తెలుగు న్యూస్  /  Entertainment  /  City Of Dreams Season 3 Streaming Date Revealed By Disney Plus Hotstar

City of Dreams Season 3 Streaming Date: సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేది ఆ రోజే.. డేట్ రివీల్ చేసిన హాట్‌స్టార్

Hari Prasad S HT Telugu

12 May 2023, 15:23 IST

    • City of Dreams Season 3 Streaming Date: సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేది ఆ రోజే. తాజాగా శుక్రవారం (మే 12) ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసింది హాట్‌స్టార్.
సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన హాట్‌స్టార
సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన హాట్‌స్టార

సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన హాట్‌స్టార

City of Dreams Season 3 Streaming Date: సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోని హిట్ వెబ్ సిరీస్ లో ఒకటైన ఈ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. మూడో సీజన్ తో రాబోతోంది. తాజాగా శుక్రవారం (మే 12) ఈ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమిండ్ డేట్ ను హాట్‌స్టార్ రివీల్ చేసింది. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

Thandel OTT Rights: నాగ చైతన్య తండేల్ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి.. చైతూ కెరీర్లోనే అత్యధికం

Bigg Boss Priyanka: హైదరాబాద్‌లో భూమి కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. వీడియో అసలు విషయం చెప్పిన వంటలక్క

NNS 29th April Episode: ​​మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!

సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 మే 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్‌స్టార్ వెల్లడించింది. రెండు సీజన్లలాగే మూడో సీజన్ కూడా రసవత్తరంగా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మహారాష్ట్ర పీఠం కోసం గైక్వాడ్ ఫ్యామిలీలోనే కాదు.. వాళ్ల పార్టీలోనూ కొత్త, పాత శక్తులు చేతులు కలుపుతున్నాయి. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ ఎంతో ఆసక్తి రేపుతోంది.

తమ కుర్చీని కాపాడుకోవడం కోసం తండ్రీకూతుళ్లయిన అమేయ గైక్వాడ్ (అతుల్ కులకర్ణి), పూర్ణిమా గైక్వాడ్ (ప్రియా బాపట్) ఒక్కటి కాబోతున్నారు. తెరవెనుక రాజకీయాలు ఎలా ఉంటాయి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని ఎందుకు అంటారో ఈ మూడో సీజన్ కళ్లకు కట్టబోతోంది. ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.

ఈ మూడో సీజన్ గురించి అతుల్ కులకర్ణి స్పందించాడు. "సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 మరింత లోతుగా గైక్వాడ్ ఫ్యామిలీ, వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లు, రాజకీయాల్లోకి మరింత లోతుగా వెళ్లనుంది. ఇందులో నటించడం చాలా సంత్రుప్తిగా కలిగిస్తోంది. నా పాత్ర అయిన అమేయ రావ్ గైక్వాడ్ ప్రతి స్టెప్ లోనూ మరింత బలోపేతమవుతుంది. ఈ సీజన్ లో ఓ కొత్త గైక్వాడ్ ను చూస్తారు" అని అతుల్ అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.