తెలుగు న్యూస్  /  Entertainment  /  Duniya Vijay Telugu Movie Nbk 107 Look Released

NBK 107 | బాలయ్యతో పోరాడాలంటే ఆ మాత్రం ఉండాలి.. దునియా విజయ్ లుక్ అదుర్స్

HT Telugu Desk HT Telugu

16 March 2022, 14:48 IST

    • బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో కన్నడ హీరో దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
బాలయ్య సినిమాలో దునియా విజయ్
బాలయ్య సినిమాలో దునియా విజయ్ (twitter)

బాలయ్య సినిమాలో దునియా విజయ్

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే అఖండ లాంటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని మంచి జోరు మీదున్నారు. అంతేకాకుండా అన్‌స్టాపబుల్‌ షోతో వ్యాఖ్యతగానూ సక్సెస్ అయ్యారు. మరోపక్క రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో బాలయ్య లుక్‌ను విడుదల చేసింద చిత్రబృందం. ఇందులో కన్నడ సెన్నేషన్ హీరో దునియా విజయ్ విలన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఆయన లుక్‌ విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

లైట్ గ్రే, బ్లాక్ గడ్డంతో నోట్లో సిగరెట్ పెట్టుకుని తీక్షణంగా చూస్తున్న దునియా విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. నుదుటన బొట్టుతో రా లుక్‌లో అదరగొడుతున్నారు. దునియా విజయ్‌ ఈ సినిమాలో 'ముసలి మడుగు ప్రతాప రెడ్డి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ శాండల్‌వుడ్ హీరోకు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

క్రాక్ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా అఖండ లాంటి మాస్ విజయం తర్వాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. శృతిహాసన్ కథానాయికగా ఎంపికైంది.

మైత్రీ మూవి మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని. వై రవిశంకర్, మహోన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఈ ఏడాది చిత్రాన్నే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. NBK 107 అనే ప్రొడక్షన్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పేరును ఇంకా ప్రకటించలేదు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.