Gundeninda Gudigantalu Today Episode: మనోజ్ జాబ్ డ్రామాపై బాలు డౌట్ - మీనా చెల్లెలి ప్రేమకు ప్రభావతి అడ్డు
12 September 2024, 7:37 IST
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 12 ఎపిసోడ్‌లో మనోజ్ ఉద్యోగానికి వెళుతున్నట్లు అబద్ధం ఆడుతూ పార్కులో స్నేహితులతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైమ్‌పాస్ చేస్తుంటాడు. మనోజ్ జాబ్ గురించి బాలుతో గొప్పలు చెబుతుంది రోహిణి.
గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 12 ఎపిసోడ్
Gundeninda Gudigantalu Today Episode: క్యాబ్ ట్రిప్ క్యాన్సిల్ చేసి మీనాను బయటకు తీసుకెళ్లాలని బాలు అనుకుంటాడు. ఎప్పుడు చూసిన కారు ఈఎమ్ఐలు, వడ్డీలు, ఇంటి ఖర్చులు అనేవారు...ఇప్పుడేంటి బయటకు వెళదామని అంటున్నారని భర్తను అడుగుతుంది మీనా. మళ్లీ బజ్జీల బండి దగ్గరకు తీసుకెళతారా అంటూ భర్తను ఆటపట్టిస్తుంది మీనా. ఈఎమ్ఐలు, వడ్డీల గురించి ఆలోచించి టేస్ట్‌లెస్‌ఫెలోలా తయారయ్యానని మీనాతో అంటాడు బాలు.
బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని, మీ అమ్మకు తెలిస్తే గొడవ చేస్తుందని మీనా భయపడుతూ బాలుతో అంటుంది. మా అమ్మకు నన్ను అనడానికి కారణాలతో పని ఉండదని మీనాతో అంటాడు బాలు. రోహిణితో పదే పదే బాలు గొడవ పడటం మీనాకు నచ్చదు. రోహిణిపై జాలి చూపిస్తుంది. మీ కోసం నేను కూడా రోహిణిని మాటలు ఆనాల్సివస్తుందని మీనా బాధపడుతుంది.
కంట్లో నలక...
మీనా కంట్లో నలకపడటంతో బాలు ఊది తీసేస్తాడు. మీనానే చూస్తూ ఉండిపోతాడు. మీనా కొంగు పట్టుకొని అలాగే ఉండిపోతాడు. మీ కోసం కష్టమైన నలుగురు పిల్లలను కంటానని మీనా అంటుంది. ఆమె మాటలకు బాలు కంగారుపడిపోయి ఈ లోకంలోకివస్తాడు. బాలు రూమ్ నుంచి వెళ్లిపోబోతాడు. నసహీన పక్షి, టేస్ట్‌లెస్ ఫెలో అని బాలును తిడుతుంది మీనా. ఆ తిట్లకు మీనాకు థాంక్స్ చెబుతాడు బాలు.
ప్రభావతి అసహనం...
మీనా కారణంగా తన అప్పు సంగతి బయటపడటం ప్రభావతి సహించలేకపోతుంది. ఇంటి డాక్యుమెంట్స్‌ను మీనాకు ఇచ్చి తన పరువును భర్త మరింత తీసేశాడని కామాక్షితో చెబుతూ బాధపడుతుంది ప్రభావతి. రవి...మీనా చెల్లెలు సుమతిని ప్రేమిస్తున్నాడని తెలిసి ప్రభావతి కంగారు మరింత పెరుగుతంది.
రవి ప్రేమ విషయం బాలుకు తెలిస్తే వారి పెళ్లిని ఎక్కడ జరిపిస్తాడోనని భయపడుతుంది. అలా జరగకుండా తన చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి కూతురితో కొడుకు రవి పెళ్లి జరిపించాలని ప్లాన్ వేస్తుంది ప్రభావతి. ఒకే సారి రవితో పాటు కూతురు మౌనిక పెళ్లి జరిపించాలని అనుకుంటుంది.
సత్యం సెటైర్లు...
రవి పెళ్లి నిర్ణయం వెంటనే ఇంట్లో అందరికి చెప్పాలని అనుకుంటుంది ప్రభావతి. బాలు, మీనా తాను పిలిస్తే రారని భర్తను వారిని పిలవమని చెబుతుంది. ప్రభావతి ప్రతి మాటలకు సెటైర్లు వేస్తాడు సత్యం. నీలాంటిదానిని ఇంకా భరిస్తున్నందుకు నన్ను నేను అనుకోవాలని సత్యం అంటాడు.
పోలీసులకు ఫోన్ చేయాలా?
బాలు వచ్చి రావడంతోనే మళ్లీ ఇంట్లో ఏం పోయింది? పోలీసులకు ఫోన్ చేయాలా? ఈ సారి ఎవరిపై కంప్లైంట్ ఇవ్వాలని బాలు అంటాడు. బాలుపై కోపం వచ్చినా ఏం చేయలేకపోతుంది ప్రభావతి. నా మనశ్శాంతి పోయిందని అంటుంది. లక్ష రూపాయలు పోయినప్పుడు ఎందుకు పోలీసుల కంప్లైంట్ ఇవ్వలేదని భార్యను అడుగుతాడు సత్యం. ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టిన విషయం బయటపడుతుందని అమ్మ భయపడిఉంటుందని మౌనిక ఆన్సర్ ఇస్తుంది.
