Samantha On Shaakuntalam Result: శాకుంత‌లం రిజ‌ల్ట్‌పై స్పందించిన స‌మంత - వైర‌ల్ అవుతోన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌-samantha reacts on shaakuntalam result cryptic post on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha Reacts On Shaakuntalam Result Cryptic Post On Instagram

Samantha On Shaakuntalam Result: శాకుంత‌లం రిజ‌ల్ట్‌పై స్పందించిన స‌మంత - వైర‌ల్ అవుతోన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 18, 2023 02:15 PM IST

Samantha On Shaakuntalam Result: శాకుంత‌లం రిజ‌ల్ట్‌పై మంగ‌ళ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత చేసిన ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ స‌మంత చేసిన ఈ పోస్ట్‌లో ఏమున్న‌దంటే...

 స‌మంత
స‌మంత

Samantha On Shaakuntalam Result: శాకుంత‌లం రిజ‌ల్ట్‌పై ప‌రోక్షంగా స‌మంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స‌మంత టైటిల్ పాత్ర‌లో పౌరాణిక క‌థాంశంతో రూపొందిన శాకుంత‌లం సినిమా గ‌త శుక్ర‌వారం ఆడియెన్స్‌ ముందుకొచ్చింది. భారీ అంచ‌నాల‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు సినిమాలోని వీఎఫ్ఎక్స్‌, స‌మంత‌, దేవ్ మోహ‌న్ యాక్టింగ్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. దాదాపు 40 కోట్ల వ్య‌యంతో రూపొందిన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో కేవ‌లం నాలుగున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టి డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

శాకుంత‌లం రిజ‌ల్ట్‌పై ఇన్‌డైరెక్ట్‌గా స‌మంత రియాక్ట్ అయ్యింది. మంగ‌ళ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌గ‌వ‌ద్గీత‌లోని ఓ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. క‌ర్మ‌ణ్యే వాధికా ర‌స్తే మా ఫ‌లేషు క‌దాచ‌న మా క‌ర్మ ఫ‌ల‌హేతూర్భూ మా తే సంగోత్స‌వ ఆక‌ర్మ‌ణి అంటూ స‌మంత ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది. క‌ర్మ చేయ‌డానికే మాత్ర‌మే కానీ క‌ర్మ‌ఫ‌లానికి అధికారివి కాదు. ప్ర‌తిఫ‌లాపేక్ష‌తో క‌ర్మ‌ల‌ను చేయ‌కు. అలాగ‌ని క‌ర్మ‌ల‌ను చేయ‌డం మ‌న‌కు అని ఈ శ్లోకం అర్థం. శాకుంత‌లం రిజ‌ల్ట్‌ను ఉద్దేశించి స‌మంత ఈ పోస్ట్‌ను పెట్టిన‌ట్లుగా నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతోన్నారు.

సినిమా రిజ‌ల్ట్ అన్న‌ది త‌న చేతులో లేద‌ని, ఈ రిజ‌ల్ట్‌కు తాను బాధ్యురాలిని కాద‌ని స‌మంత ఈ పోస్ట్ ద్వారా పేర్కొన్న‌ట్లు చెబుతోన్నారు. ప‌రాజ‌యం పాలైనంత మాత్రానా సినిమాలు చేయ‌డం ఆప‌న‌ని ఇన్‌డైరెక్ట్‌గా స‌మంత చెప్పింద‌ని అంటోన్నారు. స‌మంత చేసిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో పాటు ఫ్లైట్‌ జ‌ర్నీ చేస్తోన్న ఓ ఫొటోను జోడించింది స‌మంత‌.

ఫ్యామిలీ మ్యాన్ - 2 సిరీస్ త‌ర్వాత ద‌ర్శ‌కద్వ‌యం రాజ్‌డీకేల‌తో హిందీలో ఓ యాక్ష‌న్ వెబ్‌సిరీస్ చేస్తోంది స‌మంత‌. ఈ సిరీస్ కోసం ఆమె సోమ‌వారం లండ‌న్ బ‌య‌లుదేరింది. ఈ జ‌ర్నీకి సంబంధించిన ఫొటో ఇద‌ని స‌మాచారం. కాగా శాకుంత‌లం సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ సినిమాలో స‌మంత శ‌కుంత‌ల‌గా న‌టించ‌గా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ దుష్యంతుడి పాత్ర‌ను పోషించారు. శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్ కూతురు నీలిమ‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మించారు.

IPL_Entry_Point