Naga Chaitanya: కండోమ్ కంపెనీపై కేసు వేస్తే.. నాగ చైతన్య చేయాల్సింది, కానీ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి కామెంట్స్
11 October 2024, 13:59 IST
Sandeep Reddy Bandla Naga Chaitanya Missed Movie: కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో తెరకెక్కించిన సినిమా జనక అయితే గనక. అయితే, ఈ సినిమాను సుహాస్‌కు నాగ చైతన్య చేయాల్సింది అని డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల చెప్పారు. దానికి గల కారణాలను వివరించారు.
కండోమ్ కంపెనీపై కేసు వేస్తే.. నాగ చైతన్య చేయాల్సింది, కానీ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి కామెంట్స్
Naga Chaitanya Missed Movie: సాధారణంగా స్టార్ హీరోలు కొన్ని సినిమాలను మిస్ అవుతుంటారని తెలిసిందే. వాటి ఫలితాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. ఇది పక్కన పెడితే హీరో నాగ చైతన్య కూడా మంచి రిలీజ్ కాకముందే మంచి పాజిటివ్ టాక్ వస్తున్న సినిమాను వదులుకున్నాడట. ఆ మూవీనే జనక అయితే గనక.
జనక అయితే గనక సినిమాలో హీరోగా సుహాస్ చేయగా.. హీరోయిన్‌గా సంగీర్తన నటించింది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన జనక అయితే గనక అక్టోబర్ 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
జనక అయితే గనక ఎలా స్టార్ట్ అయింది?
- జనక అయితే గనక టైటిల్ మీనింగే తండ్రి అయితే ఏంటి అనేదే!. ఇప్పటి జనరేషన్‌లో పెళ్లైన కొత్త జంట ఓ పాపనో, బాబునో కనటానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులేంటి? అనే విషయాన్ని మధ్య తరగతి నేపథ్యంలో తీసుకుని సినిమాగా చిత్రీకరించాం.
- రీసెంట్‌గా ప్రీమియర్ షోస్ వేసినప్పుడు ఇండస్ట్రీకి చెందినవారు, సామాన్య ప్రజలు అందరూ చూశారు. పాతికేళ్లలోపు వాళ్లు, మధ్య వయస్సున్నవాళ్లు, వయసు మళ్లిన వాళ్లు సినిమాను చూశారు. అందరి దగ్గరి నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఓ తొంబై ఏళ్ల ముసలావిడ అయితే సినిమా గురించి చాలా చక్కగా మాట్లాడారు.
ఈ కాన్సెప్ట్ ఆలోచన ఎలా వచ్చింది. ఎవరితో ముందుగా షేర్ చేసుకున్నారు?
- జనక అయితే గనక బేసిక్ ఐడియా ఎప్పటి నుంచో మనసులో ఉండింది. ఓ వ్యక్తి కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. కాకపోతే ఎలా డ్రైవ్ చేయాలనేది నాకు తెలియలేదు. మా ఫ్యామిలీలో నేనే చిన్నవాడిని. మా ఫ్యామిలీలో నాకే చివరిగా పెళ్లైంది. ఈ క్రమంలో మా అన్నయ్య, అక్కయ్య, ఫ్రెండ్స్ సహా అందరి ఫ్యామిలీలను గమనిస్తుండేవాడిని.
- అందరి ఇళ్లలో పెళ్లి డిస్కషన్, పిల్లల గురించిన డిస్కషన్ లేకుండా ఉండేది కాదు. ఇదొక యూనివర్సల్ ఎమోషన్. దీన్ని కథగా చెబితే బావుంటుందనిపించింది. నాకు వచ్చిన ఈ ఆలోచనని ముందుగా ప్రశాంత్ నీల్ గారికి చెప్పాను. అప్పటికి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను.
- తర్వాత దిల్ రాజు గారి సంస్థలో ఉండే నాని గారికి చెప్పాను. ఆయన వల్ల గుంటూరు డిస్ట్రిబ్యూటర్‌కి చెప్పాను. తర్వాత హర్షిత్ గారికి షేర్ చేశాను. ఆయనకు నచ్చడంతో రాజు గారికి ఐడియా చెప్పారు. రాజు గారికి నచ్చడంతో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
- నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే, ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా చేసిన విక్కీ డోనర్, బదాయి హో తరహా సినిమా. తెలుగులో ఇలాంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు రాలేదు. కోవిడ్ టైమ్‌లో మనకు జరిగిన మంచి ఏంట్రా అంటే.. ఓటీటీకి ఎక్కువ మంది ఆడియెన్స్ అట్రాక్ట్ అయ్యారు. దీని వల్ల డిఫరెంట్ సినిమాలను ఆడియెన్స్ చూడటం ప్రారంభించారు.
- సో మన కథను కూడా ఆడియెన్స్ ఆదరిస్తారనే ధైర్యంతోనే రాజు గారికి కథ చెప్పాను. నిజానికి రాజుగారు ఈ కథను ఓకే చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
సుహాస్ సినిమాలోని తన పాత్రకు న్యాయం చేశారా?
- నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా గొప్పగా న్యాయం చేశారు. సుహాస్ గారు మాట్లాడుతుంటే మనమే అక్కడ నిలబడి మాట్లాడుతున్నట్లు ఉంటుంది.
జనక అయితే గనక కథను ముందుగా నాగ చైతన్యకు చెప్పారా?
- చెప్పానండి.. కొన్నాళ్లపాటు ట్రావెల్ కూడా జరిగింది. అయితే అదే సమయంలో శేఖర్ కమ్ములగారి ప్రాజెక్ట్‌తో నాగ చైతన్య బిజీగా మారారు. తర్వాత ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ టైమ్‌లో మన కథలు కూడా పాతవి అయిపోతాయి కదా!. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో రాజు గారు సుహాస్‌ను సజెస్ట్ చేశారు. ఆయనకు నచ్చటంతో వెంటనే ఓకే చేశారు. వెంటనే సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.