శృంగార సమయంలో మంట తగ్గించే ల్యూబ్రికెంట్లు వాడుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు..-how to choose lubricants for smooth sex know these major side effects ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగార సమయంలో మంట తగ్గించే ల్యూబ్రికెంట్లు వాడుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు..

శృంగార సమయంలో మంట తగ్గించే ల్యూబ్రికెంట్లు వాడుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు..

Koutik Pranaya Sree HT Telugu
Oct 01, 2024 11:33 AM IST

శృంగార సమయంలో మంట, రాపిడి తగ్గించడానికి ల్యూబ్రికెంట్లు వాడతారు. ఎలాంటివి ఎంచుకోవాలో తెలియకపోతే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే ల్యూబ్రికెంట్ల గురించి వివరంగా తెల్సుకోండి.

ల్యూబ్రికెంట్లు
ల్యూబ్రికెంట్లు (freepik)

శృంగారం సమయంలో రాపిడి వల్ల వచ్చే మంట తగ్గించడానికి ల్యూబ్రికెంట్లు వాడతారు. వీటివల్ల సౌకర్యంగా అనిపిస్తుంది. యోని దగ్గర కావాల్సిన తేమని ఇవి ఇస్తాయి. అయితే సరైన ల్యూబ్రికెంట్ ఎంచుకోకపోతే తేమ అందించే సంగతి పక్కన పెడితే యోని మరింత పొడిబారడం, ఇన్ఫెక్షన్ రావడం, మరింత చికాకు మొదలవ్వచ్చు. వాటర్ బేస్డ్ లేదా ఆయిల్ బేస్డ్ ల్యూబ్రికెంట్స్ లో ఏది మంచిదో, ఎలాంటిది ఎంచుకోవాలో తెల్సుకోండి.

ల్యూబ్రికెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:

1. దురద, ర్యాషెస్:

లూబ్రికెంట్లలో కొన్ని రకాల ఫ్రాగ్రెన్సులు మంచి వాసన కోసం వాడతారు. వాటివల్ల దురద, ర్యాషెస్, మంట రావచ్చు. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రచురణ ప్రకారం ఫ్లేవర్లున్న లూబ్రికెంట్లు వాడటం వల్ల దురద మొదలవ్వొచ్చు. కాబట్టి ఎలాంటి ఫ్రాగ్రెన్సులు లేని వాటిని ఎంచుకోవడం మంచిది. 

2. యీస్ట్ ఇన్ఫెక్షన్లు:

వజైనా సమతుల్యతను కొన్ని రకాల ల్యూబ్రికెంట్లు ప్రభావితం చేస్తాయి. దీనివల్ల క్రమంగా యీస్ట్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. గ్లిజరిన్, పారాబెన్లున్న లూబ్రికెంట్లు వాడటం వల్ల వజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇవి లేని ల్యూబ్రికెంట్లు చూసి వాడాలి. ఇన్ఫెక్షన్ల బారిన సులభంగా పడేవారు వాటర్ బేస్డ్, లేదా సిలికాన్ బేస్డ్ లూబ్రికెంట్లు ఎంచుకోవాలి.

3. సంతానలేమి:

గ్లిజరిన్ ఉన్న ల్యూబ్రికెంట్లు వాడటం వల్ల, శుక్రకణాల కదలిక, పిండం ఎదుగుదల మీద ప్రభావం ఉండొచ్చని ఫర్టిలిటీ, స్టెరిలిటీ జర్నల్ ప్రచురణలో తెలిపారు. స్పర్మ్ కదలికలో ఇవి మార్పు తీసుకొస్తాయట. సంతానం కోసం ప్రయత్నిస్తున్నవాళ్లు ల్యూబ్రికెంట్లు సరిగ్గా ఎంచుకోవాలి. ఫర్టిలిటీ ఫ్రెండ్‌లీ ల్యూబ్రికెంట్లు లేదా సహజం ల్యూబ్రికెంట్లు ఎంచుకోవచ్చు. లేదంటే సంతానసాఫల్యత మీద ప్రభావం పడుతుంది.

4. పొడిబారడం:

శృంగార సమయంలో రాపిడి తగ్గించి, తేమ పెంచడానికి ల్యూబ్రికెంట్లు వాడతారు. కానీ తరచూ వాడటం లేదా సరైనవి ఎంచుకోకపోవడం వల్ల యోని దగ్గర మరింత పొడిబారుతుంది. కాబట్టి మీకు నప్పే ల్యూబ్రికెంట్ సరిగ్గా ఎంచుకోవడం తప్పనిసరి.

సరైన ల్యూబ్రికెంట్ ఎలా ఎంచుకోవాలి?

వాటర్ బేస్డ్ లేదా సిలికాన్ బేస్డ్ ల్యూబ్రికెంట్లను ఎంచుకోవాలి. గ్లిజరిన్, పారాబెన్లు, ఫ్రాగ్రెన్సులున్న వాటి జోలికి పోవద్దు. అలాగే ఈ ల్యూబ్రికెంట్లు లేటెక్స్, రబ్బర్, ప్లాస్టిక్‌ను ప్రభావితం చేయకూడదు. శృంగార సమయంలో వచ్చే మంటకు ల్యూబ్రికెంట్లు వాడటమే పరిష్కారం కాదని గుర్తుంచుకోండి. అలాగే కొందరు సహజనూనెల్ని ల్యూబ్రికెంట్లలాగా వాడతారు. వైద్య సలహా లేనిదే వాటి జోలికి పోకూడదు. అసలు సమస్య తగ్గకపోగా మరిన్ని కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ల్యూబ్రికెంట్ కొనేముందు పూర్తి వివరాలు తెల్సుకోవడం, వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. 

 

టాపిక్