Mirzapur season 3: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తుంది
Mirzapur season 3: మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మూడో సీజన్ రాబోతున్నది. మీర్జాపూర్ 3 కి సంబంధించి నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ కీలకమైన అప్ డేట్ ను ప్రకటించింది.
Mirzapur season 3: పొలిటికల్, గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ లకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో మూడో సీజన్ షూటింగ్ మొదలుపెట్టినట్లు నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది. సీజన్ 3 లోడింగ్ అంటూ ఆన్ లొకేషన్ స్టిల్ ను షేర్ చేసింది. ఈ ఫొటోలో అలీఫజల్ తో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు.
మూడో సీజన్ కు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుపుతున్నట్లుగా సమాచారం. రెండో సీజన్ కు కొనసాగింపుగా ఫ్యామిలీ ఆధిపత్య పోరు, గుడ్డుతో కలీమ్ భయ్య అనుచరులు సాగించే పోరాటం చుట్టూ మూడో సీజన్ కథ తిరుగుతుందని సమాచారం. ఇందులో అలీ ఫజల్ క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. మూడో సీజన్ లో కొన్ని కొత్త పాత్రలను కనిపిస్తాయని అంటున్నారు. ఈ
ఏడాదిలో చివరలో మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మీర్జాపూర్ సిరీస్ ను ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రితేష్ సిద్వాని, పర్షాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ గత సీజన్స్ కు దర్శకత్వం వహించాడు. మూడో సీజన్ కు కూడా దర్శకత్వ బాధ్యతల్ని వారే చేపట్టారు.
2018లో రిలీజ్ అయిన ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నది. మితి మీరిన హింస ఉందనే టాక్ వచ్చినా ఇందులో ఉపయోగించిన యూపీ యాస, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ యాక్టింగ్ ప్రశంసలు లభించాయి. సీజన్ 2 కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నది.