Condom Mistakes: ఈ తప్పులు చేస్తే కండోమ్ వాడినా ఉపయోగం లేదు, అవేంటో తెల్సుకుని జాగ్రత్త పడండి-avoid these mistakes while using condoms know correct way to use condoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Condom Mistakes: ఈ తప్పులు చేస్తే కండోమ్ వాడినా ఉపయోగం లేదు, అవేంటో తెల్సుకుని జాగ్రత్త పడండి

Condom Mistakes: ఈ తప్పులు చేస్తే కండోమ్ వాడినా ఉపయోగం లేదు, అవేంటో తెల్సుకుని జాగ్రత్త పడండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 10, 2024 07:00 PM IST

Condom Mistakes: కండోమ్ వాడేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. ఈ తప్పులతో కండోమ్ వాడినా ఫలితం ఉండదు. గర్బధారణ రాకుండా, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి కండోమ్స్ వాడితే ఈ జాగ్రత్తలు తెల్సుకోండి.

కండోమ్ వాడకంలో చేయకూడని తప్పులు
కండోమ్ వాడకంలో చేయకూడని తప్పులు (freepik)

కండోమ్ వాడడానికి బోలెడు కారణాలుంటాయి. ప్రెగ్నెన్సీ రాకుండా వాడే గర్భనిరోధక పద్దతుల్లో కండోమ్ ఒక సులభమైన మార్గం. అలాగే కలయికలో పాల్గొన్నప్పుడు శృంగారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు (ఎస్‌టీ‌ఐ) రాకుండా ముందు జాగ్రత్తగా కండోమ్స్ వాడతారు. ఒక భద్రతతో కూడిని కలయికకు కండోమ్ హామీ ఇస్తుంది. అయితే దీని వాడకంలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. అవేంటో తెల్సుకోవాల్సిందే.

కండోమ్ వాడకంలో చేయకూడని తప్పులు:

1. రెండు కండోమ్స్ వాడటం:

ఇలా వాడటం తెలివైన ఆలోచన అనుకుంటారు చాలా మంది. ఎక్కువ భద్రత కోసం రెండు కండోమ్స్ ఒకదాని మీద ఒకటి వాడతారు. కానీ దీనివల్ల వాటి మధ్య రాపిడి ఎక్కువవుతుంది. దాంతో అవి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం మరింత పెరుగుతంది.

2. అంగస్తంభనకు ముందు:

అంగస్తంభన జరిగిన తర్వాతే కండోమ్ వాడాలి. అంతకన్నా ముందుగానే కండోమ్ వేసుకుంటే దాన్ని సరిగ్గా వేసుకోలేరు. అసలు వేసుకోవడమూ సాధ్యం కాదు. ఈ విషయంలో తొందరపాటు వల్ల పూర్తి నష్టమే.

3. ఖాళీ ఉండాలి:

కండోమ్ కొనను రిజర్వాయర్ టిప్ అంటారు. కండోమ్ వేసుకునేటప్పుడు కొన దగ్గర కనీసం అర ఇంచు గ్యాప్ ఉండాలి. దానికోసం కొనను రెండు చేతి వేళ్ల మధ్య పట్టుకుని కండోమ్ ధరించాలి. లేదంటే వీర్యం సేకరణకు స్థలం లేకపోవడం వల్ల కండోమ్ చిరిగిపోతుంది.

4. తప్పు లూబ్రికేషన్ వాడటం:

శృంగారం సమయంలో రాపిడి, నొప్పి తగ్గించడానికి కొంతమంది లూబ్రికెంట్లు వాడతారు. వీటివల్ల శృంగారంలో అసౌకర్యం తగ్గుతుంది. అయితే కండోమ్ వాడినప్పుడు ల్యూబ్రికెంట్ విషయంలో జాగ్రత్త అవసరం. ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్లు కండోమ్‌తో వాడకూడదు. ఎప్పుడూ వాటర్ బేస్డ్ లూబ్రికేషన్ వాడటం మాత్రమే ఉత్తమం. లేదంటే కండోమ్ చిరిగిపోయే ప్రమాదం ఉంది. 

5. ప్యాకేజ్ తెరవడం:

కండోమ్స్ సాధారణంగా ఫాయిల్ ప్యాకేజింగ్‌లో వస్తాయి. దాంతో ప్యాకెట్ తెరవడం సులభం అవుతుంది. కానీ దాన్ని తెరిచేటప్పుడు ఇష్టం వచ్చినట్లు చింపేస్తే మీకు కనపడని విధంగా కండోమ్ చినగొచ్చు. ఇలాంటిది వాడితే ఏ లాభం ఉండదు. ప్యాకేట్ మీద చూయించిన గీత దగ్గర జాగ్రత్తగా ఎలాంటి పదును వస్తువులు వాడకుండా తెరవండి.

6. వ్యాలెట్‌లో పెట్టకండి:

మీ ప్యాంట్ జేబులో పెట్టుకునే వ్యాలెట్‌లో కండోమ్ ప్యాకెట్ ఉంచకండి. దీనివల్ల వేడి, రాపిడి ఎక్కువై కండోమ్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. 

 

 

 

 

 

Whats_app_banner