తెలుగు న్యూస్  /  Entertainment  /  Dasara To Ravanasura List Of Movies And Web Series Released On Ott This Week

OTT Releases This Week: ఓటీటీలో స్టార్స్ సంద‌డి - ఈ వీకెండ్‌కు రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే

28 April 2023, 10:58 IST

  • OTT Releases This Week: థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ప‌లు సూప‌ర్ హిట్ మూవీస్ ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే...

సిటాడెల్ వెబ్ సిరీస్
సిటాడెల్ వెబ్ సిరీస్

సిటాడెల్ వెబ్ సిరీస్

OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)

ర‌వితేజ రావ‌ణాసుర

ర‌వితేజ హీరోగా న‌టించిన రావ‌ణాసుర మూవీ శుక్ర‌వారం (ఏప్రిల్ 28)న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. రివేంజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది.

సిటాడెల్ (Citadel)

ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌కు డేవిడ్ వెల్ క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సిరీస్‌లో రిచ‌ర్డ్ మ్యాడెన్ కీల‌క పాత్ర‌ను పోషించారు.

శింబు పాతుథ‌లా (త‌మిళ్ మూవీ)

గురుదేవ్ హోయ్‌సాలా (క‌న్న‌డ మూవీ)

జీ5 ఓటీటీ (Zee5 )

వ్య‌వ‌స్థ వెబ్ సిరీస్‌

కార్తిక్‌ర‌త్నం, కామ్నా జెఠ్మ‌లానీ, హెబ్బా ప‌టేల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్ సిరీస్ వ్య‌వ‌స్థ జీ5 ఓటీటీలో రిలీజైంది. కోర్డ్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌కు ఆనంద్ రంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సిరీస్ తోనే హెబ్బా ప‌టేల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌గా కామ్నా జెఠ్మ‌లానీ చాలా రోజుల త‌ర్వాత టాలీవుడ్‌లోకి పున‌రాగ‌మ‌నం చేసింది.

యూ ట‌ర్న్ (హిందీ మూవీ)

పాక‌లుమ్ ప‌థిర‌వుమ్ (మ‌ల‌యాళం మూవీ)

డిస్నీ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)

సేవ్ ది టైగ‌ర్స్ తెలుగు వెబ్ సిరీస్‌

ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, చైత‌న్య కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సేవ్ ది టైగ‌ర్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు తేజ కాకుమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ్ షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

వేద్ (మ‌రాఠీ మూవీ)

నెట్‌ఫ్లిక్స్

ద‌స‌రా (Dasara)

నాని హీరోగా న‌టించిన ద‌స‌రా మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెర‌కెక్కించారు. మార్చి 30న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ద‌స‌రా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

బిఫోర్ లైఫ్ ఆఫ్ట‌ర్ డెత్‌

ఆకా (ఫ్రెంచ్ మూవీ)

స్వీత్ టూత్‌

ది మ్యాచ్ మేక‌ర్‌

ది న‌ర్స్ (వెబ్ సిరీస్‌)

వేవ్ మేక‌ర్స్‌

ఆహా ఓటీటీ

జ‌ల్లి క‌ట్టు తెలుగు వెబ్ సిరీస్‌

సోని లివ్

తురాముఖం మ‌ల‌యాళం మూవీ

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.