Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా
Prasanna Vadanam Movie Twitter Review: డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా అనేది ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
Prasanna Vadanam Twitter Review Telugu: వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సుహాస్. ఫాస్ట్‌గా సినిమాలు తీయడమే కాకుండా డిఫరెంట్ కాన్సెప్టుతో విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సుహాస్ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ముఖాలు గుర్తు పట్టలేని ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో బాధపడే క్యారెక్టర్‌లో సుహాస్ నటించాడు. ఈ విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్‌కు అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే తెరకెక్కించారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా మే 3 అంటే ఇవాళ ప్రేక్షకుల ముందుకు ప్రసన్నవదనం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందు రోజు రాత్రి ఈ మూవీ ప్రీమియర్స్ వేశారు. ఈ ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్, ఆడియెన్స్ సినిమాకు ట్విటర్ వేదికగా రివ్యూస్ ఇస్తున్నారు. మరి ప్రసన్నవదనం ట్విటర్ రివ్యూలోకి వెళితే..
"సుహాస్ నుంచి మరొక క్లీన్ హిట్. మూవీ టీమ్‌కు అభినందనలు. టాలీవుడ్ నుంచి మొదటి సమ్మర్ హిట్ ఇదే. డైరెక్టర్ అర్జున్ దర్శకత్వం సింప్లీ సూపర్బ్‌గా ఉంది. రాశి సింగ్ పర్ఫామెన్స్ అయితే సినిమాకు మెయిన్ హైలెట్ కానుంది" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.
"అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ప్రసన్నవదనం ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్. అలాగే అర్జున్‌ది మాస్టర్ ఫుల్ డైరెక్షన్. మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చారు" అని ఓ యూజర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
"ఇప్పుడే ఫస్టాఫ్ కంప్లీట్ అయింది. ఊహించని ట్విస్టుతో ఇంటర్వెల్ బాగుంది. తన ఫర్మామెన్స్‌తో, ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సుహాస్ ఇరగదీశాడు. బీజీఎమ్ అయితే అదిరిపోయింది. సెకండాఫ్‌లో ఇంటెన్సివ్ సీన్స్ అయితే చాలా బాగా సెటప్ చేశారు" అని మరొకరు పాజిటివ్‌గా రాసుకొచ్చారు. "సుహాస్ అన్న నీ స్టోరీ సెలక్షన్‌కు హ్యాట్సాఫ్" అంటూ ప్రసన్న వదనం సినిమాకు 5కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఓ యూజర్.
"క్రేజీ ట్విస్టులతో ప్రసన్నవదనం సినిమా ఏమైనా ఉందా. సుహాస్ నీ యాక్టింగ్ గురించి చెప్పేందుకు నా దగ్గర వర్డ్స్ లేవు. రాశి సింగ్‌కు అమెజింగ్ రోల్ దక్కింది. తన పాత్రకు పాయల్ రాధాకృష్ణ న్యాయం చేసింది. డైరెక్టర్ అర్జున్‌కు బ్లాక్ బస్టర్ దక్కింది. కచ్చితంగా చూడాల్సిన సినిమా. నిర్మాత మణికంఠ గారికి అభినందనలు" అని యాంకర్ స్రవంతి చొక్కారపు ట్వీట్ చేసింది.
"సుహాస్ మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో మెప్పించాడు. డైరెక్టర్ అర్జున్ సరికొత్త కథ రాసుకున్నాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వర్కౌట్ అయింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ బాగున్నాయి. విజయ్ మ్యూజిక్ బాగుంది. టికెట్ కొన్న ప్రేక్షకులను నిరాశపరచదని నేను కచ్చితంగా చెప్పగలను" అని మరొకరు చెప్పారు.
ఇలా సుహాస్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సుహాస్‌కు హ్యాట్రిక్ మూవీ అని చెబుతున్నారు. ట్వీట్స్, యూట్యూబ్ రివ్యూలలో ప్రసన్నవదనం సినిమాకు మంచి హిట్ టాక్ వస్తోంది.
టాపిక్