తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ahimsa Trailer: ధ‌ర్మం కోసం యుద్ధం చేసిన కృష్ణుడు - అహింస ట్రైల‌ర్ రిలీజ్‌

Ahimsa Trailer: ధ‌ర్మం కోసం యుద్ధం చేసిన కృష్ణుడు - అహింస ట్రైల‌ర్ రిలీజ్‌

12 January 2023, 13:02 IST

  • Ahimsa Trailer: ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం అహింస‌. ఈ సినిమా ట్రైల‌ర్‌ను గురువారం రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశాడు.

అహింస‌
అహింస‌

అహింస‌

Ahimsa Trailer: ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతోన్నాడు. సురేష్‌బాబు త‌న‌యుడు, రానా సోద‌రుడు అభిరామ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం అహింస‌. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

ఈ సినిమా ట్రైల‌ర్‌ను గురువారం మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశాడు. వీడి గురించి మీకు తెలియ‌దు అంటూ పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేసే సీన్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. త‌న‌పై అక్ర‌మంగా కేసు పెట్టిన వారిని ఎదురించ‌లేని పిరికివాడిగా ట్రైల‌ర్‌లో అభిరామ్ క‌నిపించారు. అలాగే బావ మ‌ర‌ద‌ళ్ల అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను ట్రైల‌ర్‌లో చూపించారు.

ఓ వైపు పోలీసులు, మ‌రోవైపు విల‌న్స్ నాయ‌కానాయిక‌ల్ని వెత‌క‌డం, వారి నుంచి త‌ప్పించుకునే సీన్స్ ఇంట్రెస్ట్‌ను క‌లిగిస్తున్నాయి. ఎప్పుడు గాంధీగారే క‌రెక్ట్ కృష్ణుడు రాంగ్ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌కు లేదు కృష్ణుడే క‌రెక్ట్ నా కుటుంబాన్ని, నా ప‌రివారాన్ని న‌న్ను న‌మ్ముకున్న వాళ్ల‌ను కాపాడ‌ట‌మే నా ధ‌ర్మం. ఇప్పుడు నేను ధ‌ర్మం కోసం యుద్ధం చేయాల్సిందే అంటూ అభిరామ్ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. శాంత స్వ‌భావుడైన ఓ యువ‌కుడు త‌న ప్రేమ కోసం హింస బాట‌ను ఎలా ప‌ట్టాడ‌న్న‌ది ద‌ర్శ‌కుడు తేజ అహింస సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో లాయ‌ర్ పాత్ర‌లో స‌దా న‌టిస్తోంది. గీతిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌జ‌త్ బేడీ, ర‌వికాలే, క‌మ‌ల్ కామ‌రాజు కీల‌క‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో ఈసినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.