తెలుగు న్యూస్  /  Entertainment  /  Farzi Web Series Telugu Review Vijay Sethupathi Shahid Kapoor Starrer Crime Thriller Web Series Review

Farzi Web Series Review: ఫ‌ర్జీ వెబ్ సిరీస్ రివ్యూ - విజ‌య్ సేతుప‌తి షాహిద్ క‌పూర్ సిరీస్ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

10 February 2023, 14:10 IST

  • Farzi Web Series Review: విజ‌య్ సేతుప‌తి, షాహిద్‌క‌పూర్‌, రాశీఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫ‌ర్జీ వెబ్‌సిరీస్ శుక్ర‌వారం (నేడు) అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైంది. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్‌డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే...

 ఫ‌ర్జీ వెబ్‌సిరీస్
ఫ‌ర్జీ వెబ్‌సిరీస్

ఫ‌ర్జీ వెబ్‌సిరీస్

Farzi Web Series Review: విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi), షాహిద్ క‌పూర్ (Shahid Kapoor), రాశీఖ‌న్నా(Rashi Khanna) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హిందీ వెబ్‌సిరీస్ ఫ‌ర్జీ. ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజ్ స‌క్సెస్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్‌డీకే (Rajdk) తెర‌కెక్కించిన సిరీస్ ఇది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ద్వారా ఈ శుక్ర‌వారం (నేడు) ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది? రాజ్ డీకే తెర‌కెక్కించిన ఈ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేసిందా? లేదా? అన్న‌ది చూద్ధాం...

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

Bollywood Khans movie: మేం ముగ్గురం కలిసి సినిమా చేయబోతున్నాం: ఖాన్ త్రయం మూవీపై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Most Watched Telugu Web Series: జీ5 ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఇవే

Farzi Web Series Story - ఆర్టిస్ట్ స‌న్నీ క‌థ‌

స‌న్నీ (షాహిద్ క‌పూర్‌) ఓ ఆర్టిస్ట్ . అత‌డి చిన్న‌త‌నంలోనే త‌ల్లి చ‌నిపోతుంది. తండ్రి వ‌దిలేసివెళ్లిపోతాడు. స‌న్నీ పెయింటింగ్ ప్ర‌తిభ‌ను గుర్తించిన క్రాంతి ప‌త్రిక అధిప‌తి మాధవ్ స‌న్నీని పెంచి పెద్ద‌చేస్తాడు. క్రాంతి ప‌త్రిక అప్పుల్లో కూరుకుపోతుంది. మాధ‌వ్ క‌ష్టాల‌ను చూసి స‌న్నీ చ‌లించిపోతాడు. నిజాయితీగా క‌ష్ట‌ప‌డితే ఆ అప్పుల‌ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం అసాధ్య‌మ‌ని భావించిన స‌న్నీ త‌న స్నేహితుడు ఫిరోజ్‌తో (భువ‌న్ అరోరా) క‌లిసి దొంగ‌నోట్ల‌ను ముద్రించ‌డం మొద‌లుపెడ‌తాడు. అచ్చు ఒరిజిన‌ల్‌ నోట్‌ను పోలి అత‌డు ముద్రించిన నోట్‌ను దొంగ‌నోట్ల మిష‌న్ కూడా క‌నిపెట్ట‌దు.

మ‌రోవైపు దొంగ నోట్ల వ్యాపారాన్ని చేస్తోన్న బ‌డా క్రిమిన‌ల్ మ‌న్సూర్‌ను (కేకే మీన‌న్‌) టార్గెట్ చేస్తాడు టాస్క్‌ఫోర్స్ ఆఫీస‌ర్ మైఖేల్ (విజ‌య్ సేతుప‌తి). అత‌డిని ఎలాగైనా చ‌ట్ట‌ప్ర‌కారం ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. స‌న్నీ ప్ర‌తిభ‌ను గురించి తెలుసుకున్న మ‌న్సూర్ త‌న టీమ్‌లో చేర్చుకుంటాడు. ఇద్ద‌రు క‌లిసి ప‌న్నెండు వేల కోట్ల రూపాయ‌ల దొంగ నోట్ల‌ను ఇండియాకు తీసుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతారు.

ఆ నోట్ల‌ను ఇండియాకు త‌ర‌లించే క్ర‌మంలో స‌న్నీ పోలీసుల నుంచి త‌ప్పించుకోలిగాడా? మ‌న్సూర్‌ను ప‌ట్టుకోవాల‌నే మైఖేల్ ప్ర‌య‌త్నం నెర‌వేరిందా? త‌న టాలెంట్‌ను నిరూపించుకోవ‌డానికి మైఖేల్ టీమ్‌లో చేరిన మేఘ (రాశీఖ‌న్నా) ఎవ‌రు? త‌న అవ‌స‌రం కోసం మేఘ‌ను ప్రేమించిన‌ట్లుగా స‌న్నీ ఎందుకు నాట‌కం ఆడాడు? తాత‌య్య కోస‌మే అడ్డ‌దారుల్లో ప్ర‌యాణించిన స‌న్నీ రియ‌లైజ్ అయ్యాడా? లేదా? అన్న‌దే (Farzi Web Series Review) ఈ సిరీస్ క‌థ‌.

క్రైమ్ థ్రిల్ల‌ర్‌...

