కేజీఎఫ్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 3 నుంచి-prime video announces digital premiere date of k g f chapter two ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కేజీఎఫ్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 3 నుంచి

కేజీఎఫ్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 3 నుంచి

HT Telugu Desk HT Telugu
May 31, 2022 02:45 PM IST

కేజీఎఫ్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 3 నుంచి అందుబాటులోకి రానుంది.

<p>అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేజీఎఫ్ ఛాప్టర్ 2</p>
అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Twitter)

ముంబై, మే 31: యశ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 3 నుంచి అందుబాటులోకి రానుంది.

తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియాలోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ వీక్షించడానికి రూ. 199 అద్దె చెల్లించాల్సి వచ్చేది. జూన్ 3 నుంచి సబ్‌స్క్రయిబర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని హోమేబుల్ ఫిల్మ్స్ నిర్మించింది. 2018లో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1కు ఇది సీక్వెల్‌గా వచ్చింది.

ఈ మూవీ కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా రిలీజైంది.

అనాథ నుంచి ఓ బంగారు గనికి అధినేతగా మారిన వ్యక్తి కథలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 రెండో భాగంగా వచ్చింది.

‘అతను నారాచి ప్రజలకు హీరో, అలాగే రక్షకుడు. తన తల్లికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతడు అధీర, ఇనాయత్ ఖలీల్, రమిక సేన్ రూపంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని సినిమా అధికారిక సారాంశం ఉంటుంది.

‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు, అచ్యుత్ కుమార్, అర్చన జోయిస్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

Whats_app_banner

సంబంధిత కథనం