Ponniyin Selvan 2 Day 1 Collections: పొన్నియిన్ సెల్వన్ 2కు భారీ ఓపెనింగ్స్.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం-ponniyin selvan 2 massive openings with 38 crore in box office collection day 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ponniyin Selvan 2 Day 1 Collections: పొన్నియిన్ సెల్వన్ 2కు భారీ ఓపెనింగ్స్.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం

Ponniyin Selvan 2 Day 1 Collections: పొన్నియిన్ సెల్వన్ 2కు భారీ ఓపెనింగ్స్.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం

Maragani Govardhan HT Telugu
Apr 29, 2023 11:43 AM IST

Ponniyin Selvan 2 Day 1 Collections: పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రానికి తొలి రోజే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలైన తొలి రోజే ఈ సినిమా రూ.38 కోట్ల మేర కలక్షన్లు రాబట్టింది. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.

పొన్నియిన్ సెల్వన్-2 కలెక్షన్లు
పొన్నియిన్ సెల్వన్-2 కలెక్షన్లు

Ponniyin Selvan 2 Day 1 Collections: మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్-2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి తొలి రోజే భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. పీఎస్-1 మొదటి భాగం కంటే కూడా రెండో భాగానికి టాక్ బాగుండటంతో బాక్సాఫీస్ వసూళ్లపై సానుకూల ప్రభావం నెలకొంది. తొలి రోజు పొన్నియిన్ సెల్వన్-2 ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు వసూలు చేసింది.

హోమ్ స్టేట్ అయిన తమిళనాడులో పీఎస్-2 చిత్రానికి 25 కోట్లు రాగా.. మొదటి భాగంతో పోలిస్తే అక్కడ వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. పీఎస్-1కు తొలి రోజు 40 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. పీఎస్-2కు కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండో బాగానికి 3 నుంచి 4 కోట్ల వరకు కలెక్షన్లు రాగా. కర్ణాటకలో 4 నుంచి 5 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే పొన్నియిన్ సెల్వన్-2 ఒకమిలియన్ మార్కుకు చేరువలో ఉంది. తొలి రోజు ఓవర్సీస్‌లో 848,000 డాలర్లు వచ్చినట్లు అంచనా.

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం ఇందులో నటించింది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మాతృక తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది.

పొన్నియిన్ సెల్వన్ సినిమా మణిరత్నం కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన కలల ప్రాజెక్టు. ప్రముఖ తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 1980వ దశకం నుంచి ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనకున్న ఆయన.. ఆ కలను దాదాపు 40 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు. ఈ సమయంలో సినిమాను పట్టాలెక్కించడానికి ప్రయత్నించనప్పటికీ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీలో లోపాల కారణంగా ఆయన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు.

Whats_app_banner