తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather 2 Days Collections: గాడ్‌ఫాద‌ర్ క‌లెక్ష‌న్స్ - రెండో రోజుల్లోనే యాభై కోట్ల మార్కు క్రాస్ చేసిన‌ చిరు

Godfather 2 Days Collections: గాడ్‌ఫాద‌ర్ క‌లెక్ష‌న్స్ - రెండో రోజుల్లోనే యాభై కోట్ల మార్కు క్రాస్ చేసిన‌ చిరు

07 October 2022, 11:09 IST

  • Godfather 2 Days Collections: చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టించిన చిరంజీవి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల మైలురాయిని దాటింది.

స‌ల్మాన్‌ఖాన్‌, చిరంజీవి
స‌ల్మాన్‌ఖాన్‌, చిరంజీవి (Twitter)

స‌ల్మాన్‌ఖాన్‌, చిరంజీవి

Godfather 2 Days Collections: చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రెండో రోజు జోరును కొన‌సాగించింది. ఈ సినిమాతో మ‌రో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గాను మెగాస్టార్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. రెండు రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల మార్కును దాటింది. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 38 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. 31 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్‌ సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 6th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ కాదని తేల్చేసిన కావ్య- సీసీ కెమెరాతో బయటపడిన నిజం- కోటితో స్వప్న కారు

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్ ..శోభ తప్పు లేదు నువ్వే దరిద్రమన్న అనసూయ.. గుండెలు పగిలేలా ఏడ్చిన దీప

Getup Srinu: ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెట్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

రెండు రోజుల్లో ఈ సినిమా 69కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. గురువారం రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియాలో రెండున్న‌ర కోట్ల‌, సీడెడ్‌లో 2 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను ఈ సినిమా ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. గురువారం రోజు ఏపీ, తెలంగాణ‌లో క‌లిసి ఇర‌వై కోట్ల గ్రాస్‌, ప‌ది కోట్ల‌కుపైగా షేర్‌ను ఈ సినిమా ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా కు 35 కోట్ల గ్రాస్‌, 21 కోట్ల షేర్‌ను వ‌చ్చిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ (Salman khan) గాడ్‌ఫాద‌ర్ లో కీల‌క పాత్ర పోషించ‌డంతో హిందీలో ఓపెనింగ్స్ బాగున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

హిందీ వెర్ష‌న్‌కు తొలిరోజు 2. 05 కోట్ల క‌లెక్ష‌న్స్ రాగా రెండో రోజు 1.80 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఓవ‌ర్‌సీస్‌లో మూడు కోట్లు, క‌ర్ణాట‌క‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌లిపి మ‌రో మూడు కోట్ల క‌లెక్ష‌న్స్‌ను గాడ్‌ఫాద‌ర్ రాబ‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా గాడ్‌ఫాద‌ర్ సినిమాను తెర‌కెక్కింది. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో న‌య‌న‌తార‌ (Nayanthara), స‌త్య‌దేవ్ (Satyadev) కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గెస్ట్ రోల్‌లో స‌ల్మాన్ ఖాన్ న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.