Oh Ammalaalo from Dasara: ఓ అమ్మలాలో.. వినసొంపుగా దసరా ఫోర్త్ సింగిల్-oh ammalaalo from dasara is a soothing melody ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oh Ammalaalo From Dasara: ఓ అమ్మలాలో.. వినసొంపుగా దసరా ఫోర్త్ సింగిల్

Oh Ammalaalo from Dasara: ఓ అమ్మలాలో.. వినసొంపుగా దసరా ఫోర్త్ సింగిల్

Hari Prasad S HT Telugu
Mar 28, 2023 07:04 PM IST

Oh Ammalaalo from Dasara: ఓ అమ్మలాలో అంటూ వినసొంపుగా వచ్చేసింది దసరా ఫోర్త్ సింగిల్. మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందు మేకర్స్ ఈ మెలోడీని రిలీజ్ చేశారు.

దసరా మూవీ సెట్లో కీర్తి సురేశ్, నాని
దసరా మూవీ సెట్లో కీర్తి సురేశ్, నాని

Oh Ammalaalo from Dasara: నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మూవీ దసరా ఈ గురువారం (మార్చి 30) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు మరో సినిమా పోటీ కూడా లేకపోవడంతో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సింగిల్స్, టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో, నాని మాస్ లుక్ తో దసరా మూవీ ఓ డిఫరెంట్ ఫీల్ ను కలిగిస్తోంది. తాజాగా మంగళవారం (మార్చి 28) దసరా మేకర్స్ ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ చేశారు. ఓ అమ్మలాలో.. అంటూ సాగే మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇప్పటికే చమ్కీల అంగీ పాట ఎక్కడ చూసినా ఊపేస్తున్న సంగతి తెలుసు కదా.

ఇక ఇప్పుడీ పాట కూడా అలాగే ఉంది. మూవీలో లీడ్ రోల్స్ లో కనిపించే నాని, కీర్తి సురేశ్ మధ్య చిన్ననాటి ప్రేమను చూపిస్తూ సాగే పాట ఇది. దసరా మూవీలో ధరణి పాత్రలో నాని, వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ లిరికల్ వీడియో మనసును తాకేలా సాగింది. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనురాగ్ కులకర్ణి ఈ పాట పాడాడు.

దసరా మూవీలో నాని, కీర్తి చిన్ననాటి పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నట్లు ఈ పాట చూస్తే తెలుస్తోంది. దసరా మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. అయితే ఇప్పటి వరకూ వచ్చిన పాటలు, ట్రైలర్ చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ తీసిన సినిమాలాగా అనిపిస్తున్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు కూడా జోరుగానే ఉన్నాయి. నార్త్ లో రానాతో కలిసి నాని, కీర్తి సురేశ్ దసరాను ప్రమోట్ చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం