Dahaad Web Series OTT Release Date: సోనాక్షి నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే-dahaad web series ott release date announced on thursday april 20th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dahaad Web Series Ott Release Date: సోనాక్షి నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Dahaad Web Series OTT Release Date: సోనాక్షి నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Apr 20, 2023 03:37 PM IST

Dahaad Web Series OTT Release Date: సోనాక్షి నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ తెలిసిపోయింది. ఈ దహాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.

దహాద్ వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా
దహాద్ వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా

Dahaad Web Series OTT Release Date: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన తొలి వెబ్ సిరీస్ దహాద్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవనుంది. తాజాగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. దహాద్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. రీమా కంగ్టి, జోయా అక్తర్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ మే 12 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవనుంది.

ఈ విషయాన్ని సిరీస్ మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ దహాద్ సిరీస్ ను రీమా కంగ్టి, రుచికా ఒబెరాయ్ డైరెక్ట్ చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ ను ఇప్పటికే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ లో సోనాక్షి పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తోంది. గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మ, సోహమ్ షా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్స్, టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తం ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేశాయి. గౌరవ్ రైనా, తరానా మార్వా మ్యూజిక్ అందించారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నటులు ఓటీటీల్లోకి రావడం సాధారణమైపోయింది. సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవ్‌గన్, మాధురి దీక్షిత్, సుష్మితా సేన్, అదితి రావ్ హైదరీలాంటి నటులు తరచూ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

ఇటు తెలుగులోనూ ఈ మధ్యే వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో కూడా రానానాయుడుతో ఓటీటీలోకి వచ్చాడు. తమన్నా, రెజీనా, సమంత, నాగ చైతన్య, సుశాంత్ లాంటి వాళ్లు ఓటీటీల్లో వెబ్ సిరీస్ ల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా కూడా దహాద్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సంబంధిత కథనం