తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Arrived As Chief Guest For Vnrtrio Grand Launch

VNRTrio Launch: అట్టహాసంగా నితిన్-వెంకీ కుడుముల చిత్రం ఆరంభం.. ముఖ్య అతిథిగా మెగాస్టార్

24 March 2023, 14:15 IST

  • VNRTrio Launch: నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్‍‌గా చేస్తున్న తాజా చిత్రం VNRTrio. వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

నితిన్ మూవీ ఓపెనింగ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్
నితిన్ మూవీ ఓపెనింగ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్

నితిన్ మూవీ ఓపెనింగ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్

VNRTrio Launch: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి సినిమా ప్రకటన వస్తుందంటే విపరీతమైన బజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైనా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో మన హీరోలు సినిమా చేస్తున్నారంటే అంచనాలు ముందే పెరిగిపోతాయి. చలో, భీష్మ లాంటి సూపర్ హిట్లు అందుకున్న వెంకీ కుడుముల.. గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు పక్కాలెక్కలేదు. దీంతో వీరి కాంబినేషన్ మిస్సయింది. ఈ విధంగా కాంబో విఫలమైందంటే సదరు హీరోలు, డైరెక్టర్ల మధ్య నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ మన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. వెంకీ కుడుములతో సినిమా చేయనప్పటికీ.. అతడి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లాంచ్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

వెంకీ కుడుముల, రష్మిక, నితిన్ కాంబోలో #VNRTrio అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ వీడియోను కూడా చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ ఛీఫ్ గెస్టుగా విచ్చేశారు. అంతేకాకుండా ముహూర్తపు షాట్‌పై ఆయన క్లాప్ కూడా కొట్టారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మైకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిరంజీవితో ఓ సినిమా తీసేందుకు వెంకీ కుడుముల చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇందుకోసం అతడు స్క్రిప్టును కూడా రెడీ చేసుకున్నాడు. అయితే ఆ స్క్రీప్టుతో చిరంజీవి పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశాడు. ఇప్పుడు నితిన్ కోసం మరో సరికొత్త స్క్రిప్టును రెడీ చేసుకుని ఆ చిత్రాన్ని ప్రారంభించాడు. తాజాగా ఈ సినిమా లాంచ్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా రావడం హాట్ టాపిక్గా మారింది. వెంకీ కుడుముల కోరిక మేరక చిరంజీవి ఈ ఈవెంట్‌కు వచ్చి ఉంటాడని సినీ జనాలు అనుకుంటున్నారు. ఏదైతేనేం.. తన పెద్దరికంతో చిరు.. ఈ నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

ముహూర్తపు షాట్‌పై క్లాప్ కొడుతున్న చిరంజీవి
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.