Aishwarya Rai on Salman: బాలీవుడ్‌లో సెక్సీయెస్ట్ మ్యాన్ సల్మాన్ ఖాన్ అంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు.. వీడియో వైరల్-aishwarya rai calling salman khan the sexiest and most gorgeous man in bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aishwarya Rai Calling Salman Khan The Sexiest And Most Gorgeous Man In Bollywood

Aishwarya Rai on Salman: బాలీవుడ్‌లో సెక్సీయెస్ట్ మ్యాన్ సల్మాన్ ఖాన్ అంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Maragani Govardhan HT Telugu
Apr 12, 2023 12:16 PM IST

Aishwarya Rai on Salman: బాలీవుడ్ సెక్సీయెస్ట్ మ్యాన్ ఎవరంటే సల్మాన్ ఖాన్ అంటూ ఐశ్వర్య రాయ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చాలా పాతది. ఒకప్పుడు ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్
ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్

Aishwarya Rai on Salman: ఐశ్వర్య రాయ్ బచ్చన్-సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో వీరిది ఒకప్పుడు పాపులర్ పెయిర్. ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలారు. సల్మాన్.. ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇద్దరూ విడిపోయారు. ఐశ్వర్య.. అభిషేక్‌ను వివాహం చేసుకుని తన జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఎప్పుడైనా ఏదైనా పార్టీలో సల్మాన్, ఐశ్వర్య కనిపించినా చూసి చూడనట్లుగా వ్యవహరించేవాళ్లు. ఇటీవల ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నిర్వహించిన కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్‌లోనూ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‍‌లో కనిపించారు. అయినా మాట్లాడుకున్నది లేదు.

ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ పాత ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సల్మాన్.. బాలీవుడ్‌లోనే సెక్సియెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ మ్యాన్‌గా అభివర్ణించింది. బాలీవుడ్‌లో సెక్సీగా, అందంగా ఉండే వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించగా.. ఐశ్వర్య చాలా సేపు ఆలోచించి.. సిగ్గుపడుతూ సరే అంతర్జాతీయంగా భారతీయ పురుషుల జాబితాలో స్పష్టంగా ఎంపికైన సల్మాన్‌ను తీసుకుందాం అంటూ బదులిచ్చింది. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తొలిసారిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హమ్ దిల్ దే చుకే సనమ్ అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో ప్రధాన పాత్రలో అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమాతో పరిచయం సల్మాన్, ఐశ్వర్య మధ్య స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అది సాధ్యం కాలేదు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసి కా జాన్ అనే ప్రాజెక్టులో నటించాడు. ఇది రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. దీని తర్వాత టైగర్ 3, టైగర్ vs పఠాన్ లాంటి పలు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. మరోపక్క ఐశ్వర్య రాయ్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ 2లో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది.

IPL_Entry_Point