తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chup Ott Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ బాలీవుడ్ ఫిల్మ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది

Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ బాలీవుడ్ ఫిల్మ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది

19 November 2022, 15:12 IST

  • Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ సినిమా చుప్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

చుప్ మూవీ
చుప్ మూవీ

చుప్ మూవీ

Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ సినిమా చుప్ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను శ‌నివారం అనౌన్స్‌ చేశారు. విల‌క్ష‌ణ క‌థాంశాల‌తో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో హీరోగా చ‌క్క‌టి విజ‌యాల్ని అందుకుంటున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. అత‌డు హీరోగా న‌టించిన హిందీ సినిమా చుప్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సందీప్ కిషన్ సినిమా 'ప్రాజెక్ట్ జెడ్'

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌తో డైరెక్ట‌ర్ ఆర్ బాల్కి చుప్‌ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా రివ్యూవ‌ర్స్‌ను మాత్ర‌మే చంపే ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను అర‌వింద్ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడు. ఈ హ‌త్య‌ల‌తో డానీ, నీల‌మీన‌న్ అనే జంట‌తో ఉన్న సంబంధం ఏమిట‌నే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

జ‌ర్న‌లిస్ట్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. పోలీస్ ఆఫీస‌ర్‌గా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. సెప్టెంబ‌ర్ నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ నెల 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను దాదాపు ఇర‌వై కోట్ల‌కు జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. చుప్ సినిమాలో శ్రేయ‌స్ ధ‌న్వంత‌రి హీరోయిన్‌గా న‌టించింది. క‌ర్వాన్‌, జోయా ఫాక్ట‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన బాలీవుడ్ సినిమా ఇది. ఇటీవ‌లే సీతారామం సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.