Dasara Twitter Review: దసరా మూవీ ఎలా ఉంది.. నాని అదరగొట్టాడా?-here the nani dasara movie twitter review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Here The Nani Dasara Movie Twitter Review

Dasara Twitter Review: దసరా మూవీ ఎలా ఉంది.. నాని అదరగొట్టాడా?

Maragani Govardhan HT Telugu
Mar 30, 2023 06:52 AM IST

Dasara Twitter Review: నాని నటించిన దసరా మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బుధవారం రాత్రి యూఎస్‌లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ సినిమా ఎలా ఉందో చూసిన వాళ్లు ట్విటర్ వేదికగా అభిప్రాయాలను పంచుకున్నారు.

దసరాలో నాని
దసరాలో నాని

Dasara Twitter Review: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా శ్రీ రామ నవమి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్‌తో నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రంపై అంచనాలను భారీగా నెలకొన్నాయి. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతకంటే ముందు బుధవారం రాత్రే యూఎస్‌లో ప్రీమియర్ షోలో ప్రదర్శించారు. చూసిన వాళ్లు తమ స్పందనను ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు.

దసరా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులను వీర్లపల్లి విలేజ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల. అక్కడి ప్రజల కల్చర్, అలవాట్లు, ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపాడు. విజువల్స్ గ్రాండ్‌గా కనిపిస్తాయి. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రా అండ్ రగ్గ్‌డ్‌గా తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రధానంగా ధరణి, వెన్నెల, సూరి చుట్టూ తిరుగుతుంటుందట. స్నేహం, ప్రేమ, రాజకీయాలు చుట్టూ సాగుతుందట.

సినిమా ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుందట. కాస్త నిదానంగా సాగినప్పటికీ కొన్ని మంచి సీక్వెన్సులు ఉన్నాయని ఓ ట్విటర్ యూజర్ తెలిపారు. అలాగే నాని అద్భుతమైన యాక్షన్‌తో అదరగొట్టాడట. వీర్లప్లల్లి నేటివిటినీ అద్భుతంగా స్క్రీన్‌పై ప్రెజంట్ చేశాడట దర్శకుడు. ఇంటర్వెల్‌లో మంచి ట్విస్టు ఉంటుందట. ఇది సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుందని అంటున్నారు.

సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా దేని గురించి తీశారో మొదటి 15 నిమిషాల్లోని తెలిసిపోతుందట. మధ్యలో కాస్త సన్నివేశాలు నిదానంగా సాగుతాయట. కొన్నిసార్లు బోర్ కొట్టించినప్పటికీ క్లైమాక్స్‌తో మళ్లీ ఊపు తెప్పిస్తుందట. ముఖ్యంగా ధరణి, వెన్నెల మధ్య ఉన్న డ్రామా సన్నివేశాలు ఆకట్టుకుంటాట. సర్‌ప్రైజింగ్ ట్విస్టులు ఏమిలేకుండా కథనం ప్లాట్‌గా సాగుతుందని చూసినవారు అంటున్నారు.

పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నాని ఎప్పటిలాగే అద్భుతంగా చేశాడట. ముఖ్యంగా తెలంగాణ యాసలో అతడు నటన అదిరిపోయిందట. ఈ సినిమా అతడి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలుస్తుందని అంటున్నారు. నాని గత చిత్రం అంటే సుందరానికి చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ దసరాతో పుంజుకున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయిందట. ఇంతకుముందెన్నడు చూడని లుక్‌లో కీర్తి కనిపిస్తుందట. నానితో కెమిస్ట్రీ బాగా వర్కౌటైంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అద్భుతంగా అందిపుచ్చుకునే కీర్తి.. దసరా చిత్రంలోనూ ఆకట్టుకుందట.

ఇక తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఒదెల.. చాలా అనుభవజ్ఞుడైన డైరెక్టర్‌గా కథను హ్యాండిల్ చేశాడట. అక్కడక్కడ సాగతీత మినహాయించి అతడి కథనం కూడా బాగుందట. భవిష్యత్తులో తెలుగులో టాప్ మోస్ట్ డైరెక్టర్ అవుతాడని నెటిజన్లు తమ ట్వీట్లతో అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందట. అయితే సంగీత దర్శకుడు ఎలివేషన్ల సీన్లలో ఇంకా మెరుగ్గా ఇచ్చుండుంటే బాగుండని అంటున్నారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయిందట. వీర్లపల్లి గ్రామాన్ని, కోల్ మైనింగ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారట. మేకర్స్ పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఓవరాల్‌గా నాని కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని సమాచారం. సినిమాకు చాలా వరకు 3కి పైనే రేటింగ్ ఇస్తున్నారు.

IPL_Entry_Point