బీపీ పెరుగుతుంది...
నీ మాటలకు మీ అమ్మకు బీపీ పెరుగుతుందని బాలుతో చెబుతాడు సత్యం. ఈ రోజు నుంచి అమ్మ తినే కూరల్లో ఉప్పు, కారం తగ్గించమని మీనాతో ఫన్నీగా అంటాడు బాలు. ప్రభావతి చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా బాలు ఆడ్డుకుంటూ పంచ్‌లు వేస్తుంటాడు.
మౌనిక పెళ్లి...
రవికి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు ప్రభావతి చెబుతుంది. ఆ మాటలకు అందరూ షాకవుతారు. మంచి నిర్ణయమే కానీ సరైన నిర్ణయం కాదని సత్యం తన అభిప్రాయం చెబుతాడు. రవి కంటే ముందు మౌనిక పెళ్లి జరిపించడమే సరైందని సత్యం అంటాడు. కుదిరితే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేద్దామని ప్రభావతి అంటుంది.
ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నాని, పెళ్లి పేరుతో తన కలల్ని డిస్ట్రబ్ చేయద్దని మౌనిక అంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటుందని, మౌనిక భవిష్యత్తు బాగుండాలంటే తొందరపడి పెళ్లి చేయకపోవడమే మంచిదని మౌనికకు మీనా సపోర్ట్ చేస్తుంది.
రోహిణికి పంచ్...
తొందరపడి పెళ్లి చేసుకుంటే మీనాలా వంటలు చేసుకుంటూ బతకాల్సివవస్తుందని మౌనికకు సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ మీనాపై సెటైర్లు వేస్తుంది రోహిణి. అత్తగారి ఇళ్లు తాకట్టు పెట్టించి లక్షలు లక్షలకు మింగాల్సిన పరిస్థితి కూడా వస్తుందని...అంత దరిద్రమైన జీవితం నా చెల్లెలికి వద్దని రోహిణి మాటలకు బాలు బదులిస్తాడు.
ప్రభావతి కంగారు...
రవికి తానో మంచి సంబంధం చూశానని సత్యం అనడంతో ప్రభావతి కంగారు పడుతుంది. మీనా చెల్లెలు సుమతి పేరు భర్త ఎక్కడ చెబుతాడో కంగారు పడుతుంది. రంగారావు మావయ్య తమ్ముడి కూతురితో రవి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నట్లు సత్యం చెబుతాడు. రోహిణి లాంటి మంచి అమ్మాయిని ఇంటి కోడలిగా రావాలని ప్రభావతి అంటుంది. తన పార్లర్‌కు నా పేరు పెట్టుకున్నదని రోహిణిని మెచ్చుకుంటుంది ప్రభావతి. నాకు పదిహేడు లక్షలు ఇస్తే...నా కారు వెనకాల అమ్మదీవెన అని రాస్తానని బాలు అంటాడు.
మనోజ్ నాటకం...
ఆఫీస్ పేరుతో పార్కులో కూర్చొని స్నేహితులతో కబుర్లు చెబుతుంటాడు మనోజ్. రవి రెస్టారెంట్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. రేపోమాపో నీ పెళ్లి జరగనుందని, ఆ లోపే నీ సొంత రెస్టారెంట్ మొదలుపెడితే మంచిదని రవితో అంటుంది మీనా. వదిన మాటలతో రవి షాకవుతాడు.
తన పెళ్లికి తొందరేమిటని తండ్రితో వాదిస్తాడు. రెస్టారెంట్‌ను మంచి పొజిషన్‌కు తీసుకెళ్లిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తండ్రితో అంటాడు రవి. రంగారావుకు మీ నాన్న తప్ప మరొకరు దిక్కులేదని, బాలుతో ముహూర్తం పెట్టి పంపించిన పంపిస్తాడని ప్రభావతి భర్తను దెప్పిపొడుస్తుంది.
నీకు ఎప్పుడు ఆస్తులు, అంతస్తుల గోల తప్పితే మనుషులు, వాళ్లు బుద్దులతో పనిలేదా అని ప్రభావతితో అంటాడు సత్యం. డబ్బు ఉంటే సమస్యలు ఉండవని ప్రభావతి బదులిస్తుంది. నేను మనుషులకే విలువ ఇస్తానని సత్యం అంటాడు.
బాలు డౌట్...
రవి పెళ్లిని ఫిక్స్ చేయడానికి వెళ్లిన బాలు తిరిగి ఇంటికొస్తాడు. బాలు ఎలాంటి నిర్ణయం తీసుకొని వచ్చాడోనని రవి కంగారు పడతాడు. ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకు మనోజ్ డబ్బులు ఇస్తాడని ఎవరో మంగమ్మ శపథం చేశారని బాలు అంటాడు. మనోజ్ చేసే పని ఎంత కష్టామో నీకు తెలుసా అంటూ బాలుతో వాదిస్తుంది రోహిణి.
కష్టం చేస్తేనే కదా తెలిసేది అంటూ తాను జాబ్ చేయడం లేదన్న సంగతి మనోజ్ స్వయంగా నోరుజారుతాడు అతడి మాటలకు రోహిణి షాకవుతుంది. నీ వాలకం చూస్తుంటే నువ్వు జాబ్‌కు వెళుతున్నట్లు లేదని మనోజ్‌పై బాలు అనుమానపడతాడు. అక్కడితో గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్