తెలుగు న్యూస్  /  Entertainment  /  Gautham Karthik Manjima Mohan Tie The Knot In Chennai Wedding Photos Viral

Gautham Karthik Manjima Mohan Marriage: పెళ్లిపీట‌లెక్కిన కోలీవుడ్ యువ‌ జంట - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

28 November 2022, 12:46 IST

  • Gautham Karthik Manjima Mohan Marriage: కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ పెళ్లి చేసుకున్నారు. సోమ‌వారం చెన్నైలో వీరి వివాహం జ‌రిగింది. గౌత‌మ్‌, మంజిమా పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్
గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్

గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్

Gautham Karthik Manjima Mohan Marriage: కోలీవుడ్ యువ జంట గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమ‌వారం చెన్నైలోని ఓ హోట‌ల్‌లో గౌత‌మ్‌, మంజిమా పెళ్లి జ‌రిగింది. వీరి పెళ్లికి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు ప‌లువురు కోలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు. గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి..

ట్రెండింగ్ వార్తలు

Shriya Reddy Web Series: త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై శ్రియారెడ్డి వెబ్‌సిరీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్ - రిలీజ్ ఎప్పుడంటే?

Sundar C: ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్

Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

పెళ్లిలో వైట్ ప‌ట్టు పంచె, ష‌ర్ట్‌లో గౌత‌మ్‌, వైట్ సారీలో మంజిమా మోహ‌న్ మెరిశారు.2019లో వీరిద్ద‌రు క‌లిసి దేవ‌ర‌ట్టం అనే సినిమా చేశారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో గౌత‌మ్‌, మంజిమా ప్రేమ‌లో ప‌డ్డారు. క‌మ‌ర్షియ‌ల్‌గా దేవ‌ర‌ట్టం ఫెయిల్యూర్‌గా నిలిచినా వీరిద్ద‌రికి వ్య‌క్తిగ‌తంగా మాత్రం మ‌ర‌చిపోలేని సినిమాగా నిలిచింది.

నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాలో మంజిమా మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఇదే తెలుగులో ఆమె న‌టించిన తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

ఆ త‌ర్వాత బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌డ‌ల్ సినిమాతో హీరో గౌత‌మ్ కార్తిక్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.