ఫేక్ క‌రెన్సీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఫ‌ర్జీ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. తమ‌ అవ‌స‌రాలు తీరే దారి క‌నిపించ‌క ఫేక్ క‌రెన్సీ దందాలోకి అడుగుపెట్టిన‌ ఇద్ద‌రు సాధార‌ణ యువ‌కులు ఆ ఊబిలోనే ఎలా కూరుకుపోయార‌నే పాయింట్‌ను ఎనిమిది ఎపిసోడ్స్‌లో చూపించారు.షాహిద్‌క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తితో పాటు సిరీస్‌లో క‌నిపించే ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఓ ల‌క్ష్యాన్ని ఫిక్స్ చేస్తూ అన్నింటిని క‌లుపుతూ క‌థ‌ను(Farzi Web Series Review) అల్లుకున్నారు.

ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో...

స‌న్నీ ఫిరోజ్ పాత్ర‌ల ప‌రిచ‌యంతోనే ఈ సిరీస్ మొద‌ల‌వుతుంది. జీవితంలో నిల‌దొక్కుకోవ‌డానికి వారు ప‌డే క‌ష్టాలు, త‌మ‌ను పెంచి పెద్ద‌చేసిన‌ తాత‌య్య ప్రెస్‌ను కాపాడుకోవ‌డానికి ప‌డే త‌ప‌న చుట్టూ ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను న‌డిపించారు. ఈ ఎపిసోడ్‌లోనే విజ‌య్ సేతుప‌తితో పాటు మ‌న్సూర్ క్యారెక్ట‌ర్‌ల‌ను ప‌రిచ‌యం చేశారు.

మైఖేల్ అన్వేష‌ణ‌...

దొంగ నోట్ల‌ను ముద్రించాల‌ని స‌న్నీ ఫిరోజ్ అనుకున్న త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. త‌మ టాలెంట్‌తో చిన్న‌గా మొద‌లుపెట్టిన వారి దొంగ వ్యాపారం కోట్లకు ఎలా ఎదిగిందో ఎంగేజింగ్‌గా చూపించారు.

ఆ త‌ర్వాత మ‌న్సూర్‌తో స‌న్నీ చేతులు క‌ల‌ప‌డం, వారిని ప‌ట్టుకోవ‌డానికి మైఖేల్ టీమ్ వేసే ఎత్తుల‌తో చివ‌రి ఎపిసోడ్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ డీకే. మ‌రోవైపు నిజాయితీ కార‌ణంగా మైఖేల్ భార్య‌పిల్ల‌ల‌కు ఎలా దూర‌మ‌య్యాడు? త‌న అవ‌స‌రాల కోసం మేఘ‌తో స‌న్నీ ప్రేమించిన‌ట్లు ఆడిన నాట‌కం నుంచి ప్రేమ‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ రాబ‌ట్టుకోవాల‌ని అనుకున్నారు.

పాయింట్ బాగుంది కానీ...

దొంగ నోట్ల నేప‌థ్యం అనే పాయింట్ కొత్త‌దే కానీ ఆ అంశాన్ని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో రాజ్‌డీకే పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. సిరీస్ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ బోర్ కొట్టిస్తుంది. క‌థ ఎంత‌కు ముందుకు క‌ద‌ల‌దు. స‌న్నీ, ఫిరోజ్ అడ్డ‌దారుల్లోకి అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, వారికి ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల నుంచి స‌రైన ఎమోష‌న్ పండ‌లేదు.

తాత మాధ‌వ్‌తో స‌న్నీ బాండింగ్ సీన్స్‌లో నాచురాలిటీ మిస్ అయ్యింది. విజ‌య్ సేతుప‌తి అండ్ గ్యాంగ్ ఇన్వేస్టిగేష‌న్ సిల్లీగా ఉంది. విజ‌య్ సేతుప‌తి క్యారెక్ట‌ర్ నుంచి హీరోయిజం, సింప‌థీ రెండు వ‌ర్క‌వుట్ కాలేదు. అ. రాశీఖ‌న్నా క్యారెక్ట‌ర్ మొత్తం క‌న్ఫ్యూజింగ్‌గా ఉంది. ఆమె ల‌క్ష్యం ఏమిటో, టాస్క్ ఫోర్స్ టీమ్‌తో అంతుప‌ట్ట‌దు.

నెగెటివ్ షేడ్స్‌లో...

స‌న్నీ అనే ఆర్టిస్ట్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ యాక్టింగ్ రియ‌లిస్టిక్‌గా ఉంది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా న‌టించాడు. విజ‌య్ సేతుప‌తి కామెడీ టైమింగ్ ఈ సిరీస్‌కు పెద్ద రిలీఫ్‌గా నిలిచింది. సీరియ‌స్‌గా అత‌డు వేసే పంచులు కొన్ని చోట్ల న‌వ్వించాయి. కానీ అత‌డి క్యారెక్ట‌ర్ డిజైనింగ్‌, ఎండింగ్ అసంపూర్తిగా ఉంది. విజ‌య్ సేతుప‌తి, రెజీనా సీన్స్ ఫ్యామిలీ మ్యాన్ కొన‌సాగింపుగా అనిపిస్తాయి . రాశీఖ‌న్నా క్యారెక్ట‌ర్‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. కేకే మీన‌న్ విల‌నిజం యావ‌రేజ్‌గా ఉంది. షాహిద్ స్నేహితుడిగా భువ‌న్ అరోరా న‌ట‌న బాగుంది.

Farzi Web Series Review -మ్యాజిక్ వ‌ర్క‌వుట్ కాలేదు...

ఫ‌ర్జీ రొటీన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లోని మ్యాజిక్ ఇందులో క‌నిపించ‌లేదు. విజ‌య్ సేతుప‌తి, షాహిద్ క‌పూర్ లాంటి టాలెంటెడ్ యాక్ట‌ర్స్ ఉన్నా క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో సిరీస్ మొత్తం బోర్ కొట్టిస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.