తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: రాజమౌళితో సినిమా అంటే ఒకేసారి 25 మూవీస్‌ చేసినట్లే: మహేష్‌ బాబు

Mahesh Babu: రాజమౌళితో సినిమా అంటే ఒకేసారి 25 మూవీస్‌ చేసినట్లే: మహేష్‌ బాబు

HT Telugu Desk HT Telugu

08 August 2022, 19:18 IST

    • Mahesh Babu: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు మంగళవారం (ఆగస్ట్‌ 9) తన 47వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా అతని సూపర్‌హిట్‌ మూవీ పోకిరి స్పెషల్‌ షోలకు కూడా ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజమౌళి, మహేష్ బాబు
రాజమౌళి, మహేష్ బాబు (Twitter)

రాజమౌళి, మహేష్ బాబు

టాలీవుడ్‌లో క్రేజీయెస్ట్‌ కాంబినేషన్‌ రాబోతోంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్‌.. త్వరలోనే తన నెక్ట్స్‌ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 28లో త్రివిక్రమ్‌తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

దీని తర్వాతే రాజమౌళితో సినిమాను మొదలుపెట్టనున్నాడు. అటు జక్కన్న ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌లోనే బిజీగా ఉన్నాడు. అయితే మహేష్‌తో సినిమాపై ఇప్పటికే రాజమౌళి కొన్నిసార్లు స్పందించినా.. ఈ రాజకుమారుడు మాత్రమే ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. కానీ తాజాగా ఈ-టైమ్స్‌తో మాట్లాడుతూ.. రాజమౌళితో సినిమాపై మహేష్‌ స్పందించాడు.

"అతనితో కలిసి పని చేయడం అంటే నా కల నిజం కావడంలాంటిదే. రాజమౌళితో సినిమా చేయడం అంటే ఒకేసారి 25 మూవీస్‌ చేయడంలాంటిదే. అది శారీరకంగా కాస్త ఎక్కుడ డిమాండ్‌ చేసే మూవీయే. దీనిపై నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఇది పాన్‌ ఇండియా మూవీ. అన్ని అడ్డంకులను అధిగమించి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మా సినిమా అందిస్తాం" అని మహేష్‌ అన్నాడు.

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లోని ఈ మూవీ ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లలో జరిగే కథగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ మూవీలో ఉండబోతున్నట్లు సమాచారం. మహేష్‌తో తాను బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే కూడా గొప్ప సినిమా తీస్తానని ఇప్పటికే రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడేళ్లు పట్టనుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.