తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayyafirst Single: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ - మాస్ లుక్‌లో చిరు

Waltair VeerayyaFirst Single: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ - మాస్ లుక్‌లో చిరు

20 November 2022, 17:00 IST

  • Waltair VeerayyaFirst Single: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ఆదివారం అనౌన్స్ చేశారు. ఈ పాట ఎప్పుడూ రిలీజ్ కానుందంటే...

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Waltair VeerayyaFirst Single: వాల్తేర్ వీర‌య్య సినిమాతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రెండు నెల‌ల ముందుగానే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది చిత్ర యూనిట్‌. ఆదివారం ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. బాస్ పార్టీ అనే ప‌ల్ల‌వితో సాగే ఈ పాట‌ను న‌వంబ‌ర్ 23న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

చిరంజీవి మాస్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో లుంగీ ధ‌రించి పూల‌చొక్కాలో చిరంజీవి క‌నిపిస్తున్నారు. బాస్ పార్టీలో సాంగ్‌లో చిరంజీవితో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా స్టెప్పులేసింది. ఈ బాస్ పార్టీ పాట‌కు చిరంజీవి డ్యాన్స్‌ల‌తో పాటు ఊర్వశి రౌటేలా గ్లామ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. జాల‌ర్ల బ్యాక్‌డ్రాప్‌లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వాల్తేర్ వీర‌య్య సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు కె.ఎస్ ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కీల‌క పాత్ర పోషిస్తోన్నారు. చిరంజీవికి జోడిగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. పాట‌ల చిత్రీక‌ర‌ణ ఒక్క‌టే బ్యాలెన్స్‌గా మిగిలిన‌ట్లు చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌తోపాటు బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇద్ద‌రు అగ్ర హీరోలు సంక్రాంతికి పోటీప‌డ‌టం టాలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.