టుగా కాకుండా విడివిడిగా ఒక్కొక్క‌రిని టార్గెట్ చేస్తే మ‌నం గెలుస్తామ‌ని అన్నావు. కానీ ఈ ప్లాన్‌లో మీరిద్ద‌రు ఓడిపోయారు. మీ వ‌ల్ల చేత‌కాద‌ని నాకు అర్థ‌మైంది. ఇక నుంచి నేనే ఏదో ఒక‌టి చేస్తాన‌ని దేవ‌యానితో అంటాడు శైలేంద్ర‌.

దేవ‌యాని, రాజీవ్‌ స‌ర్ధిచెప్ప‌బోయినా వారి మాట‌ల‌ను శైలేంద్ర‌ ప‌ట్టించుకోడు. డీఆర్ఎస్ అనే టైటిల్ మ‌న‌కు సెట్ట‌వ్వ‌ద‌ని ముందే చెప్పాను. ఆ టైటిల్ బాగాలేక‌పోవ‌డం మ‌నం ఫెయిల‌య్యామ‌ని చెబుతాడు. మీరిద్ద‌రు ఫెయిలైన నేను మాత్రం ఓడిపోన‌ని దేవ‌యాని, రాజీవ్ ముందు గొప్ప‌ల‌కు పోతాడు శైలేంద్ర‌.

ద‌డ పుట్టించేలా చేస్తా...

మ‌నును కాలేజీకి తీసుకొచ్చే బాధ్య‌త‌ను ఫ‌ణీంద్ర నాకు అప్ప‌గించాడ‌ని, మ‌నును కాలేజీకి తీసుకొచ్చి అంద‌రి ముందు అత‌డికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తాను. నేనంటే ద‌డ పుట్టించేలా చేస్తాన‌ని బిల్డ‌ప్‌లు ఇస్తాడు శైలేంద్ర‌. మ‌ను కోపంగా కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేసిందే నువ్వే. ఇప్పుడు నువ్వు పిలిస్తే మ‌ను కాలేజీకి నిజంగా వ‌స్తాడా అంటూ రాజీవ్ అనుమానం వ్య‌క్తంచేస్తాడు.

ఎలాగైనా తాను మ‌నును కాలేజీకి ర‌ప్పిస్తాన‌ని అంటాడు. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఉంటే మ‌న‌మే ఓడిపోతామ‌ని కొడుకుకు స‌ల‌హా ఇస్తుంది దేవ‌యాని. మ‌నును ఎలా కాలేజీకి ర‌ప్పించాలో ఆలోచించ‌మ‌ని శైలేంద్ర‌కు చెబుతుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

తదుపరి వ్యాసం