Nani Bollywood Wishlist: ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటే ఇష్టం.. ఆమెతో పనిచేయాలనుంది.. మనసులో మాట చెప్పిన నాని-nani says he wants to work with deepika padukone and aamir khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Says He Wants To Work With Deepika Padukone And Aamir Khan

Nani Bollywood Wishlist: ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటే ఇష్టం.. ఆమెతో పనిచేయాలనుంది.. మనసులో మాట చెప్పిన నాని

Maragani Govardhan HT Telugu
Mar 29, 2023 08:19 AM IST

Nani Bollywood Wishlist: నాని ప్రస్తుతం తను నటించిన దసరా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు దీపికా పదుకొణెతో నటించాలని ఉందని స్పష్టం చేశాడు.

నాని
నాని (HT_PRINT)

Nani Bollywood Wishlist: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా ప్రమోషన్లలో పుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనుండటంతో సర్వత్రా హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ మీడియాకు విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ బీటౌన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. హిందీలో తనకు ఛాన్స్ వస్తే దీపికా పదుకొణె, ఆమీర్‌ ఖాన్‌తో నటించాలని ఉందని స్పష్టం చేశాడు.

"నేను దీపికా పదుకొణెతో పనిచేయడాన్ని ఇష్టపడతాను. ఆమె అద్భుతమైన నటి. అవకాశం వచ్చి మంచి కథ దొరికితే ఆమె సరసన నటించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆయన తెరకెక్కించే సినిమాలంటే నాకు చాలా ఇష్టం." అని నాని తెలిపాడు.

అలాగే బాలీవుడ్‌లో ఏ హీరోతో పనిచేయాలనుందని అడగ్గా.. నాని ఆమీర్ ఖాన్ అని బదులిచ్చాడు. ఆయన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తానని స్పష్టం చేశాడు. తన భార్య అంజనా గురించి మాట్లాడుతూ.. ఆమెకు కూడా సినిమాలంటే పిచ్చి అని చెప్పాడు.

"నా భార్యకు సినిమాలంటే చాలా ఇష్టం. నా సినిమాలను చూసేందుకు రిలీజ్ రోజు మార్నింగ్ షోకు వెళ్లి చూస్తుంటుంది. ప్రేక్షకులతో పాటు మూవీ చూడటమంటే తనకు చాలా ఇష్టం. దసరా మూవీ తర్వాత చేసే సినిమాలో నేను ఓ ఆరేళ్ల పాపకు తండ్రి పాత్రలో కనిపించబోతున్నాను. అది పూర్తిగా విభిన్నమైన సినిమా. నేను దసరాలో చేసిన పాత్రకు నా తదుపరి పాత్రకు అస్సలు పొంతనే ఉండదు. పూర్తిగా భిన్నమైన చిత్రం చేస్తున్నా." అని నాని తెలిపాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point