Samantha Necklace: ఒంటిపై రూ.6 కోట్ల నగలతో మెరిసిపోయిన సమంత.. ఫొటోలు వైరల్-samantha wear necklace worth 3 crores at citadel premier ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Necklace: ఒంటిపై రూ.6 కోట్ల నగలతో మెరిసిపోయిన సమంత.. ఫొటోలు వైరల్

Samantha Necklace: ఒంటిపై రూ.6 కోట్ల నగలతో మెరిసిపోయిన సమంత.. ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
Apr 19, 2023 07:15 PM IST

Samantha Necklace: ఒంటిపై రూ.6 కోట్ల నగలతో మెరిసిపోయింది సమంత. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సిటడెల్ ప్రీమియర్ షోకి వచ్చిన ఆమె.. బ్లాక్ ఔట్‌ఫిట్ లో కనిపించింది.

రూ.6 కోట్ల విలువైన నెక్లెస్, బ్రేస్‌లెట్ తో సమంత
రూ.6 కోట్ల విలువైన నెక్లెస్, బ్రేస్‌లెట్ తో సమంత

Samantha Necklace: శాకుంతలం ఇచ్చిన షాక్‌తో భగవద్గీత శ్లోకాలు వల్లెవేసిన సమంత.. మరుసటి రోజే లండన్ లో సిటడెల్ ప్రీమియర్ షోలో మెరిసింది. నిజానికి ఈ షోలో సమంతనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం. ఇండియన్ వెర్షన్ సిటడెల్ లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో సమంతతోపాటు నటించిన వరుణ్ ధావన్.. సిరీస్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే కూడా సిటడెల్ ప్రీమియర్ కు హాజరయ్యారు.

ఈ షోకు సమంత బ్లాక్ ఔట్‌ఫిట్ లో వచ్చింది. అయితే ఆ డ్రెస్ పై ఆమె ధరించిన నెక్లెస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. సమంత ధరించిన సెర్పెంటి నెక్లెస్ విలువ సుమారు రూ.3 కోట్లు కావడం విశేషం. ఈ నెక్లెస్ ఓ పాము ఆకారంలో కనిపించింది. ఇక మరో రూ.3 కోట్ల విలువైన బ్రేస్‌లెట్ ఆమె చేతికి ఉంది. ఈ రెండు నగలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఏకంగా రూ.6 కోట్ల విలువైన నగలతో ఆమె ఈ ప్రీమియర్ షోకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా ఈ సెర్పెంటీ నెక్లెస్ తో కనిపించి కనువిందు చేసింది. కొన్నేళ్ల కిందట మరో నటి ప్రియాంకా చోప్రా కూడా ఇదే సెర్పెంటి నెక్లెస్ లో మెరిసిపోయింది. ఈ సిటడెల్ ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంకానే నటించిన విషయం తెలిసిందే.

మరోవైపు సమంత నటించిన శాకుంతలం మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫెయిల్యూర్ తో సామ్.. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ భగవద్గీత శ్లోకాన్ని పోస్ట్ చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

సంబంధిత కథనం