Dil Raju: భయం, ఆత్రుత రెండూ ఉంటాయి.. బలగం లాగే చేశాం, పాస్ అయ్యాం.. కానీ.. దిల్ రాజు కామెంట్స్-dil raju comments on balagam in janaka aithe ganaka pre release event suhas sangeerthana producer dil raju speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju: భయం, ఆత్రుత రెండూ ఉంటాయి.. బలగం లాగే చేశాం, పాస్ అయ్యాం.. కానీ.. దిల్ రాజు కామెంట్స్

Dil Raju: భయం, ఆత్రుత రెండూ ఉంటాయి.. బలగం లాగే చేశాం, పాస్ అయ్యాం.. కానీ.. దిల్ రాజు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Oct 11, 2024 10:31 AM IST

Dil Raju In Janaka Aithe Ganaka Pre Release Event: నిర్మాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ తెలుగు సినిమా జనక అయితే గనక. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించిన జనక అయితే గనక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం (అక్టోబర్ 10) నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

భయం, ఆత్రుత రెండూ ఉంటాయి.. బలగం లాగే చేశాం, పాస్ అయ్యాం.. కానీ.. దిల్ రాజు కామెంట్స్
భయం, ఆత్రుత రెండూ ఉంటాయి.. బలగం లాగే చేశాం, పాస్ అయ్యాం.. కానీ.. దిల్ రాజు కామెంట్స్

Dill Raju Comments: యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా జనక అయితే గనక. ఇందులో హీరోయిన్‌గా సుహాస్‌కు జోడీగా సంగీర్త‌న యాక్ట్ చేసింది. ఈ సినిమాకు సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించగా.. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.

yearly horoscope entry point

పాజిటివ్ వైబ్

ద‌స‌రా సంద‌ర్భంగా జనక అయితే గనక సినిమా అక్టోబ‌ర్ 12న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌, ట్రైలర్ అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసుకున్నాయి. ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్లు వేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్ర యూనిట్ గురువారం (అక్టోబర్ 10) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

దిల్ రాజు కామెంట్స్

జనక అయితే గనక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"నా 21 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేశాను. దిల్ రాజు ప్రొడక్షన్స్ ద్వారా చిన్న చిత్రాలను, కొత్త టాలెంట్‌ను తీసుకు రావాలని అనుకున్నాం. అలా బలగం వచ్చింది. ఇప్పుడు సందీప్, ఆ తరువాత శశి వస్తున్నాడు. చిన్న చిత్రాన్ని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లడం చాలా కష్టం" అని నిర్మాత దిల్ రాజు అన్నారు.

అదే పెద్ద టాస్క్

"ఓ సినిమాను నమ్మి, బాగా వచ్చిందని అనుకున్నా.. ఆడియెన్స్ వరకు తీసుకెళ్లడం కష్టం. అందుకే బలగంలా రిలీజ్‌కు ముందే చాలా మందికి చూపించాం. ఈ క్రమంలోనే మీడియాకి కూడా చూపించాం. మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే పాస్ అయ్యాం. కానీ, ఆడియెన్స్‌ని థియేటర్లకు ఎలా రప్పించాలి అనేది పెద్ద టాస్క్" అని దిల్ రాజు తెలిపారు.

ఆ రెండూ ఉంటాయి

"అసలే దసరా సందర్భంగా చాలా చిత్రాలు వస్తున్నాయి. వస్తున్న ఆరేడు చిత్రాల్లో ఇలాంటి మంచి చిత్రం వచ్చినప్పుడు.. మీడియానే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి చిన్న చిత్రాలు తీయాలనే ఆత్రుత, భయం రెండూ ఉంటాయి. చిన్న చిత్రాలతోనే ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంది. మీడియానే జనాల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాలి" అని దిల్ రాజు కోరారు.

మంచి పేరు వస్తుంది

"ఈ చిత్రం బాగా ఆడితేనే టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు మంచి పేరు, ఆఫర్లు వస్తాయి. ఆద్యంతం నవ్వించేలా ఉందని అందరూ చెబుతున్నారు. ఇలాంటి మంచి సినిమాను మీడియానే ముందుకు తీసుకెళ్లాలి. అక్టోబర్ 12న మా చిత్రం రానుంది. అందరూ చూడండి" అని దిల్ రాజు తన స్పీచ్‌ను ముగించారు.

ముందుగానే చెప్పాను

డైరెక్టర్ వేణు మాట్లాడుతూ.. "సందీప్ గారికి, సుహాస్, హర్షిత్ గారికి థాంక్స్. ఆల్రెడీ ఈ మూవీని చూశాను. ప్రసాద్ ల్యాబ్‌లోనే వంద శాతం రెస్పాన్స్ వచ్చిందంటే.. థియేటర్‌లో రెట్టింపు రెస్పాన్స్ వస్తుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా నచ్చింది. అందుకు అందరికీ ముందుగానే కంగ్రాట్స్ చెప్పాను" అని అన్నారు.

నవ్వుతూ ఎంజాయ్ చేసేలా

"ఫ్యామిలీ అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేసేలా మంచి సందేశాత్మక చిత్రం కానుంది ఈ జనక అయితే గనక. దసరా సందర్భంగా అక్టోబర్ 12న ఈ చిత్రం వస్తోంది. అందరూ చూడండి" అని బలగం మూవీ డైరెక్టర్ వేణు కోరారు.

Whats_app_banner