తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju On Varisu Theatre Issues: అజిత్ కంటే విజ‌య్ పెద్ద స్టార్ - వైర‌ల్‌గా మారిన దిల్‌రాజు కామెంట్స్

Dil Raju On Varisu Theatre Issues: అజిత్ కంటే విజ‌య్ పెద్ద స్టార్ - వైర‌ల్‌గా మారిన దిల్‌రాజు కామెంట్స్

16 December 2022, 13:24 IST

  • Dil Raju On Varisu Theatre Issues: అజిత్ కంటే విజ‌య్ పెద్ద స్టార్ అంటూ నిర్మాత దిల్‌రాజు చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అజిత్ ఫ్యాన్స్ దిల్‌రాజును ట్రోల్ చేస్తున్నారు

దిల్‌రాజు
దిల్‌రాజు

దిల్‌రాజు

Dil Raju On Varisu Theatre Issues: విజ‌య్ హీరోగా న‌టించిన వారిసు(తెలుగులో వార‌సుడు) థియేట‌ర్ల వివాదం నిర్మాత దిల్‌రాజు వ‌దిలిపెట్టేలా లేదు. మొన్న‌టివ‌ర‌కు తెలుగులో థియేట‌ర్ల కోసం ఇబ్బందులు ప‌డిన ఆయ‌న తాజాగా త‌మిళంతో అదే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. త‌మిళ‌నాడులో సంక్రాంతికి విజ‌య్ వారిసుకు పోటీగా అజిత్‌ తునివు రిలీజ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Upcoming Telugu Movies: ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్.. ఇన్నాళ్ల కరువంతా తీరిపోయేలా..

Chiranjeevi Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.. వీడియో

Prabhas at Kannapa sets: కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. భారీ ప్రాజెక్టులో మరో స్టార్

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుద‌ల‌కానుండ‌టంతో కోలీవుడ్‌లో థియేట‌ర్స్ స‌మ‌స్య ఏర్ప‌డింది. మ‌రోవైపు తునివు సినిమాను త‌మిళ‌నాడు సీఏం త‌న‌యుడు, హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నారు. దాంతో వార‌సుడుకు త‌క్కువ‌గా థియేట‌ర్లు ల‌భించిన‌ట్లు తెలిసింది. థియేట‌ర్ల ఇష్యూపై ఇటీవ‌ల దిల్‌రాజు చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

త‌మిళ‌నాడులో అజిత్ కంటే విజ‌య్ బిగ్ స్టార్ అని దిల్‌రాజు పేర్కొన్నాడు. విజ‌య్ నెంబ‌ర్‌వ‌న్ అని తెలిపాడు. త‌మిళంలో మొత్తం 800 థియేట‌ర్లు ఉంటే అజిత్‌కు 400, విజ‌య్ సినిమాకు 400 ఇస్తామ‌ని త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్లు చెబుతున్నార‌ని దిల్‌రాజు అన్నాడు. ఉద‌య‌నిధి స్టాలిన్‌ను క‌లిసి విజ‌య్ సినిమాకు ఎక్కువ థియేట‌ర్లు ఇవ్వ‌మ‌ని రిక్వెస్ట్ చేయ‌బోతున్న‌ట్లు దిల్‌రాజు పేర్కొన్నాడు. దిల్‌రాజు చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

అజిత్ ఫ్యాన్స్ దిల్‌రాజును ట్రోల్ చేస్తున్నారు. అత‌డిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వారిసు సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీకాంత్‌, ప్ర‌కాష్‌రాజ్‌, ప్ర‌భు, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.