Bholaa Shankar Release Date: భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగాస్టార్ మూవీ ఎప్పుడు వస్తోందంటే..-bholaa shankar release date announced by the makers on tuesday march 21st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bholaa Shankar Release Date Announced By The Makers On Tuesday March 21st

Bholaa Shankar Release Date: భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగాస్టార్ మూవీ ఎప్పుడు వస్తోందంటే..

Hari Prasad S HT Telugu
Mar 21, 2023 10:07 PM IST

Bholaa Shankar Release Date: భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్యలాంటి మెగా హిట్స్ తో ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి.. హ్యాట్రిక్ పై కన్నేశాడు.

భోళా శంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్
భోళా శంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్

Bholaa Shankar Release Date: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండు వరుస హిట్లతో ఊపు మీదున్నాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఢీలా పడిన మెగా ఫ్యాన్స్ లో గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్యలతో మళ్లీ ఉత్సాహం నింపాడు చిరంజీవి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ విజయాల కోసం తహతహలాడుతున్నాడు. భోళా శంకర్ మూవీతో అతడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మంగళవారం (మార్చి 21) రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. తమిళంలో అజిత్ సూపర్ హిట్ వేదలం మూవీకి ఇది రీమేక్. అంతేకాదు పదేళ్ల తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ.

ఉగాది కానుకగా మెగా అభిమానులకు భోళా శంకర్ రిలీజ్ డేట్ తో సర్‌ప్రైజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా ఓ కలర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవితోపాటు కీర్తి సురేశ్, తమన్నా కూడా ఉన్నారు. నిజానికి ఈ భోళా శంకర్ మూవీ ఏప్రిల్ 14నే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ ను వాయిదా వేశారు.

ఈ కొత్త రిలీజ్ డేట్ ను పక్కాగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం మంగళవారం వస్తోంది. ఆ లెక్కన వీకెండ్ కాస్త ఎక్కువే ఉంటుంది. అంతకుముందు శుక్రవారం (ఆగస్ట్ 11) సినిమా రిలీజ్ చేయడం ద్వారా దాదాపు ఐదు రోజుల పాటు బాక్సాఫీస్ ను దున్నేయొచ్చన్నది మేకర్స్ ప్లాన్ గా కనిపిస్తోంది.

ఈ భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేశ్.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది. నిజానికి గతేడాది రాఖీ పండగ సందర్భంగానే చిరుకి కీర్తి రాఖీ కడుతున్న వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రాఖీ సమయంలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక చిరంజీవి సరసన తమన్నా నటిస్తోంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.