తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sita Ramam Teaser: యుద్ధం రాసిన ప్రేమ కథ.. జవాన్‌గా కనిపించిన దుల్కర్ సల్మాన్

Sita Ramam Teaser: యుద్ధం రాసిన ప్రేమ కథ.. జవాన్‌గా కనిపించిన దుల్కర్ సల్మాన్

25 June 2022, 17:15 IST

    • దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం సీతా రామం. మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సీతా రామం టీజర్
సీతా రామం టీజర్ (Twitter)

సీతా రామం టీజర్

మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అతడు నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. దీంతో తెలుగులోనూ అతడికి మార్కెట్ ఏర్పడింది. దీంతో డైరెక్టుగా తెలుగులోనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపాడు. అదే సీతా రామం. యుద్ధం రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

"ఆకాశవాణి, ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం.. లెఫ్టినెంట్ రామ్ నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఓ ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుుటంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది. అంటూ సీత సంభాషణలతో మొదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇట్లు నీ భార్య సీతా మహాలక్ష్మీ" అని ఉత్తరంలో రాయడంతో ముగుస్తుంది. ప్రేమ కథలను సరికొత్తగా ప్రెజెంట్ చేయగలిగే హను రాఘవపూడి మరోసారి తనదైన మార్కును ఈ సినిమాలో చూపించనున్నారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

టీజర్ ఆద్యంతం హృద్యంగా సాగింది. 1965 నాటి కాలంలో సాగే కథతో డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా 'సీతారామం'ను నిర్మిస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.