తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: సంజు నిజస్వరూపం బయటపెట్టిన బాలు.. రివేంజ్ ప్లాన్ అట్టర్ ప్లాప్- నీలకంఠం ఫ్యామిలీకి ఘోర అవమానం

Gunde Ninda Gudi Gantalu: సంజు నిజస్వరూపం బయటపెట్టిన బాలు.. రివేంజ్ ప్లాన్ అట్టర్ ప్లాప్- నీలకంఠం ఫ్యామిలీకి ఘోర అవమానం

Sanjiv Kumar HT Telugu

21 December 2024, 8:18 IST

google News
  • Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో సత్యం ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు నీలకంఠం ఫ్యామిలీ. తాంబూళాలు మార్చుకునే సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అడ్డుకుంటాడు. సంజు నిజస్వరూపం బయటపెట్టి, ఉతికి ఆరేస్తాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లి చూపులకు బాలు రాకుండా ఉండేందుకు సంజు ప్లాన్ చేస్తాడు. తన డ్రైవర్ ఫోన్ నుంచి బాలుకు కాల్ చేసి రైడ్ కావాలని అడుగుతాడు. సరే, ఎప్పుడు అని బాలు అడుగుతాడు. మరుసటి రోజు ఉదయం పది గంటలకు కావాలని సంజు చెబుతాడు.

ఉదయం పదింటికల్లా

అప్పుడు ముఖ్యమైన పని ఉంది, రాలేనని చెబుతాడు బాలు. కానీ, ఆ మాటలు విన్న ప్రభావతి వీడు లేకపోవడమే మంచిది అని ఒప్పేసుకో. చాలా డబ్బు ఇస్తామంటున్నారు కదా అని అంటుంది. లేదు, నేను ఉండాలి అని బాలు అంటాడు. నేను ఉన్నాను కదరా. నేను చూసుకుంటాను. నువ్వు వచ్చేవరకు వాళ్లను ఉండమంటాను అని సత్యం అంటాడు. దాంతో బాలు కన్విన్స్ అయి ఒప్పుకుంటాడు. కచ్చితంగా రేపు ఉదయం పదింటికల్లా రావాలి అని సంజు అంటే.. ఇచ్చిన మాట తప్పను అని బాలు అంటాడు.

పెళ్లి చూపులకు సంజు ఫ్యామిలీ

మరోవైపు ఖాలీ కాటన్ బాక్స్‌లు పెట్టుకుని ఒక్కక్కరి ఇంటికి ఇస్తూ సాయంత్రం వరకు వాడిని ఊరిలో తిప్పుతూనే ఉండు. నేను చెప్పేవరకు వాడు కారు దిగకూడదు అని డ్రైవర్ గిరితో సంజు చెబుతాడు. దాంతో గిరి సరేనని వెళ్లిపోతాడు. మరి పెళ్లిలో వాడు నిన్ను చూసే అవకాశం ఉందికదా. అప్పుడెలా మేనేజ్ చేస్తావ్ అని సంజును నీలకంఠం అడుగుతాడు. దానికి ఓ పర్ఫెక్ట్ ఐడియా ఉందని సంజు అంటాడు. మరుసటి రోజు ఉదయం సత్యం ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు నీలకంఠం ఫ్యామిలీ.

సంజు గురించి గొప్పలు

నమస్కారం చెబుతూ ఇంట్లోకి నీలకంఠం కుటుంబాన్ని ప్రభావతి, సత్యం తీసుకెళ్తారు. సత్యంకో ఇంట్లో సంజు, నీలకంఠం, సువర్ణ కూర్చుంటారు. సత్యం ఇంట్లో మనోజ్, రోహిణి, మీనా, మౌనికతోపాటు కామాక్షి, రంగా కూడా ఉంటారు. ఇంట్లో పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటారు. సంజు ఎంత మంచోడో చెబుతుంటాడు నీలకంఠం. చాలా బుద్ధిమంతుడు అని, అందుకే ప్రేమించమని వెంటపడకుండా మా దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని చెప్పాడని నీలకంఠం అంటాడు.

మౌనిక పద్ధతిగా పెరిగిందంటూ

మరోవైపు మౌనిక కూడా అందరిలాంటి అమ్మాయి కాదని, చాలా పద్ధతిగా పెంచామని ప్రభావతి, సత్యం చెబుతారు. తర్వాత సంజు నచ్చాడా అని మౌనికను అడిగుతారు. మీ ఇష్టం అని మౌనిక అంటుంది. సరే మరి తాంబూలాలు ఇచ్చుకుందామని, పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందామని నీలకంఠం అంటాడు. మా రెండో అబ్బాయి పని ఉండి వెళ్లాడు. వాడు వచ్చే వరకు కాస్తా ఆగుదాం అని సత్యం చెబుతాడు. దాన్ని ఆపేందుకు ప్రభావతి ట్రై చేస్తుంది.

ఆయన వచ్చేశారు మావయ్య

కానీ, సత్యం మాత్రం వచ్చేవరకు కాస్తా వెయిట్ చేద్దామని అంటాడు. బాలు వస్తే దొరికిపోతామని, మా మీద నమ్మకం లేదా. లేకుంటే వెయిట్ చేద్దామని నీలకంఠం అంటాడు. దాంతో అలాంటిదేం లేదు, సరే తాంబూళాలు తీసుకుందామని సత్యం ఒప్పుకుంటాడు. తాంబుళాలు తీసుకునేందుకు అంతా లేచి నిల్చుంటారు. ఇంతలో బైక్‌పై బాలు వస్తాడు. అది చూసిన మీనా మావయ్య ఆయన వచ్చేశారు అని చెబుతుంది.

బాలు షాక్

నీలకంఠం, సత్యం తాంబుళాలు తీసుకుంటూ ఉండగా బాలు ఎంట్రీ ఇస్తాడు. అక్కడ సంజును చూసి బాలు షాక్ అవుతాడు. వీడా పెళ్లి కొడుకు అని బాలు అనేసరికి అంతా షాక్ అవుతారు. మా అమ్మ తెచ్చిన సంబంధం అని తెలిసినప్పుడే ఇలాంటి దరిద్రపుగొట్టు సంబంధం అయి ఉంటుందని అనుమానపడుతూనే ఉన్నా అని, బార్‌లో సంజుతో జరిగిన గొడవ గురించి బాలు బయటపెడతాడు.

ఉతికి ఆరేసిన బాలు

తాంబూళాలు మార్చుకునే సమయంలో ఊడిపడి ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని ప్రభావతి అంటుంది. ఇలాంటి వాడికి నా చెల్లిన ఇచ్చేదేలేదు అని నీలకంఠం చేతిలో ఉన్న తాంబూళాన్ని విసరగొడతాడు బాలు. వెళ్లరా బయటకు అని బాలు అంటాడు. సంజు ఏదో చెప్పబోతుంటే బాలు ఉతికిఆరేసినట్లు తెలుస్తోంది. దాంతో అంతా షాక్ అవుతారు.

ఘోర అవమానం

సంజు అలాగే నిర్ఘాంతపోయి చూస్తాడు. అలా సంజు ప్లాన్ బెడిసికొట్టినట్లు అయినట్లు తెలుస్తోంది. దీన్ని నీలకంఠం ఘోర అవమానంగా ఫీల్ అవుతాడు. అయితే ఇది సంజు కల అయ్యే అవకాశం కూడా ఉంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం