Dasara OTT Release date: దసరా ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?
Dasara OTT Telugu: నాని నటించిన దసరా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. అనుకున్న సమయం కంటే చాలా ముందుగానే విడుదల కానుంది. ఈ నెలలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది.
Dasara OTT Release date: నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది. థియేటర్లలో ఇప్పటికీ కాసులను కురిపిస్తోన్న ఈ సినిమా అప్పుడే ఓటీటీలో వచ్చేందుకు ముస్తాబైంది. అందరూ అనుకున్నట్లుగా మే చివర్లో కాకుండా.. అనుకున్నదానికంటే చాలా ముందుగానే ఓటీటీలో సందడి చేయనుంది.
Dasara OTT Telugu: దసరా రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో దసరా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 27 నుంచి డిజిటల్ వేదికపై ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించింది. మీరు ఊహించినదానికంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. దీన్ని బట్టి చూస్తుంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోపే దసరా డిజిటల్ స్ట్రీమింగ్ అవనుంది.
Dasara Collections: థియేటర్లలో దసరా వసూళ్ల వర్షం..
దసరా చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైనప్పటికీ మిగిలిన భాషల్లో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన కలెక్షన్లను సాధించిన ఈ సినిమా కేజీఎఫ్, పుష్ప మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. తెలుగులో మాత్రం 100 కోట్ల గ్రాస్‌ను ఎప్పుడో దాటిన ఈ మూవీ 120 కోట్లకు చేరువలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ షేర్ వచ్చేసి 50 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 70 కోట్లకు చేరువలో ఉన్నట్లు సమాచారం. ఈ వసూళ్లు నాని కెరీర్‌లోనే అత్యధికం.
ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కంటే కూడా దసరా చిత్రానికి అత్యధికంగా ఓపెనింగ్స్ వచ్చాయి. బాలీవుడ్ మూవీ తలదన్నే రీతిలో వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ మూవీ.. ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Dasara Story: అసలు కథేంటంటే..
తెలంగాణలోని సింగరేణి సమీపంలోని వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ధరణి(నాని), సూరి(దీక్షిత్ శెట్టి), వెన్నెల(కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రైళ్లలో బొగ్గు దొంగతనం చేయడం, స్నేహితులతో కలిసి తాగుతూ, తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. అయితే ఊరిలో జరిగే సర్పంచ్ ఎన్నికలు ఒక్కసారిగా వారి జీవితాలను తలకిందులు చేస్తాయి. చిన్న నంబి(షైన్ టామ్ చాకో) పోటీ చేసిన ఆ ఎన్నికల్లో సూరి అతడి స్నేహితులు రాజన్న(సాయికుమార్)కు మద్దతుగా నిలిచి గెలిపిస్తారు. ఆ తర్వాత నాని, సూరి, వెన్నెల జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి పరిణామాలు ఏంటి? వారి జీవితాలా ఎలా మారాయి? లాంటి విషయాలను తెలుసుకోవాలంటి ఈ సినిమా చూడాల్సిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.