Abhishek Bachchan : మీ భార్యను సినిమాలు చేయనివ్వండి.. బిడ్డను మీరు చూసుకోండి
30 April 2023, 8:31 IST
- Ponniyin Selvan 2 : అభిషేక్ బచ్చన్ తన అభిమానులకు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇస్తాడు. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చాడు అభిషేక్.
ఫ్యామిలీతో అభిషేక్ బచ్చన్
అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) బాలీవుడ్‌లో బిజీ నడుటు. అతడి భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్(aishwarya Rai Bachchan) కూడా ప్రముఖ నటి. తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు ఐశ్వర్య సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొన్ని పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలను అంగీకరిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన 'పొన్నియిన్ సెల్వన్ 2'(Ponniyin Selvan 2) చిత్రం విడుదలై భారీగా వసూళ్లు రాబడుతోంది.
ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమె మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్‌కు ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. దానికి అభిషేక్ బచ్చన్ సూటిగా సమాధానం ఇచ్చాడు .
సెలబ్రిటీలు తమ అభిమానులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియా(Social Media)ను ఉపయోగిస్తారు. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. కొన్నిసార్లు అభిమానులు సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నలు అడుగుతారు. 'ఐశ్వర్యరాయ్ మరిన్ని సినిమాలను అంగీకరించనివ్వండి. మీ కూతురు ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకోండి.' అని ఓ అభిమాని సూచించాడు.
అభిమానుల సలహాలను అభిషేక్ సానుకూలంగా తీసుకుంటాడు. ఐశ్వర్య మరిన్ని సినిమాలు అంగీకరించే అవకాశం ఉందా? అని నెటిజన్లు అడుగుతున్నారు. దేనికీ నా అనుమతి అవసరం లేదని అభిషేక్ చెబుతున్నాడు. 'వాళ్లకు నచ్చే విషయంలో నా అనుమతి అవసరం లేదు.' అని తెలిపాడు.
'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలో ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) నటన అందరి ప్రశంసలు అందుకుంది. అభిషేక్ బచ్చన్ కూడా ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలియజేశారు. ఆయన ట్వీట్‌పై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. 'గురు', 'ధూమ్ 2', 'రావణ్', 'కుచ్ నా కహో' వంటి సినిమాల్లో అభిషేక్, ఐశ్వర్య జంటగా నటించారు. వీరిద్దరూ కలిసి మరిన్ని సినిమాల్లో కనిపించాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.
టాపిక్