తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dahaad Web Series: దహాడ్.. ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కచ్చితంగా చూడండి

Dahaad Web Series: దహాడ్.. ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కచ్చితంగా చూడండి

Hari Prasad S HT Telugu

17 May 2023, 10:34 IST

google News
    • Dahaad Web Series: దహాడ్.. ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
దహాడ్ వెబ్ సిరీస్ లో గుల్షన్ దేవయ్య, సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ
దహాడ్ వెబ్ సిరీస్ లో గుల్షన్ దేవయ్య, సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ

దహాడ్ వెబ్ సిరీస్ లో గుల్షన్ దేవయ్య, సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ

Dahaad Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ దహాడ్. ఇండియాలో వెబ్ సిరీస్ రావడం ప్రారంభమైన తర్వాత ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. సేక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, పాతాళ్ లోక్, ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ కోవలోకి చెందినదే ఈ దహాడ్ వెబ్ సిరీస్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ గత శుక్రవారం (మే 12) నుంచి స్ట్రీమ్ అవుతోంది. తొలి రోజు నుంచే దీనికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఆమెతోపాటు గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మలాంటి టాలెంటెడ్ నటులు ఉండటం ఈ సిరీస్ కు పెద్ద ప్లస్ పాయింట్. అమ్మాయిల మిస్సింగ్, మర్డర్ల చుట్టూ తిరిగే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది.

దహాడ్.. ఎందుకు చూడాలి?

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. మంచి స్క్రీన్ ప్లే ఉండాలే గానీ.. ఎన్ని గంటలైనా బింజ్ వాచ్ చేసేయొచ్చు. అలాంటిదే ఈ దహాడ్ సిరీస్ (Dahaad Web Series) కూడా. పెళ్లి కాని, వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న అమ్మాయిలనే టార్గెట్ గా చేసుకొని.. వాళ్లను మాయ మాటలతో లైన్లో పెట్టి.. వాళ్లను లైంగికంగా అనుభవించి, ఆ తర్వాత వాళ్లకు వాళ్లే సైనైడ్ మింగి చనిపోయేలా చేసే ఓ సీరియల్ కిల్లర్ కథే ఈ దహాడ్.

నిజానికి ఇలాంటి సిరీస్ లలో కిల్లర్ ఎవరో తెలియకుండా కథ నడిపించడం చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఈ సిరీస్ లో మాత్రం ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుస్తూనే ఉంటుంది.. అదే సమయంలో ఆ హత్యల ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతుంది. అయితే కథంగా చెబుతూనే అందులో సస్పెన్స్ మెయింటేన్ చేయడం మాత్రం చాలా కష్టమైన పని. దానిని దహాడ్ మేకర్స్ విజయవంతంగా చూపించారనడంలో సందేహం లేదు.

దహాడ్.. విజయ్ వర్మ హైలైట్

తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ ఈ దహాడ్ సిరీస్ (Dahaad Web Series) కు హైలైట్ అని చెప్పాలి. ఓ సీరియల్ కిల్లర్ గా తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన విజయ్.. దహాడ్ లోనూ తనదైన స్టైల్ చూపించాడు. ఓవైపు వరుసగా అమ్మాయిలను చంపుతూ, మరోవైపు స్కూల్లో హిందీ టీచర్ గా హుందాతనాన్ని చూపిస్తూ విజయ్ పాత్ర చాలా ఆసక్తిగా సాగిపోతుంది.

దహాడ్.. 8 ఎపిసోడ్లు, ఏడున్నర గంటలు

దహాడ్ వెబ్ సిరీస్ (Dahaad Web Series) నిజానికి చాలా చాలా ఎక్కువ సమయమే తీసుకుంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నుంచి 55 నిమిషాల పాటు ఉంటుంది. అలా మొత్తం 8 ఎపిసోడ్లు. కానీ కథ ఎక్కడా నెమ్మదిగా సాగుతున్నట్లుగా, బోర్ గా అనిపించకపోవడమే ఈ సిరీస్ సాధించిన విజయంగా చెప్పొచ్చు. ఒక్క చివరి ఎపిసోడ్ మాత్రమే కాస్త మైనస్ అని చెప్పొచ్చు. అంతవరకూ సాగిన సస్పెన్స్ ను సడెన్ గా ముగించినట్లు అనిపించడమే కాస్త ప్రేక్షకులకు అసంతృప్తిని మిగిల్చవచ్చు.

దహాడ్.. మహిళల కోసం.. మహిళలు తీసిన సిరీస్

ఈ దహాడ్ వెబ్ సిరీస్ (Dahaad Web Series) మొత్తం మహిళల కోసం మహిళలు తీసిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ క్రియేట్ చేసి, స్క్రీన్ ప్లే అందించగా.. రీమా కగ్టి దర్శకత్వం వహించింది. నిజానికి సైనైడ్ మోహన్ గా పేరుగాంచిన ఓ సీరియల్ కిల్లర్ స్టోరీ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కినట్లు కనిపించినా.. అదే సమయంలో సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా దహాడ్ అద్దం పట్టింది. ఎంతో వివాదాస్పదమైన లవ్ జిహాద్ అంశాన్ని కూడా ఈ సిరీస్ లో టచ్ చేశారు.

దహాడ్.. స్టార్ కాస్ట్

దహాడ్ వెబ్ సిరీస్ (Dahaad Web Series) తో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అడుగుపెట్టింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. అంజలి భాటి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటించింది. ఓ దళితురాలిగా సమాజం తనకు విసిరే సవాళ్లను ఎదుర్కొంటూనే 29 మంది అమ్మాయిలను పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ఆమె చేసే సాహసం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సీరియల్ కిల్లర్ పాత్రలో విజయ్ వర్మ, ఇతర పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో సోహమ్ షా, గుల్షన్ దేవయ్యలు కూడా ఈ సిరీస్ కు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.

తదుపరి వ్యాసం