తెలుగు న్యూస్  /  Entertainment  /  Dasara Movie Ott Release Date When And Where To Watch Nani Movie

Dasara OTT Release: దసరా మూవీ ఓటీటీ వేదిక ఫిక్స్.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?

30 March 2023, 10:47 IST

  • Dasara OTT Release: నాని నటించిన దసరా మూవీ ఓటీటీ వేదికగా ఫిక్స్ అయింది. ప్రముఖ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. మే మధ్య నుంచి ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది.

నాని దసరా
నాని దసరా (Instagram)

నాని దసరా

Dasara OTT Release: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం.. శ్రీ రామ నవమి సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఫుల్ లెంగ్త్ రోల్‌లో నాని యాక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా దసరా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం, స్ట్రీమింగ్ రిలీజ్ డేట్‌కు సంబందించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

Thandel OTT Rights: నాగ చైతన్య తండేల్ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి.. చైతూ కెరీర్లోనే అత్యధికం

Bigg Boss Priyanka: హైదరాబాద్‌లో భూమి కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. వీడియో అసలు విషయం చెప్పిన వంటలక్క

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నాని నటించిన దసరా మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందట. ఇందుకోసం సదరు ఓటీటీ సంస్థ చిత్రబృందంతో భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకుందట. అనధికారిక సమాచారం ప్రకారం దాదాపు రూ.22 కోట్లకు దసరా మూవీ స్ట్రీమింగ్ కానుందట.

దసరా చిత్రం ఓటీటీలో థియేటర్లలో రిలీజైన 6 నుంచి 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం దసరా చిత్రం మే మధ్యలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రబృందం విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా విడుదలైంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.